@svembu I’m unsubscribing Zoho in our business for your myopic view of things which lacks any understanding of what students are going through. You just want an army of slaves without any discent and you dare call this democracy.
Main Character Energy
ఈ మధ్య జెన్ జీ తరచుగా వాడుతున్న ఒక పదజాలం - మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ.
Main character energy refers to the mindset or attitude of living life as if you're the protagonist of your own story – like the central character in a movie or book.
ఇదంతా ఇప్పుడెందుకు అనొచ్చు.
ఎందుకంటే బుక్ ఫెయిర్ గురించి మాట్లాడుతూ ఈ కుర్రాళ్ళ గురించి మాట్లాడక పోవడం అన్యాయమే అవుతుంది కాబట్టి.
బుక్ ఫెయిర్ లో స్టాల్ నడపడం చిన్నపని కాదు. ఉదయం లేవాలి. రాత్రి స్టాల్లో అయిపోయిన పుస్తకాల స్టాక్ లిస్ట్ చేసుకుని అన్నీ ప్యాక్ చేసుకుని పదకొండున్నరకల్లా భోజనాలు చేసి బయలుదేరాలి. ఒక్కసారి లోపలకి వెళితే రాత్రి పది వరకూ తిండి ఉండదు.
మేమంటే పబ్లిష్ చేసిన పుస్తకాలు అమ్ముడు కాకపోతే నష్టాలు, కష్టాలు కాబట్టి రోజూ రావాలి. ఉండాలి. సేల్స్ అయ్యాయా లేదా అని లెక్కలు చూసుకోవాలి.
రచయితలు పుస్తకాలు రాశారు కాబట్టి నలుగురు మనవి చదవాలనే ఉత్సాహంతో ఉండాలి.
కానీ వీళ్ళు?
వీళ్ళే లేకుంటే (వీళ్ళ లాంటి మరొక ఐదారుగురు కూడా) మేము ఈ ఐదేళ్లలో ఈ బుక్ ఫెయిర్‌లో పాల్గొనడం అసలు సాధ్యమయ్యేది కాదు.
ఈ ఫొటోలో మొదట ఉన్నది రాము. అసోసియేట్ డైరక్టర్. మల్లేశం, మ్యూజిక్ స్కూల్, ఇంకా చాలా సినిమాలకు పనిచేశాడు. అన్వీక్షికీ తనదే అన్నట్టు భావించి ప్రతి బుక్ ఫెయిర్‌లో మాతో ఉన్నాడు.
చెప్పుకోవాల్సిన విషయం. రాము నవల రాశాడు. వచ్చే సంవత్సరం వస్తోంది. కంగ్రాట్స్ రాము.
ఇక రెండో ఫొటోలో ఉన్నది శశి.
అన్వీక్షికి అభిమాని. మొదట్లో నెల్లూరు నుంచి బుక్ ఫెయిర్ కి వచ్చి, ఆ పది రోజులు మాకు సహాయంగా ఉండేవాడు. రెండేళ్లుగా చదువు కంటేంట్ హెడ్ గా ఉన్నాడు. శశి లేకపోతే చదువు ఉండదు. సింగిల్ హ్యాండెడ్ గా రాన్ చేస్తున్నాడు. అన్వేక్షికి బుక్స్ అన్ని శశి చేతులమీదుగా లే అవుట్ అవుతాయి.
చెప్పుకోవాల్సిన విషయం. శశి రెండు పుస్తకాలు రాస్తున్నాడు. వచ్చే బుక్ ఫెయిర్ లో శశివి రెండు పుస్తకాలు ఉంటాయి.
మూడో ఫొటోలో ఉన్నది శరత్.
ఇంటర్ చదువుతున్న సమయంలో మా ఆఫీస్ అసిస్టెంట్ గా చేరాడు. అన్వీక్షికి వచ్చిన ఎవరికైనా శరత్ తెలిసే ఉంటాడు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పుస్తకాల షాపు వాళ్ళకి శరత్ తెలుసు. అతనే మా సేల్స్ అన్ని చూస్తాడు.
చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ పని చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు గ్రూప్స్ కోసం కోచింగ్ లో చేరుతున్నాడు. వచ్చే సంవత్సరం బుక్ ఫెయిర్ కి పుస్తకాలు కొనే పాఠకుడిలా వస్తాడు శరత్.
చివరి ఫొటోలో ఉన్నది సాయి.
సాయి గురించి చెప్పాలంటే చాలా కష్టం. సాయి పరిచయం లేకపోతే మాటలు రావేమో అనుకుంటాం. చూడ్డానికి బక్కగా అసలు తినడేమో అనుకుంటాం. లోపల సిక్స్ ప్యాక్ బాడీ సాయిది. అతను మా దగ్గర పని చేయడు. కానీ ఆఫీసులో కూర్చుని తన పని చేసుకుంటాడు.
చెప్పుకోవాల్సిన విషయం. మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇతని షార్ట్ ఫిల్మ్ లో మ్యూజిక్ బాగా వైరల్ అయింది ఒక సమయంలో.
వీళ్ళు. వీళ్ళలాంటి మరికొంతమంది.
ఇది మాది అనుకుని మాతో నిలబడ్డారు.
అదే అన్వీక్షికి.
Dear @KTRBRS
We are experiencing strong chemical smells at Pragathi Nagar causing a lot of distress
Bringing to your notice after complaining @TelanganaPCB
& all officers who could not help fix the issue
https://t.co/aFYKGZv1CO
Society: Pragathis Raghupathi County
Please help
పోయిన సారి కలిసినప్పుడు తన 'దిగంతం' నవల మీద 'సంజయా! విధినేమందు?' అని సంతకం చేశారు కాశీభట్ల గారు... తను దిగంతాలకు వెళ్తూ మాకు తన అక్షరాల్ని, జ్ఞాపకాల్ని మాత్రం మిగిల్చారు. miss you sir!
ఉగాది నవలల పోటీ ద్వారా కొత్త నవలలను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. గత రెండు దశాబ్దాలుగా నవలలు రాసే రచయితల సంఖ్య తగ్గిపోవడం మనకందరికీ తెలుసు. కానీ ప్రపంచ వ్యాప్తంగా నవలలే బెస్ట్ సెల్లర్స్ కావడం, అలాంటి నవలలు తిరిగి సినిమాలుగా, సీరీస్లుగా రావడం అందరికీ తెలుసు.
తెలుగులో కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది. తిరిగి అలాంటి ఒక ప్రయత్నం ఎందుకు జరగకూడదు అనే ఆలోచనతో మేము చేసిన ఉగాది నవలలపోటీకి అన్ని రకాల నవలలు వచ్చాయి. ఇప్పటికే మేము ఎంపిక చేసిన కొన్ని నవలలను ఇంతకుముందు పరిచయం చేశాం.
ఇప్పుడు ఈ పోటీలో ఎంపికైన కొన్ని క్రైం నవలల గురించి:
అజ్ఞాతవాసి - సింహప్రసాద్
అగాథా క్రిస్టీ నవలల్లో ఎక్కువ శాతం ఉండే కథనం ఈ నవలలో ఉంది. నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొనే పెద్ద పార్టీలో కథ మొదలవుతుంది. ఈ పార్టీ ఏర్పాటు చేసింది నగరంలో పెద్ద పారిశ్రామికవేత్త, వందల కోట్ల ఆస్తి ఉన్న విశ్వమూర్తి. పార్టీ మధ్యలో విశ్వమూర్తి మాసివ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోతాడు. కానీ అది తర్వాత మర్డర్ అని తేలుతుంది. పార్టీలో ఉన్న వాళ్లే ఎవరో ప్లాన్ చేసి అతన్ని చంపేశారన్నది నిజం. కానీ ఎవరు? చివరివరకూ ఎన్నో ట్విస్ట్స్ ఎండ్ టర్న్స్‌తో నడిచే కథ.
