ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో కన్నుమూశారనే వార్త అత్యంత బాధాకరం.
దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ, సామాజిక న్యాయం మరియు పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన నిరంతర పోరాటాలు చిరస్మరణీయం. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు మరువలేనివి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
#MudragadaPadmanabham
వనపర్తి జిల్లా రూపురేఖలు మార్చే అత్యాధునిక రహదారుల నిర్మాణానికి నేడు శ్రీకారం..
పల్లెలను, పట్టణాలను ప్రపంచస్థాయి రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ఈరోజు వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్' (HAM) రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను.
నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యత అప్పగించే ఈ HAM విధానం ద్వారా సుదీర్ఘకాలం మన్నికగా ఉండే నాణ్యమైన రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ రహదారుల విస్తరణతో రవాణా సమయం, ఖర్చు తగ్గి ప్రాంతీయ పారిశ్రామిక మరియు వ్యవసాయ ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ, ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే... మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో సంక్షేమ పాలన అందిస్తోంది. ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రగతిశీల పాలన ఇలాగే కొనసాగుతుంది..
ఈ కార్యక్రమంలో సహచర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్యేలు శ్రీ మెగా రెడ్డి గారు, శ్రీ బియ్యాని మనోహర్ రెడ్డి గారు, శ్రీ కూచుకుళ్ల రాజేష్ గారు, శ్రీ జి. మధుసూదన్ రెడ్డి గారు, ఎస్ఏపీ (SAP) చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు భాగస్వాములయ్యారు.
అభివృద్ధి బాటలో మహబూబ్‌నగర్..
మహబూబ్‌నగర్ జిల్లా ప్యాకేజ్-1లో భాగంగా జిల్లావ్యాప్తంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో రూ.573 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు మక్తల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశాను.
HAM విధానంలో నిర్మితమయ్యే రహదారులు అత్యున్నత నాణ్యత, దీర్ఘకాలిక మన్నికతో పాటు మెరుగైన నిర్వహణను అందిస్తాయి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం బలోపేతమై, రవాణా సౌలభ్యం పెరగడంతో వ్యాపారం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.
ప్రజలకు నాణ్యమైన, మన్నికైన రహదారి మౌలిక వసతులు కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ వీర్లపల్లి శంకర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ (HAM) ఫేజ్-1, ప్యాకేజీ-1లో భాగంగా రూ.339.59 కోట్ల వ్యయంతో 109.30 కి.మీ. పొడవున 7 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది.
ఈ రహదారుల నిర్మాణంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊతం లభిస్తుంది. తెలంగాణలో అత్యాధునిక, నాణ్యమైన రహదారి మౌలిక వసతుల నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, శ్రీమతి యశస్విని రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ నెల్లికంటి సత్యం గారు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ శ్రీ బి.వి. రావు గారు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దక్షిణ భారత గానకోకిల, ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి ఎస్. జానకి గారు కన్నుమూశారన్న వార్త తీవ్ర బాధాకరం.
ఆరు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం. 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు ఆలపించి, గ్రామీణ జానపదాల నుండి శాస్త్రీయ, భక్తి గీతాల వరకు తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న జానకమ్మ మృతి... భారతీయ సినీ సంగీత రంగానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
#SJanaki #RIPJanakamma #LegendarySinger
ఆ తాత కళ్లల్లో తల్లిదండ్రులు లేని తన మనవడిని కాపాడుకోవాలనే ఆవేదన చూసి నా హృదయం చలించిపోయింది.
ఆ చిన్నోడి ప్రాణం కాపాడేందుకు నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తాను. 🙏
రైతు బిడ్డలమైన మాకు అన్నదాతల కష్టం తెలుసు..
కేవలం 9 రోజుల్లో రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి, చెప్పిన మాటను చేతల్లో చూపించిన రైతు పక్షపాతి మన ఇందిరమ్మ ప్రభుత్వం.
మధిర నియోజకవర్గం, జగన్నాథపురంలో జరిగిన 'రైతు ఆశీర్వాద సభ'లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu గారితో కలిసి పాల్గొనడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ వేదికగా రైతులకు వానాకాలం పంటకు 'రైతు భరోసా' పెట్టుబడి సాయాన్ని పూర్తి చేయడంతో పాటు, నూతన ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌లను పంపిణీ చేశాము.
#RythuBharosa #KomatireddyVenkatReddy #Telangana
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డా.వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట సిటీ సెంటర్లోని డా.వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా మార్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ప్రజానేతగా నిలబెట్టిందన్నారు. సామాన్యులతో మమేకమై వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ విధానాలను రూపొందించిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు భరోసా కల్పించాయన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేయడం వైఎస్సార్ రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. రైతు, పేద, బలహీన వర్గాల సంక్షేమమే ఆయన పాలనకు కేంద్రబిందువన్నారు.
డాక్టర్ వైఎస్సార్ జీవితం, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
#YSRajasekharaReddy #YSR #YSRJayanti #DrYSR #BhattiVikramarka #DeputyCMBhattiVikramarka #PrajaNetha #WelfareGovernance #Aarogyasri #IndirammaIndlu #Telangana #భట్టివిక్రమార్క #వైఎస్ఆర్ #డాక్టర్వైఎస్ఆర్ #వైఎస్ఆర్జయంతి #ప్రజానేత #సంక్షేమపాలన #ఘననివాళులు #జైతెలంగాణ
We remember Y. S. Rajasekhara Reddy with deep respect, honouring his visionary leadership, unwavering dedication to public service, and lasting contributions towards the welfare, development, and progress of Andhra Pradesh.
On his birth anniversary, we fondly remember and pay our tributes to Former Andhra Pradesh Chief Minister Y. S. Rajasekhara Reddy.
A visionary and compassionate leader, he dedicated his life to the welfare and progress of the people of Andhra Pradesh. His unbridled commitment to farmers, the poor, and the marginalised, along with his immense dedication to the Congress party, remains an enduring legacy.
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
నమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐
రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నాడు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
జోహార్ వైఎస్సార్..🙏
జోహార్ రాజన్న...💐
మరణం లేని మహానాయకుడు...
మరువలేని ప్రజానాయకుడు...
కాలం మారినా...
తరాలు గడిచినా...
తెలుగు జాతి గుండెల్లో చెరగని ముద్రగా, ప్రజల హృదయాల్లో శాశ్వత స్మృతిగా నిలిచిన నాయకుడు...
మా గుండెల్లో కొలువై ఉన్న మహానేత...
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు..
#DrYSRajasekharaReddy #YSRForever #YSRJayanti #RememberingYSR #YSRLegacy #PeopleLeader