ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు 'మార్గదర్శి'గా నిలిచి, ఆర్థిక భరోసాతో పాటు జీవితంలో ఎదగడానికి మార్గదర్శనం చూపిన మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఎన్నో సంస్థలతో తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆ గొప్ప మనిషి పుట్టినరోజు (జయంతి) సందర్భంగా ఘన నివాళులు. 🙏💐 #RamojiRao #Eenadu #Margadarsi #RamojiFilmCity
ఇదంతా యాదృచ్ఛికమా, లేక స్వామి వ్రాసిన కథా?
అర్ధరాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్… తిరుమల మూతపడే ప్రమాదం!
1999. కొండపై ఒక్క చుక్క వాన లేదు.
నైరుతి రుతుపవనాలు మొహం చాటేశాయి. పాపనాశనం, గోగర్భం రిజర్వాయర్లు ఒక్కొక్కటిగా అడుగంటిపోయాయి. కొండపై వేలాది గదులు, ప్రతిరోజూ లక్షలాది భక్తులు. కానీ నీరు? రోజురోజుకూ తగ్గిపోతోంది.
టీటీడీ అధికారుల గుండెల్లో గుబులు. అత్యవసర సమావేశం. చివరికి ఆ భయంకర నిజాన్ని మోసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారు.
"రెండు నెలల్లో వాన పడకపోతే… కొండపై నీటి చుక్క ఉండదు."
గదిలో నిశ్శబ్దం.
"మరి ప్రత్యామ్నాయం?"
అధికారులు గొంతు తగ్గించి చెప్పారు: "శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసేయడమే."
తిరుమల చరిత్రలో ఎన్నడూ ఊహించని మాట అది. కానీ సమాధానం క్షణంలో వచ్చింది:
"ఆలయం మూసేయడమా? ఆ ప్రసక్తే లేదు!"
అప్పుడే మొదలైంది అసలు పోరాటం.
---
సమయం: కేవలం 49 రోజులు.
ఎల్ అండ్ టీ (L&T ECC) ఇంజనీర్లతో మేధోమధనం జరిగింది. లెక్కలు తేలాయి. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టుకు రెండేళ్లు పడుతుంది. కానీ ఇక్కడ ఉన్నది 49 రోజులే.
1999 డిసెంబర్ 28. పనులు మొదలయ్యాయి. అక్కడి నుంచి కౌంట్‌డౌన్.
- 3,000 మందికి పైగా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించారు.
- కింద నుంచి పైకి 9 కిలోమీటర్ల పైప్‌లైన్, కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవిలో, దాదాపు 1,000 మీటర్ల ఎత్తు వరకు.
- వాహనాలు వెళ్లలేని దారుల్లో సామగ్రిని మోసింది గాడిదలు.
- కిర్లోస్కర్, జేఎస్‌డబ్ల్యూ సహకారంతో హై-కెపాసిటీ పంప్‌లు, ప్రత్యేక పవర్ సబ్స్టేషన్లు సిద్ధమయ్యాయి.
ఆ 49 రోజులూ సీఎం చంద్రబాబు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పనుల పురోగతిని స్వయంగా సమీక్షించేవారు.
---
2000 ఫిబ్రవరి 14. ఉదయం 11:15.
అందరి కళ్లూ పైప్‌లైన్ చివరన. కళ్యాణి డ్యామ్ నీరు కొండ చేరుతుందా? ఆ క్షణం ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దం…
…ఆపై నీరు తిరుమల కొండను చేరింది.
49 రోజుల్లో అసాధ్యం సాధ్యమైంది. ఫిబ్రవరి 26న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
---
కానీ ఈ రోజు కూడా పాపనాశనం, గోగర్భం, ఆకాశగంగ ఉన్నప్పటికీ, కొండపై అత్యధిక నీరు వస్తున్నది కళ్యాణి డ్యామ్ నుంచే.
