బెదిరించిన ఎదిరించి నిలబడ్డావ్, నీకు తోడుగా ఉన్న కార్యకర్తల కోసం పోరాడావ్ నీ ఓపిక కు నీ ధైర్యాన్ని కి సలాం శివన్న అనుకున్నది సాదించావ్ (గెలుపు) అయ్యా శివయ్య
ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన దరిశి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అమెరికా లోని సెయింట్ లూయిస్‌లో ఘనంగా జయంతి వేడుకలు...
ప్రజాహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా సెయింట్ లూయిస్ వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, వైయస్ఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమం డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం మహానేత జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ ప్రజా సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, ఆరోగ్యం, విద్య, పేదల అభ్యున్నతికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్చువల్ ద్వారా పాల్గొన్న వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ, గ్లోబల్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి గారు మరియు ప్రత్యక్షంగా హాజరైన వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు మహానేత వైయస్ఆర్ సేవాభావాన్ని, ప్రజా సంక్షేమానికి ఆయన అంకితభావాన్ని, దూరదృష్టి నాయకత్వాన్ని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని వక్తలు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ప్రశంసించారు. వైయస్ఆర్ ఆశయాలు నేటికీ కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, వాటిని భావితరాలకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల పాత్ర, పార్టీ బలోపేతం, అలాగే వైయస్ఆర్ ఆశయాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి పమ్మి, కిరణ్ రెడ్డి, గోపాల్ తాటిపర్తి, మహేష్ ముసలప్పగారి, ఆర్.కే. దగ్గుమాటి, మారుతి, రంగా సురేష్, దినేష్ రెడ్డి, వెంకట్ గౌని, సందీప్ రాఘవ రెడ్డి, గోహిత్, శివకృష్ణ తేజ, శివ తేజ, సుదర్శన్, చందు రెడ్డి , నవీన్ రెడ్డి, రమేష్ రెడ్డి, లర్దు రమేష్, నదీమ్, మస్తాన్, వేణు, చిట్టి పవన్, సాయి గౌతమ్ రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. ముఖ్యంగా సెయింట్ లూయిస్ యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టెన్నెస్సీ, కాన్సాస్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
#77thYSRJayanthi
పేద పిల్లలుకూడా పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
5 ఎకరాల్లో అమెజాన్ అడవి..
అమరావతిలోనే..
TDP కొత్త ప్రకటన!
Real Estate వ్యాపారం కోసం 50 వేల ఎకరాల పంటను నాశనం చేసి 5 ఎకరాల్లో అడవి! 🤔
ఇది అమరావతా?
లేక అడవివావిత 🤣🤣
#SaveAPfromTDP
బ్రేకింగ్
కిర్లంపూడి లో ఉద్రిక్తత
ముద్రగడ చివరి చూపు కోసం కిర్లంపూడి వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతి
క్రాంతి వెళ్లిపోవాలంటూ, ముద్రగడ బంధువులు ,అభిమానుల నినాదాలు
మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, గార మండలం, సీలగాం గ్రామంలో మహానేతకు ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా టీమ్ పర్యవేక్షణలో, వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా సభ్యులు శ్రీ పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
“వైఎస్సార్ ఆశయాలు – ప్రజల అభ్యున్నతే మా లక్ష్యం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీలగాం యువత ఉత్సాహంగా పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని టి. రాజు, ఆర్. దామోదర్, జి. రామారావు, డి. వీరరాజు, డి. సత్య, డి. శివ, ఆర్. వంశీ, జి. తిరుపతి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.
#YSJaganWithFisherMen
YSRCP Chief YS Jagan announced ₹49 lakh relief for the Vizag boat tragedy victims' families.
₹7 lakh each for the families of six deceased fishermen and ₹7 lakh for survivor Chinna.
