సోషల్ మీడియాలో బాధ్యతగల పౌరులుగా స్పందించండి. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఫేక్ పోస్టులు చేస్తే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి.
#telanganapolice#FakeNews
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి, జిల్లాలో అక్రమ ఇసుక రవాణా కు నో ఛాన్స్ -- @spmahabubabad.
మరిపెడ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు.
@TelanganaCOPs
🥇🥇🥇🥇🥈🥈🥈🥈🥉🥉🥉🥉
మహబూబాబాద్ జిల్లా పోలీసులకు పతకాల పంట.
3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ - 2025 లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ క్రీడాకారులను అభినందించిన @spmahabubabad శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు.
@TelanganaDGP@TelanganaCOPs@Collector_MBD
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులు సరికొత్త పంథా అవలంబిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను క్రోడీకరించి...సైబర్ మోసగాళ్ల ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారు. తద్వారా వారికి ఎక్కువకాలం శిక్ష పడేందుకు దోహదం చేస్తుంది.
#TelanganaPolice#CyberCrime
మీ పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించండి. మొబైల్ వాడకం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. సరదా కోసం మొదలయ్యే మొబైల్ వాడకం వ్యసనంలా మారవచ్చు. సరైన అవగాహన లేక సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది.
#TelanganaPolice#ChildCare#BeAlert
ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఒరిజినల్ వెబ్సైట్లను పోలి ఉండేలా కేవలం ఒక అక్షరం తేడాతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. షాపింగ్, ఆర్దిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
#fakewebsitescam#fakewebsites#cybercrime
పార్సిల్ పేరిట జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండండి. కొరియర్ ట్రాకింగ్ కోసం కేవలం అధికారి వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. అపరిచితులు పంపించే లింక్స్ క్లిక్ చేయొద్దు. అనుమానం వస్తే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#TelanganaPolice#ParcelScam
ట్రాఫిక్ నిబంధనల గురించి, ప్రతి ఒక్కరికీ #అవగాహన ఉండాలి. జాతీయ రహదారి #భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసు- రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో హెల్మెట్ అవగాహన బైక్ #ర్యాలీ నిర్వహణ. @TelanganaDGP@TelanganaCOPs