సనాతనధర్మాచరణ నా ఊపిరి. నా మాతృభూమి నా ప్రాణం. పుట్టింది అవనిగడ్డ పెరిగింది భాగ్యనగరం.10 దేశాలు దిమ్మరిలా తిరిగి కెనడా లో ఉన్న. చదివింది తెలుగులో పని ఆంగ్లంలో.
మా అమ్మాగారు ఆ అమ్మవారి ని చేరుకున్నారు. 44 నెలలు అమ్మతో ఉండి సేవ చేసే అవకాశం దక్కింది. కార్యక్రమాలు అన్నీ సవ్యం గా జరిగినాయి🙏 .మళ్ళా జన్మఉంటే అమ్మ కే కొడుకుగా పుట్టాలని 🙏🙏
అద్దంలో మన ముఖంపై మచ్చను చూపించేటప్పుడు మనం అద్దాన్ని పగలగొట్టం మన ముఖాన్నే శుభ్రంచేసుకుంటాం
అదేవిధంగా మనలోపాలు చెప్పేవారిపై కోపం చూపించే బదులు మనలోపాలను దూరం చేసుకోవాలి. కాబట్టి ఈరోజునుంచి మనలోని కోపాన్ని వీడి మనం మనలోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోయినరోజే మనల్ని విజయం వరించగలదు
నీ తర్వాత నీ వ్యక్తిత్వమే మిగిలిపోతుంది. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది.
ఎవరికన్నా నువ్వు గుర్తుకి వస్తె, వాళ్ళకి చిరునవ్వు రావాలి. చివుక్కుమనే బాధ గుర్తుకి రాకూడదు.- బాబాయ్ గారు
నీ శరీరం నీ గుర్తింపు కాదు. నీ శరీరం ఒక సాధనం మాత్రమే.
నీ శరీరానికి ఒక పేరు ఉంటుంది.ఆ పేరు ఎవరన్నా వింటే నువ్వు గుర్తుకి వస్తావు. కానీ నీ శరీరం ఒక సాధనం అయినపుడు ఆ సాధనం తో నువ్వేమి చేస్తావు. నువ్వేమి చేస్తావో అదే నీ వ్యక్తిత్వం.
ఎవరైనా సంతోషంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, వాళ్ళ ఆలోచనల్లో మనం ఉండాలి అనుకోకూడదు. వాళ్ళు మనల్ని పట్టించుకోక పోయినా మనం వ్యధ చెందకూడదు. మన పనుల్లో మనం ఉండి, మనం సంతోషంగా ఉంటే, వాళ్ళూ సంతోషంగా ఉంటారు. మన బాధ్యత వాళ్ళకి తప్పినందుకు. మా బాబాయ్ గారు చెప్పింది