#CBNFailedCM#YSJaganInVizag
బాధితులను పరామర్శించకుండా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని అడ్డుకున్న కూటమి పోలీసులు.. రామవరంలో తీవ్ర ఉద్రిక్తత..రామవరం, కుతుకులూరులో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
ఎమ్మెల్యే గూండాల దాడిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కారు అద్దం ధ్వంసం, దాడి చేయించిన వారే పరామర్శ పేరుతో రావడం విడ్డూరమని ఎమ్మెల్యేపై డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు. పోలీస్ శాఖ అధికార పార్టీకి కొమ్ముకాయడం తగదని ఆగ్రహం వ్యక్తం. ఎమ్మెల్యే రాకను వ్యతిరేకిస్తూ బాధితులు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తల బైఠాయింపు.. నినాదాలతో నిరసన. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే
అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం రామవరం, కుతుకులూరు గ్రామాల్లో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు రామవరం వచ్చిన అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ..బాధితులను పరామర్శించే కార్యక్రమం ఎమ్మెల్యే అధికారిక షెడ్యూల్లో లేదు. నేను వస్తున్నాననే సమాచారం తెలుసుకుని ఇప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, బాధితుడైన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారు స్వయంగా తన ఇంటికి రావద్దని చెబుతున్నా సిగ్గులేకుండా ఎలా వస్తారు? దాడి చేయించిన వ్యక్తే పరామర్శ పేరుతో రావడం రాజకీయ నాటకం కాక మరేమిటి?అంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే ఈ పరామర్శ వెనుక అసలు ఉద్దేశం. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే కానీ, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదు అని అన్నారు. ముందుగానే తమ పరామర్శ కార్యక్రమం ఖరారైందని, ఒకవేళ ఎమ్మెల్యేకు నిజంగానే బాధితులపై సానుభూతి ఉంటే ఘటన జరిగిన వెంటనే వచ్చి ఉండొచ్చని, లేకపోతే మరుసటి రోజు వచ్చినా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేర్కొన్నారు. అదే సమయంలో రావడానికి ప్రయత్నించడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై వ్యవహరించడం పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో బాధితులను పరామర్శించే హక్కును అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. రామవరం, కుతుకులూరు గ్రామాల్లో జరిగిన దాడులపై నిష్పక్షపాత విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పక్షపాతం లేకుండా శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు అధికారులను కోరారు.
ఈ ఘటనతో అక్కడ భారీ సంఖ్యలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బాధితులు బైఠాయించి ఎమ్మెల్యే రాకను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రాణాలు పోయినా పరవాలేదు..గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించే రాజకీయాలకు అవకాశం ఇవ్వం అంటూ తమ నిరసనను వ్యక్తం చేయగా, రామవరం గ్రామంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
నీతి నిజాయితీకి, రాజీలేని పోరాట పటిమకు నిలువెత్తు.
రూపమైన ముద్రగడ పద్మనాభం గారి మృతి ఆయనను అభిమానించే వారికి తీరని లోటు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
- శ్యామల
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి వర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో కన్నుమూసిన వార్త ఎంతో బాధాకరం.
వారి మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..
ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?
బోటు ప్రమాదం జరిగితే.. ముఖ్యమంత్రి @ncbn పట్టించుకోడు
హోంమంత్రి @Anitha_TDP కనీసం వీళ్ళ ఇళ్లకు వచ్చి పరామర్శించదు.
ఫిషరీస్ కి సంబంధించిన మంత్రి @katchannaidu పట్టించుకోడు.
ఇంత కష్టంలో ఉన్న వీళ్ళను ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా రాలేదు.
- @ysjagan అన్న.
#YSJaganWithFisherMen
#CBNJungleRaj
#JaganannaConnects
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు...
ఒక మంచి ఉద్యకారుని కోల్పోవడం చాలా బాధాకరం... వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..
ముద్రగడ్డ లాంటి నాయకుడును వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టే విధంగా TROLLINGS మాత్రం చెయ్యొద్దు.
ముద్రగడ కష్టాలు మీకు తెలియకపోవచ్చు అటు రాజకీయంగా ఇటు కాపు సామాజిక వర్గంగా ఆయన ఎంతో కృషి చేశారు.
- కురసాల కన్నబాబు
జగనన్నకు ముద్రగడ్డ పద్మనాభం అంటే చాలా ఇష్టం.
ముద్రగడ ఏ పార్టీలో ఉన్నా జగనన్నకు చాలా గౌరవం.
గిరిబాబు కు కూడా జగనన్న తోడుగా ఉండి ఎప్పటికప్పుడు సహాయం చేసేవారు.