Are journalists being divided?
Why separate accreditation cards for reporters and desk journalists?
All journalists are the same. Desk journalists also go for field reporting.
The decision to issue Accreditation Cards only to reporters and Media Cards to desk journalists is unjustified and unfair.
This move is creating negative sentiment against the government within journalist circles.
The accreditation guidelines must be revised immediately.
@revanth_anumula@INC_Ponguleti@TelanganaCMO@ChekkaKarnan
OG movie premiere shows are being looted with black tickets! Fans are being charged ���10k–₹20k per ticket, exploiting their love for Pawan Kalyan. Govt promised no premieres—yet fans are cheated. Stop black ticket mafia. Fans, unite against this loot! #StopBlackTickets #OG #StopLoot @revanth_anumula @CVAnandIPS @CPCyberabad @RachakondaCop @PawanKalyan
మయసభ వెబ్ సిరీస్ చూసినప్పటి నుంచి ఈ పోస్ట్ ఎప్పుడెప్పుడు పెట్టాలా అని రక్తం ఉరకలెత్తింది!
దర్శకుడి లాగే నేను కూడా ఒక డిస్క్లెమర్ ఇస్తాను. నా అభిప్రాయం అందరిని ఉద్దేశించింది కాదని!
ఇక పాయింటుకొద్దాం..
వివక్ష, చిన్నచూపు. వెనుకబడిన, దళిత, అణగారిన వర్గాలపై ఏనాటి నుంచో ఉంది. బ్యాక్వర్డ్ ��ంటే వెనకాలే ఉండాలని సొసైటీ ఏనాడో సింబలైజ్ చేసింది. ఆ దురహంకార వారసత్వాన్ని సోకాల్డ్ సినిమా తెరమీద తెమడలు తెమడలుగా కక్కుతునే ఉంది. వెనుబడిన వర్గాల క్యారెక్టర్ని ఎంత అసహ్యంగా పోట్రే చేస్తే, అంతగా వారి ఇగో సాటిఫ్ఫై అవుతుంది. ఆ భావజాలాన్ని పొల్లుపోకుండా క్యారీ చేయడంతో దర్శకుడు దేవ కట్ట సక్సెస్ అయ్యాడు. అగ్రవర్ణ దురహంకారులు (*పైన డిస్‌క్లెయిమర్ రిపీట్) మానుకవోడంలేదు. మయసభలో దర్���కుడు నిజజీవిత పాత్రలను వెబ్‌సిరీస్‌గా మలిచాడు. ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని ఒక డిస్క్లైమర్ జనం మొహాన విసిరేసి, తన ప్యూడల్ భావజాలాన్ని గ్యాలెన్ల కొద్దీ సమాజంలో ఎక్కించే ప్రయత్నం చేశాడు. అదేం వృధా కా��ుండా పోదు. సినిమా అయినా, వెబ్ సిరీస్ ఐనా, అది సమాజాన్ని ఇంపాక్ట్ చేసే ఒక ప్రభావిత శక్తి. అలాంటి పవర్ ఫుల్ మీడియాను ఉపయోగించుకుని తీసిన, తీస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సమాజంలో ఏదో ఒక రూపంలో గ్లోరిఫై అవుతుంటాయి.
ముఖ్యమంత్రి పదవి కోసం ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాందీ కాళ్లు పట్టుకున్నాడని దేవకట్ట వెబ్‌సిరీస్‌లో చూపించాడు. ఇక్కడ నేను తీవ్రంగా డిఫర్ అవుతున్నా. అది ఆక్షేపణీయం. చంద్రబాబు నాయుడు, వైఎస్. రాజశేఖర్‌రెడ్డి, లాంటి వాళ్లను ఇదే సిరీస్‌లో హీరోలుగా చూపించిన దేవకట్ట.. వెనుకబడినవర్గాల నాయకుడిని మాత్రం నేలబారుగా చూపించాడు. 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, నాలుగుసార్లు బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనా నేత, అప్పట్లో ఉస్మానియా నుంచి బీకాం డిగ్రీ చదివి, వెనుకబడిన వర్గాల నాయకుడు, ఒకసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం రాజారాంను ఉద్దేశించి దేవకట్ట తీసిన సీన్ వెనుకబడిన, దళిత వర్గాల ఆత్మభిమాన్ని తీవ్రంగా గాయపరిచింది. సీఎం పదవి ఇస్తానంటే ఇందిరాగాంధీ కాళ్లు పట్టుకున్నాడని చూపించిన సీన్ ఆయా వర్గాలపై విషం కక్కడమే తప్ప మరో ఉద్దేశం లేదక్కడ అనేది నా అభిప్రాయం.
అగ్రవర్ణ నేతలు రాజకీయంగా ఎదగడానికి చేసిన ప్రయ��్నాలను హీరోయిజంగా కీర్తించి, చిత్రీకరించిన దర్శకుడు దేవ కట్ట.. వెనుకబడిన, దళిత వర్గాలు అంటే కాళ్లు పట్టుకుంటారని.. వాళ్లంతా నీచ మానవులనీ, తాగుబోతులు, అసహ్యంగా ప్రవర్తిస్తారని, క్యాబరే డ్యాన్సర్లతో కలిసి చిందులేసే వారని.. ఇలా ఎంత చేయాలో అంత చేశాడు. ఇది ఏమాత్రం సమర్ధనీయం కాదు. వెనుకబడిన, దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడం చిన్నమాట. ఇది వెబ్‌సిరీస్.. కల్పిత కథ.. అని కాకమ్మ కథ చెబితే సరిపోదు. సీఎంలు అయిన ఇద్దరు నేతల ఇతివృత్తాన్ని తీసుకుని తీసిన సిరీస్‌లో.. అన్ని నిజాలు చెప్పడానికి నీకు ధైర్యం లేదు. కానీ ఒక వెనుకబడిన, దళిత వర్గాల నేతలను ఉద్దేశించి మాత్రం విచ్చలవిడిగా అబద్ధాలను అల్లడానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందా?
చూడు మిస్టర్ దేవకట్ట.. సీఎం కుర్చీ కోసం వెనుకబడిన వర్గాలు, దళితులు మతకలహాలను సృష్టించలేదు. వెన్నుపోట్లు పొడవలేదు. వెనక ఉండి గోతులు తీయలేదు. కానీ మీరు రాజారాం విషయంలో, టంగుటూరి అంజయ్య విషయంలో అల్లిన కథ తాడిత, పీడిత వర్గాలపై మీకున్న వివక్షను, వ��ద్వేషాన్ని చూపించింది. అందుకే ఇలాంటి వెబ్‌సిరీస్‌ను బహిష్కరించాలని అంటున్నా. వెనుకబడిన, దళిత వర్గాలకు దర్శకుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. వెనుకబడిన, దళిత వర్గాల నేతలు తాగుబోతులు, కాళ్లుపట్టుకుని పదవులు సంపాదించే నేతలు అన్నట్లుగా చూపించిన నీ వెబ్‌సిరీస్ ఈ సమాజం బహిష్కరించాలి. మేధావులు, బుద్ధిజీవులంతా ఈ విషయంపై ఆలోచించాలి.
-మీ దొంతు రమేష్ @devakatta @SonyLIV #Mayasabha