బుట్టబొమ్మ - సాయిరాం ఆకుండి
మనం ఎన్నో సీరియల్ కిల్లర్ కథలు, సినిమాలు, సీరీస్లు చూసుంటాం. కొన్ని బావుంటాయి. కొన్ని బోర్ కొడ్తాయి. ఈ కథలన్నింటిలోనూ మనకి ఆసక్తి కలిగించే అంశం - అసలు సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం. అలాగే సీరియల్ కిల్లర్ మోడస్ ఆపరాండీ కూడా ఒక్కోసారి ఆసక్తి కరంగా ఉంటుంది. ఇవన్ని విషయాల్లో సాయిరాం ఆకుండి తన కథను గొప్పగా మలిచారు. చాలా యూనిక్ పాయింట్‌తో నడిచే కథ ఇది.
సాలెగూడు - తిరుమలశ్రీ
ఉగాది నవలలు చదివిన న్యాయనిర్ణేతలు కొన్ని నవలలు మాత్రమే ఆపకుండా చివరివరకూ చదివారు. అందులో ఒకటి ఈ నవల. మొదలైన దగ్గర్నుంచీ చివరి వరకూ పేజ్ టర్నర్లా చదివించే కథ ఇది. నేపాల్ లో కథ మొదలై, జ్యూరిచ్‌లోని స్విస్ బ్యాంక్ నేపథ్యంలో నడుస్తూ, కొంతసేపు గోదావరి కి షిఫ్ట్ అయ్యి, పాకిస్తాన్, ఢిల్లిలో కథ కొనసాగుతుంది. అలాగే రా ఏజెంట్స్, ఫ్యాషన్ మోడల్స్, పాకిస్తామన్ ఆర్మీ, స్విస్ బ్యాంకులో భారతీయులు దాచుకున్న దొంగసొమ్ము - చాలా రిలవెంట్ అంశాలున్న కథ. ఇన్ని విషయాలు ఒకేసారి జరుగుతున్నా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా నడిచే కథ.
ఆపరేషన్ రెడ్ - పాణ్యం దత్తశర్మ
ఈ నవలల పోటీలో మొత్తం మూడు సీరియల్ కిల్లర్ నవలలు రావడం ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడు క్రైమ్ ఫిక్షన్లో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే. అయితే దత్తశర్మ గారి నవలలో హంతకుడు హత్యలు చేసే తీరు, అతను చంపడానికి ఎన్నుకున్న వ్యక్తులు ఎవరో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొంత సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి ఒక కామెంట్రీ చేస్తూనే, ఆ కథ చెప్పడానికి ఒక క్రైం నేపథ్యాన్ని ఎన్నుకోవడం ఈ నవల ప్రత్యేకం.
వచ్చే వారం మరికొన్ని నవలల పరిచయాలు పరిచయం చేయబోతున్నాం. వీలైతే @AnvikshikiPub@chaduvuapp పేజెస్ ఫాలో అవ్వండి. మా పుస్తకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి.
#ఉగాదినవలలు
ఆన్వీక్షికి-చదువు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీలో మాకు వందకు పైగానే నవలలు వచ్చాయి. అందులో మేము 28 నవలలను ఎంపిక చేసి, రచయితలందరితోనూ చర్చించి వారి నవలలో ఉన్న లోటుపాట్లు తెలియచేసి, వాటిని మరింత బాగా వచ్చేలా కృషి చేస్తున్నాం.
ఈ నవలల పోటీ పెట్టడంలోని ముఖ్య లక్ష్యమే తెలుగు రచయితలను మళ్ళీ నవలలు రాసేలా ప్రోత్సాహం అదించడం కాబట్టి, ఎక్కువ నవలలను సెలెక్ట్ చేయడం జరిగింది.