తిరుమలలో నీటి ఎద్దడి ముప్పు లేకపోవడానికి కారణం 26 ఏళ్ల క్రితం 49 రోజుల్లో జరిగిన ఆ నిశ్శబ్ద యుద్ధమే.
ఆ నీటి యుద్ధం గెలిచిన మూడున్నరేళ్లకే… తిరుమల దారిలోనే మృత్యువు ఎదురైంది!
2000లో కళ్యాణి డ్యామ్ నీరు కొండ ఎక్కినప్పుడు చంద్రబాబుకు ఒక విషయం అర్థమైంది: సంకల్పం ఉంటే అసాధ్యం అనేది లేదు. శ్రీవారి ఆలయం మూతపడే ప్రమాదాన్ని 49 రోజుల్లో తప్పించిన ఆత్మవిశ్వాసం అది.
2003 అక్టోబర్ 1. అలిపిరి.
బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్తున్న ఆయన కాన్వాయ్ మీద మావోయిస్టులు క్లెమోర్ మైన్లు పేల్చారు. పేలుడు ధాటికి వాహనాలు ఛిద్రమయ్యాయి. అయినా ఆయన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక్కడే భక్తులు ఆగి ఆలోచిస్తారు.
ఏ కొండకు నీరు తెచ్చి శ్రీవారి ఆలయాన్ని మూతపడకుండా కాపాడారో, అదే కొండ దారిలో ప్రాణాపాయం. అదే కొండ మీద స్వామి ఆయన్ను కాపాడాడు. "ఇంకా చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి" అన్న సంకేతం అని అనేకమంది నమ్ముతారు.
ఆ తర్వాత కథ మరింత పెద్దది.
1996లో తాను శంకుస్థాపన చేసిన హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 2025లో కుప్పానికి కృష్ణా జలాలను చేర్చారు. శ్రీశైలం నుంచి దాదాపు 770 కి.మీ. ప్రయాణం, ఎత్తు సుమారు 369 మీటర్లు.
ఇప్పుడు సుదర్శన చక్రంలా కథ మలుపు తిరిగింది. హంద్రీ-నీవా నుంచి రూ.126 కోట్లతో 33 కి.మీ. కాలువ ద్వారా కళ్యాణి డ్యామ్‌కు నీరు తెచ్చే పని. 1999లో తిరుమలను కాపాడిన అదే కళ్యాణి డ్యామ్‌కు, ఈసారి శ్రీశైలం శివయ్య పాదాల దగ్గర ఉన్న కృష్ణమ్మ నుండి నీటిని తెచ్చి, మల్లెమడుగు ద్వారా శ్రీనివాసుని పాదాల తిరుపతికి కూడా ఇవ్వాలనే సంకల్ప పనులు. పోలవరం నుండి నదుల అనుసంధానం వరకు రాష్ట్రానికే కాదు దేశానికి దారి చూపిస్తున్న ప్రణాళికలు, పనులు.
ఒక కొండ దాహం తీర్చిన ఆ 49 రోజులు… అదే కొండ పాదాల దగ్గర ఒక ప్రాణం నిలిచిన ఆ క్షణం… ఇప్పుడు కోట్లాది మంది దాహం తీర్చే యజ్ఞంగా మారడం—ఇదంతా యాదృచ్ఛికమా, లేక ఆ ఏడుకొండలవాడు వ్రాసిన కథా?..
#ChandrababuNaidu #Tirumala #AndhraPradesh
దేవి నవరాత్రులలో మూడవరోజైన ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు... ఆ అన్నపూర్ణ దేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏
ఇది ఇప్పటి సమస్య కాదు!!
కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP
మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి.
లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి.
నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి.
ఇది చాలా పెద్ద సమస్య.
అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు.
ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి…
ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి…
అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది.
ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి.
@ncbn@naralokesh గారు
ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య.
సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏
#Tirumala #TTD #SrivariDarshan
#TeamSBS
శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం.
