అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ��్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్���ీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పుల��� తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం క��ని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంల�� ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
You are missing something Big on Twitter!
Pawan Kalyan fans are giving belt treatment to DMK IT cell and DMK IT cell is looking weeker in front of them.The best part is Pawan Kalyan fans are Countering them without abusing.
I was tagged in few post and took full entertainment.
ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
@ncbn@PawanKalyan@APDeputyCMO
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.