ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @NagaBabuOffl అన్నయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
పర్యావరణ పరిరక్షణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా మీ నాయకత్వంలో ఈ కమిటీ మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@JanaSenaParty@PawanKalyan
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
-ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం
@PIB_India@IPR_AP@pibvijayawada
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
• స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ
• పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం
వేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరి
సమయం: సాయంత్రం 4 గంటలకు
గమనిక: కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశంలో అనుమతి ఉంటుందని గమనించగలరు.
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు
•24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు
•టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు
•48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు
•లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి.
• భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయాల ఆధునీకరణ
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి.
పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. పునరుద్ధరణ జరుగుతున్న ఆలయాల్లో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు, పిఠాపురం మహారాజుల కాలం నాటి అనేక పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆయా పర్వదినాల్లో రోజుకు 20 వేల నుంచి ఏకంగా 50 వేల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.
• అత్యాధునిక వసతులతో టీటీడీ కల్యాణ మండపం
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని అన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ మాడ వీధుల విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
• భజన మందిరాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ
కాకినాడ జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భజన మందిరాలు కేవలం భక్తి కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతోపాటు ఆలయాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రామీణ సామాజిక వేదికల బలోపేతానికి దోహదపడనున్నాయి.
#Pithapuram
జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల ఆగస్టు 28వ తేదీ, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాను.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అందుబాటులో లేని కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.
ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతున్నారు.
అందువల్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు అభినందనలు తెలియజేయాలని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే స్వయంగా, పేరుపేరునా కలుసుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి.
ఈ బాధ్యతను నాపై ఉంచినందుకు, నాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ,
@NagaBabuOffl
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్.
A few films are celebrated.
A few films are deeply felt.
#Irumudi is one of those rare films that does both ❤️🔥
HEART WINNING BLOCKBUSTER #Irumudi is being loved all over ❤️
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl
#IRUMUDI / #IRUMUDIKATTU
కోదాడ వద్ద ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఉప ముఖ్యమంత్రివర్యులు కార్యాలయం
@PIB_India@PIBHyderabad@IPR_AP@pibvijayawada
తిండి కట్టేసినప్పుడే గింజ విలువ తెలుస్తుంది… రోజూ పంచభక్ష్య పరవన్నాలు తింటున్నప్పుడు దాని విలువ తెలియదు.
అభివృద్ధి కూడా అంతే.
మన కళ్లముందు గలగలా పారుతున్న ఈ ఏరు… మనకు తెలియకుండానే మనకు అందుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పంచభక్ష్య పరవన్నం.
జగన్ హయాంలో నీటి సంఘాలను రద్దు చేశారు. పూడికతీత పనులకు ఉపయోగపడాల్సిన ఉపాధి హామీ నిధులు దారి మళ్లించాడు . ఫలితంగా కాలువలు పూడికలతో నిండిపోయి, నీటి ప్రవాహం లేకుండా ఉండేది .అప్పుడు రైతులకు తిండి కట్టేసిన పరిస్థితి
ఇప్పుడు నీటి సంఘాలు మళ్లీ పనిచేస్తున్నాయి. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరుగుతున్నాయి.
ఫలితం మన కళ్లముందే ఉంది…
గలగలా పారుతున్న గోదావరి జలాలు, జీవం పోసుకున్న కాలువలు, నిండుగా ప్రవహిస్తున్న సెలయేర్లు.
కాబట్టి పవన్ హయాంలో ప్రజలకు పంచ భక్ష్య పరవన్నాలు అలవాటుగా మారాయి అని గర్వంగా అనొచ్చు
#PawanKalyanForPithapuram
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు.
➡️24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు.
➡️టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు.
➡️48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు.
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు
•24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు
•టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు
•48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు
•లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి.
*భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయాల ఆధునీకరణ*
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. పునరుద్ధరణ జరుగుతున్న ఆలయాల్లో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు, పిఠాపురం మహారాజుల కాలం నాటి అనేక పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆయా పర్వదినాల్లో రోజుకు 20 వేల నుంచి ఏకంగా 50 వేల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.
*అత్యాధునిక వసతులతో టీటీడీ కల్యాణ మండపం*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని అన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ మాడ వీధుల విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
*భజన మందిరాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ*
కాకినాడ జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భజన మందిరాలు కేవలం భక్తి కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతోపాటు ఆలయాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రామీణ సామాజిక వేదికల బలోపేతానికి దోహదపడనున్నాయి.
నాన్ జీఎంఓ మొక్కజొన్న వంగడాల సృష్టి – వ్యవసాయ రంగ విప్లవంలో కీలక మైలురాయి
•కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన గోర్మె పాప్ కార్నికా సంస్థకు శ్రీ @PawanKalyan గారి అభినందనలు
మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా, ముసునూరు గోర్మె పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. గోర్మె పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని (Non-GMO) పాప్ కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు, గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమన్నారు. ఈ పరిశోధనలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జన్యుపరంగా మార్పులు చెందని వంగడాల అభివృద్ధి రైతులతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వినూత్న ఆవిష్కరణను విజయవంతంగా రూపొందించిన గోర్మె పాప్ కార్నికా సంస్థ యాజమాన్యానికి, శాస్త్రవేత్తలకు, పరిశోధక బృందానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
#PawanKalyanAneNenu
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తి.
త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!