Unbelievable coarseness & throat slit gesture by Pakistan Defence Attache Col Rahat in United Kingdom, behaving as if he's a rowdy street hooligan. I cannot think of any Indian Military official/diplomat who would EVER EVER behave in this manner. Opposite of soldier-like https://t.co/AT9x4B5V8T
సమాజసేవలో 28 ఏళ్ళు పూర్తిచేసుకున్న @ntrtrust సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు అభినందనలు. ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ... మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
NTR Memorial Trust: A Legacy of Service!
From healthcare to education, disaster relief to empowerment, #NTRMemorialTrust continues the vision of the legendary #NTR Garu. Under the leadership of @ncbn Garu and Smt. Nara Bhuvaneswari Garu, the trust has made a profound impact, organizing 13,849 free medical camps, facilitating over 8.7 lakh units of free blood donation, and providing free education to more than 2,020 children. Its initiatives also prioritize women's empowerment and extensive disaster relief efforts, benefiting countless individuals. As the trust celebrates 28 years of service, I reaffirm my commitment to furthering its mission and serving society with renewed zeal - a true tribute to #NTR's spirit of service and commitment to society.
సమాజ సేవలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్ట్ నిర్వహణలో నాకు అంకితభావంతో సహకరిస్తున్న సిబ్బందిలోని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను. అలాగే దాతల సహకారం లేకపోతే ట్రస్ట్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేయడం సాధ్యమయ్యేది కాదు. విరాళాలిచ్చి ట్రస్ట్ కు అండగా నిలబడుతున్న దాతలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ప్రజలను దేవుళ్లుగా భావించి వారి సేవలో తరించమని సందేశమిచ్చిన తెలుగింటి 'అన్నగారు'... నాన్న ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి ఈ ట్రస్ట్ ను నెలకొల్పడమే కాకుండా... నాకు నిర్వహణ బాధ్యతలను అప్పచెప్పి, అన్ని వేళలా తన అమూల్యమైన సలహాలు, సూచనలతో ట్రస్ట్ కు అండగా ఉన్న చంద్రబాబుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బ్లడ్ బ్యాంక్ లు గానీ, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ గానీ, ఉపాధి శిక్షణ కేంద్రాలు కానీ, స్కూళ్ళు, కాలేజీల నిర్వహణ కానీ, విపత్తులలో ప్రజలకు సహాయ సహకారాలను అందించడంలోకానీ... ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలిచి 28 ఏళ్లుగా సేవలందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. తలసేమియా వ్యాధి పై అవగాహన కల్పించే లక్ష్యంతో, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈరోజు విజయవాడ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ గారి ఆధ్వర్యంలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్'ను నిర్వహిస్తున్నాం. ఆపన్నులను ఆదుకుంటూ వారి సేవలో ఈ ట్రస్ట్ ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ... మరోసారి ట్రస్ట్ కు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
Remembering Kalpana Chawla on her death anniversary. Her legacy as a trailblazer and inspiration for countless people around the world lives on. As one of the first women to venture into space, her courage, vision, and determination continue to light the path for those who dare to dream beyond the stars. Kalpana's journey paved the way for more women to follow in her footsteps, proving that no dream is too big. #KalpanaChawla #NeverForgotten #WomenInSpace
తెలుగు ప్రజలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు వెలుగు ప్రసాదించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పవిత్రమైన రోజు మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. గత కాలపు విలువలను మనం మరచిపోకుండా భావితరాలకు వాటిని అందించాల్సిన బృహత్ బాధ్యత మనపై ఉన్నది. అందుకే పెద్దలు ఇలాంటి పండుగలు ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాలను మేలి మలుపు తిప్పాలని, పది మందికి సాయపడుతూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని కోరుకుంటూ మరొక్క మారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
#MakaraSankranti
A beautiful video that captures family moments. We're very proud of our young star, @NKReddy07 , and his amazing century. He has achieved something even greater - making his family proud and rewarding their sacrifices with his determination and success. Kudos to his parents for always being so supportive of his dream and helping him achieve it every step of the way. Nitish has also made his larger family called Telugu community proud, a family to which we all belong. I wish him all the best in his future endeavours.
#AUSvINDIA
Heartfelt congratulations to Koneru Humpy on winning the FIDE Women's World Rapid Chess Championship 2024! Your exceptional skill, focus, and determination have truly shone through, and this victory is a testament to your hard work and talent. You continue to inspire chess enthusiasts worldwide. Wishing you even more success and triumphs in the future!
Well done, @naralokesh! Your thoughtful gesture of picking up @ncbn Garu’s plate and helping the staff clean up not only shows your deep respect for parents but also your humility and regard for those who help us daily. Truly inspiring!
#MegaParentTeacherMeeting
భారతదేశం రాజ్యాంగ వజ్రోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది కూడా వేడుకలను జరుపుకున్నారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని... రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలను నిబద్దతతో పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
#ConstitutionDay#NTRTrust
స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈరోజు చిరస్మరణీయ దినం. ఎందుకంటే 75 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు... 1949 నవంబర్ 24న నాన్నగారు మొదటిసారిగా వెండితెరపై కనిపించిన 'మనదేశం' సినిమా విడుదలైంది. అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి ఇది సినీ వజ్రోత్సవం అన్నమాట. ఈ సినిమాలో పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ పాత్రతో నటునిగా ఎన్టీఆర్ గారి సినీరంగ ప్రస్థానం మొదలైంది. మరోమాటలో చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక స్వర్ణశకం మొదలైంది. ఆయన సినీ ప్రయాణం, ఆయన నటనా విశ్వరూపం తలచుకుంటుంటే ఒక కూతురిగానే కాదు, ఒక తెలుగు వ్యక్తిగా నేను ఎంతో గర్విస్తాను. ముఖ్యంగా నాన్న గారు పోషించిన పౌరాణిక పాత్రలను తలచుకుంటే... తమ రూపాలను ప్రజలకు చూపించమని ఆ దేవుళ్ళే ఆయన్ను ఆశీర్వదించి భూమి మీదికి పంపారేమో అనిపించి ఒళ్ళు పులకరిస్తోంది. అందుకే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ గారిని కారణజన్ముడు అన్నారేమో! స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.
I am deeply saddened to hear of the passing away of Shri #RatanTata Ji. His contributions to the nation, his visionary leadership, and his compassion for humanity have left an indelible mark on all of us. His legacy will continue to inspire generations to come.