కాళేశ్వరం పేరు మారిస్తే కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్నవన్నీ మారుస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
కాళేశ్వరం అనేది రాజకీయ నాయకుడి పేరు కాదు
ప్రాజెక్టులకు కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదు, లక్ష్మీ, పార్వతీ, సరస్వతి, సమ్మక్క, సీతమ్మ, రంగనాయక, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ అని దేవుళ్ల పేర్లు పెట్టాడు
బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకున్నా కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టింది మా ప్రభుత్వం, మీరు అవమానించిన మీ కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు పేరు మీద యూనివర్సిటీ పెట్టింది కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే
సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, పక్కనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత మాది
ప్రాజెక్టులు, పథకాల పేర్లు మార్చడం వల్ల ప్రజలకు వచ్చే లాభమేంటి?
అన్నపూర్ణ క్యాంటీన్ అని గొప్ప పేరు పెడితే, ఇందిరమ్మ అని మార్చారు, దాని వల్ల జరిగిన మేలు ఏంటి?
జైపాల్ రెడ్డి పేరిట జిల్లా ఏర్పాటు చేస్తారట, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడట
జైపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టినంత ఎవరూ తిట్టలేదు
మీరు కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చితే, మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్న అన్ని పేర్లను మార్చేస్తాం
ఎయిర్పోర్టు, ఉప్పల్ స్టేడియం పేర్లను కూడా మార్చేస్తాం