సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా పని చేసేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక లైవ్ ద్వారా వెల్లడించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan@IPR_AP@PIB_India@pibvijayawada@AndhraPradeshCM
#SayNoToSocialMediaAbuse
Freedom of expression is not an absolutely unlimited right.
It has limitations, and when it reaches the extent of violating others' rights, legal consequences are inevitable.
- Hon'ble Dy. CM @PawanKalyan Garu
భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి పరిమితులు ఉన్నాయి, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జూన్ 29th నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
@PawanKalyan@JanaSenaParty
#JSPMembershipToLeadership
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం
•కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు
•రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి
•అటవీ సంపద, సాంప్రదాయాల కలబోతగా నిర్మాణం
•వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు
•రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
‘ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు కాకూడదని, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రాంనారాయణరెడ్డి గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, శ్రీమతి సవిత గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ లాగా పని చేస్తూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశాం. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించాం. కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశాం. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని చాటి చెప్పేలా, జీవవైవిధ్య పరిరక్షణే ధ్యేయంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను అభివృద్ధి చేశాం. ఈ పార్కులు కేవలం పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయి. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్ (చిన్న పడవలు నడపడం), ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
•పచ్చదనాన్ని కాపాడుకుందాం
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ఆధునిక నగరాలలో, అలసిన మనుషులకు ఈ నగర వనాలు ప్రకృతిలోని ప్రశాంతతను పరిచయం చేస్తాయి. ఇవి కేవలం నేటి అవసరాల కోసమే కాదు, రాబోయే తరాల కోసం మనం అందిస్తున్న పచ్చని వారసత్వం. ప్రతి ఒక్కరూ వీటిని కాపాడుకుంటూ, మరింత పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపు నిచ్చారు.
•స్వయంగా పరిశీలించాను... నిజంగా అద్భుతం : మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు
దేవాదాయ శాఖ మంత్రి శ్రీ @AnamReddy_TDP గారు మాట్లాడుతూ “నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నగర వనాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించాను. పచ్చదనం, ప్రశాంతతో పాటు ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నగర వనానికి సమీపంలోనే ఉన్న గుట్టను, దానిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈ పార్కుతో అనుసంధానం చేస్తే బాగుంటుంది. పార్కును, గుట్టను కలిపి ట్రెకింగ్ పాయింట్ గా అభివృద్ధి చేస్తే, అది నగరవాసులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సాహస పర్యాటక అనుభూతిని అందిస్తుంద”న్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, శ్రీమతి గౌతు శిరీష, డా. బి.వి.జయనాగేశ్వర రెడ్డి, డా.పార్థసారధి, శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషా, అటవీ పర్యావరణశాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లిఖార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, ఐ.టి. అడ్వైజర్ శ్రీ పి. నాగేశ్వరరావు, డి.సి.ఎఫ్. శ్రీ ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : రాయల్ ఫంక్షన్ హాల్, నంద్యాల
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
జూన్ 29 నుంచి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును జనసేన శ్రేణుల నుంచి వస్తున్న స్పందన ఉత్సాహాన్ని నింపింది.
- జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : RK మెస్ ఫంక్షన్ హాల్, బాచుపేట, మచిలీపట్నం
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics