మన జనసేన నాయకుడు 🙏🙏
శ్రీ వాసగిరి మణికంఠ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐
మీ సేవా భావం, మీ అంకితభావం మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్నాయి.🤝🏻🤝🏻
కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మీపై,
ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.🎉
@JanaSenaParty@vasikiri Manikanta @@PawanKalyan
బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తి కొనసాగించాలి
విశాల భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పాదుకొల్పిన మహనీయుడు బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ గారు. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగానికి రూపకల్పనలో మూల స్తంభంగా నిలిచిన అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. అణగారిన వర్గాలకు, మహిళలు, కార్మిక వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు లభించాయి అంటే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిన అంశాలే కారణం. ఆ మహనీయుడి వర్థంతి సందర్భంగా ఈతరం తప్పనిసరిగా- రాజ్యాంగ రచనలో అంబేద్కర్, ఆయన బృందం పాటించిన విలువలు గురించి తెలుసుకోవాలి. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి @APDeputyCMO
#BabasahebAmbedkar
తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.
ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
"స్వచ్చ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్"గా బాధ్యతలు స్వీకరించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మన ఆంధ్రప్రదేశ్‌ను మరింత శుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తాను. 🌿✨
@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
#SwachhAndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #CleanAndhra #GoodGovernance #TDP #JSP #BhuvaniRavikumar
ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్'గా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @Dr_NarayanaP గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ @PattabhiRamK1 గార్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాను.
ఈ గౌరవనీయమైన బాధ్యతను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తాను.
@JanaSenaParty@PawanKalyan
సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను సూపర్ సక్సెస్ చేద్దాం....
అనంతపురం నగరంలో యాదవ ఫంక్షన్ హాల్ లో జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ TC Varun గారి ఆధ్వర్యంలో జనసేన సమన్వయ సమావేశం..
డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అనంతపురం రానున్న అధినేత శ్రీ @PawanKalyan గారు...
అనంతపురం వేదికగా ఈ సభను ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, డిప్యూటీ సీఎం శ్రీ #కొణిదెల_పవన్_కళ్యాణ్ గారు నిర్వహించడం మా అదృష్టం...
ఇది జనసైనికులకు పండుగ వాతావరణం.. ప్రాంగణమంతా జనసేన కూటమి జెండాలు రెపరెపలాడాలి...
అనంతపురంలోని 14 నియోజకవర్గాలు, 63 మండలాల నుంచే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా తరలివస్తాం..
ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన నాయకుల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు..
అన్ని నియోజకవర్గాల్లో జనసేన బిజెపి టిడిపి ఐక్యంగా పనిచేయడం వల్లే అఖండ విజయం సాధ్యమైంది...
అదే ఐక్యత స్ఫూర్తిని కొనసాగిస్తాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ చారిత్రక విజయవంతం చేస్తాం..
సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ కమిటీ సభ్యులు జనసేన పార్టీ తరఫున...
వెన్యూ కమిటీ సభ్యులుగా శ్రీ పొదిలి బాబురావు గారు, శ్రీ చింత సురేష్ గారు, ఫుడ్ ఆర్గనైజేషన్ :- శ్రీ భవాని రవికుమార్ గారు
ట్రాన్స్పోర్ట్ :- శ్రీ సుంకర శ్రీనివాస్ గారు, మొబలైజేషన్ :- శ్రీ ఆటగాని కృష్ణ గారు...
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు, 14 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#సూపర్_సిక్స్... #సూపర్_హిట్....
కూటమి ప్రభుత్వంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్న ప్రజాదరణ...
ఈనెల 10న అత్యద్భుతం ఆవిష్కృతం కాబోతోంది...
అనంతలో తొలిసారిగా ఒకే వేదికపై ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారు కనిపించబోతున్నారు...
రాయలసీమ వ్యాప్తంగా తరలిరానున్న నాయకులు, జనసైనికులు, వీరమహిళలు...
ఈ మహాసభను కూటమి పార్టీలు పండగోత్సవంగా నిర్వహిస్తున్నాయి...
అనంతపురం జిఎంఆర్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు..
#భూమి_పూజ చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు...
కూటమి ఐక్యతను చాటుదాం... 10న మహాసభను జయప్రదం చేద్దాం.. అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారి పిలుపు..
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు, నగర, జిల్లా కమిటీ సభ్యులు, తెలుగుదేశం నేతలు, బిజెపి నేతలు, ప్రజా ప్రతినిధులు, వీరమహిళలు, అధికారులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కందుకూరు సమీపంలో 80 ఎకరాల విస్తరణలో అభివృద్ధి...
ఎం ఐ జి- కందుకూరు లే అవుట్ ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్...
భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాప్తాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీ పరిటాల సునీతమ్మ గారు, అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారు....
40 కోట్ల రూపాయల అంచనా తో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు....
రాప్తాడు నియోజకవర్గ సమీపంలోని పండమేరు వాగుకు ఇరువైపులా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి శాసన సభ్యురాలు శ్రీ పరిటాల సునీతమ్మ గారు, ఆహుడా ఛైర్మెన్ శ్రీ టి.సి.వరుణ్ గారితో కలసి పరిశీలించి చర్చించడం జరిగింది....
కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తోంది..
అందుకు అన్ని విధాల సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారికి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @Dr_NarayanaP గారికి కృతజ్ఞతలు తెలిపిన అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు...
ఈ కార్యక్రమంలో అహుడ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఇషాక్, సెక్రెటరీ అహుడ శ్రీ రామకృష్ణారెడ్డి, ఈ ఈ శ్రీ దుష్యంత్, శ్రీ ఆదినారాయణ, అధికారులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.