#Adminpost
అసలు వీడియో ఇదిగో—పిల్లల పట్ల ఎలాంటి అవమానకర ప్రవర్తన జరగలేదు. రాధాకృష్ణ గారు పిల్లలతో కుడిచేత్తో కరచాలనం చేశారు. స్లూయిస్ గేటుపై ఉన్న పక్షి మలాన్ని రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు పొరపాటున తాకడంతో, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు.
@ncbn@JaiTDP
🚨 Neradi Barrage: ₹1,100 Cr Project estimates!
AP Govt plans to invite tenders and lay the foundation stone in November.
🔸️Estimated cost: ₹1,099.87 Cr
🔸️Irrigation potential: 2.55 lakh acres in two phases
🔸️ Additional water to Nagavali & drinking water benefits
🔸️ 106 acres of land in Odisha is required; discussions with Odisha Irrigation officials are underway.
Final cost may increase after the detailed DPR and field studies.
#AndhraPradesh
“దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్” అన్న మహత్తర సందేశంతో, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి 164వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
🚨 Andhra Pradesh villages witness a major road infrastructure push, with 20,600 km of roads built over the past 2.5 years, Deputy CM Pawan Kalyan said.
🔹10,000 km of BT roads
🔹9,600 km of CC roads
🔹1,000+ km of road connectivity provided to tribal villages under Adavi Thalli Bata
🔹Roads also built to improve access to pilgrimage sites, health centres and schools. #Development #Rural
🚨 Ancient/Historic Ganesha Sculptures of Andhra Pradesh.
Pic 1: A 2nd-century CE terracotta Ganesha discovered in Anantapur, Andhra Pradesh, is described by archaeologists as the oldest Ganesha idol found in the Telugu states and among the oldest known in South India.
Pic 2: Undavalli Caves, Andhra Pradesh, is home to this ancient rock-cut monolithic Ganesha sculpture, believed to be around 1,600 years old.
This week has been truly special, with two landmark irrigation projects reaching fruition in Andhra Pradesh. The #PolavaramLeftMainCanal and the #VeligondaProject have been decades in the making, and will transform lives and livelihoods across Uttarandhra and Rayalaseema.
It also feels like a new phase in my long journey in public life. I have been called the “CEO Chief Minister” over the years. Yet, bringing water to parched lands, giving hope to our farmers, transforming agriculture and securing drinking water for generations to come will always remain my most cherished legacy.
In the end, I would like my legacy to flow through water. Thank you, @EconomicTimes, for this thoughtful profile of that journey.
https://t.co/2KZqR7918l
In 1996, I laid the foundation stone for the Veligonda Project with a vision for our state. Today, as we finally dedicate this life-changing project to the people of Andhra Pradesh, a 30-year-old personal commitment stands fulfilled.
With this milestone, I want to reiterate my unshakeable commitment to our youth: I don’t work for the NEXT ELECTIONS, but for our NEXT GENERATION!
And with this same ideology, our NDA government is working towards a single goal, to bring real change & transform lives forever!
#VeligondaProject
మన మాతృభాష... మన సంస్కృతికి, అస్తిత్వానికి మూలస్తంభం. నేటి డిజిటల్ యుగంలో మన పిల్లలు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ, అక్షరాలను రాయడం, చదవడంలో వెనుకబడుతుండటం గమనించదగిన అంశం. ఈ నేపథ్యంలో మన లిపిని భావితరాలకు మరింత చేరువ చేసేందుకు రూపొందించిన 'కూల్ఫాబెట్స్' (Coolphabets) అనువర్తనాన్ని (యాప్‌ను) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం ఆనందదాయకం. భారతీయ భాషల ఔన్నత్యాన్ని చాటేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దిన వ్యవస్థాపకులు శ్రీ కొల్లు రంజిత్, శ్రీ వెంకట్ ఏలేటి సహా యావత్ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆధునిక సాంకేతికతను భాషా పరిరక్షణకు వారధిగా మలచిన 'కూల్ఫాబెట్స్' బృందం ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, మన పిల్లలలో తెలుగు చదవడం, రాసే నైపుణ్యాలను పెంపొందించాలని... మన తేనెలొలుకు తెలుగు లిపిని సగర్వంగా కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
"సాంకేతికత భాషలను దూరం చేయకూడదు... వాటిని పరిరక్షించాలి" అనే బలమైన సంకల్పంతో 2016లో బోస్టన్ వేదికగా ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల్లో చిన్నారుల అక్షరాస్యతను పెంపొందించే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతున్న 'కూల్ఫాబెట్స్' అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో చిన్నారులకు అక్షరాల దిద్దడం, గుణింతాలు, పదాలు, వాక్యాల రచనను సులభంగా, ఆటపాటలతో నేర్పించడం, 'CoolphaSense' ఫీచర్ ద్వారా పిల్లలు అక్షరాలు రాసే క్రమాన్ని, ఆకారాన్ని గమనించి ఒక వ్యక్తిగత గురువులా మార్గదర్శనం చేసే చొరవ అభినందనీయం. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేయడం, ప్రకటనలు లేని సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలతో, జాతీయ విద్యా విధానం (NEP 2020) ఆశయాలకు అనుగుణంగా ప్రాథమిక విద్యలో మాతృభాషా పునాదిని పటిష్టం చేయడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాను.
In 1987 America refused to sell India a supercomputer.
It then offered a weaker model instead, with conditions. Civilian use only. No technology transfer. No re-export. And an American official would be posted in India to monitor how the machine was used.
India said no, and handed the job to a man who had never seen a supercomputer in his life.
His name is Vijay Bhatkar.
He was born on 11th October 1946 in Muramba, a village in Akola district in Maharashtra. He started school directly in class 4. He took his engineering degree at Nagpur, a master's at Baroda and a doctorate at IIT Delhi.
India had wanted the machine for a very ordinary reason. Weather forecasting, which for a country of farmers is not a luxury. The Indian Institute of Science wanted one for research.
The Americans classed supercomputers as dual use technology, meaning it could also help a nuclear or missile programme. So the export was blocked.
In March 1988 the government set up the Centre for Development of Advanced Computing in Pune, and made Bhatkar its founder and executive director.
Before that, the Prime Minister asked him 3 questions.
Can we do it. Bhatkar said he had never seen a supercomputer, only a photograph of the Cray, and that yes, they could.
How long will it take. He said less time than it would take to keep trying to import one.
How much will it cost. He said the entire effort, including building the institution, would cost less than buying the Cray.
He was given about 30 crore rupees and 3 years.
The start was not glamorous. He has said that for the first 6 months he could not recruit a single person, including his own secretary, because of bureaucratic delays.
His team took a different route from the Americans. Instead of building 1 enormous processor, they linked many ordinary processors together to work in parallel, using parts that could be bought off the shelf.
The prototype was ready in 1990. They called it Param, which in Sanskrit means supreme.
Then came the part he did not expect. Nobody believed it was a supercomputer. It did not look like a Cray. He has said even his own computer science professors doubted it.
So he took it abroad, to a major international supercomputing conference, and had it demonstrated and benchmarked in public. It was formally recognised there as a supercomputer.
In 1991 they completed PARAM 8000.
An American newspaper carried the story under a headline that has stayed famous in India. Denied supercomputer, angry India does it.
Versions of the machine were later exported to Germany, the United Kingdom and Russia. India went from being refused the technology to selling it.
He has one line he repeats.
Great nations are not built on borrowed technology.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లను, నిండు కుండలా కళకళలాడుతున్న బ్యారేజ్‌ను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగు కోసం విడుదల చేస్తున్నాం. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎదుర్కొంటూ, మన రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.