కానీ మరీ ఇన్ని నవలలు సెలెక్ట్ చేయడమేంటి అని కొంతమంది మిత్రులు అడిగారు. మేము సెలెక్ట్ చేసిన ప్రతి నవల కూడా ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ఎంపిక చేయలేదు. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ నవలలు పాఠకులకు అందుబాటులోకి వస్తాయి. అందులో పాఠకుల మన్ననలు పొందేవి ఏవి అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే ఈ నవలలు మేము ఎంపిక చేయడానికి కారణాలు, ఆయా నవలల ప్రత్యేకతలు పరిచయం చేద్దామనే ఆలోచనలో భాగం ప్రతి వారం కొన్ని నవలల పరిచయం చేస్తున్నాం.
వేసవి కూలి - కుమార యశస్వి
ఈ నవల ఒక పాతికేళ్ళ కుర్రాడు రాసాడంటే నమ్మబుద్ధి కాలేదు. ఉదయం లేస్తే వేసవి శెలవులు, చక్కగా ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడాలని రాత్రంతా కలలు కంటున్న ఒక పధ్నాలుగేళ్ళ పిల్లవాడికి ఉదయం లేవగానే పరిస్థితులు తారుమారవుతాయి; తండ్రితో పాటు బిల్డింగ్ పని చెయ్యడానికి కూలికి వెళ్ళాల్సి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలు, కలిసిన మనుషులు, ఎదురైన పరిస్థుతులే ఈ నవల కథాంశం. ఇంత చిన్న కథాంశంతో నవల రాయడం, అదీ ఆ రచయిత మొదటి నవల కావడం చాలా నచ్చింది. కేచర్ ఇన్ ది రై అనే నవలలో హోల్డెన్ కాల్ఫీల్డ్, చాసో రాసిన ఎందుకు పారేస్తాను నాన్నా గుర్తొచ్చాయి నాకు, ఈ నవల చదువుతున్నప్పుడు. యశస్వి ఇంతకుముందు ఒక కథ రాశాడు. అది తప్పితే తెలుగు సాహిత్య రచనలో పెద్ద అనుభవం లేని వాడు. అయినా కూడా సమాజం పట్ల ఎంతో సునిశిత దృష్టి కలిగిన వాడని ఈ నవల తెలియచేస్తుంది. కథలు రాయడమే కష్టమై పోతున్న ఈ రోజుల్లో నవలతో మొదలు పెట్టిన ఈ రచయితను ప్రోత్సాహించడం ఒక బాధ్యత అనిపించింది.
అదృశ్య సంకెళ్లు - శొంఠి జయప్రకాష్
ఈ నవల చదవకముందు జయప్రకాష్ గురించి తెలియదు కానీ ఆయన గతంలో నవల రాసిన అనుభవం ఉంది. అదృశ్య సంకెళ్లు అనే ఈ నవల 1973 వ సంవత్సరంలో అనంతపూర్ జిల్లాలో జరిగే కథ. గొందిరెడ్డి పల్లి అనే ఊరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమిష్టి వ్యవసాయ సంఘానికి సెక్రటరీగా వచ్చిన సెబాస్టియన్ రాజు అనే దళిత యువకుని కథ. అప్పటికీ ఇప్పటికీ ఇంకా రాజ్యమేలుతున్న కుల వ్యవస్థ దళితుల ఆత్మగౌరవాన్ని ప్రతి క్షణం ఎలా కించపరుస్తుందో తెలియచెప్పిన కథ. ఆ ఊరిలో రాజు ఎదుర్కొన్న కష్టాలు, తను కలలు కన్న జీవితం, పరిస్థుతుల ప్రభావంతో అతనికి అందిన జీవితం, ఈ రెంటి మధ్య దూరాన్ని చెరపాలనే అతని కోరిక, తన కలను సాధించుకునే దిశలో రాజు చూపించిన రెసిలియన్స్ చాలా నచ్చింది. దళిత ఆత్మ గౌరవాన్ని ఎత్తి చూపించే నవల ఇది.
అన్వేషణ - శిరంసెట్టి కాంతారావు
కాంతారావు గారు ఇప్పటికే చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన రచయిత. ఈ నవల చదువుతున్నప్పుడే అనుభవశాలు అయిన రచయిత అని అర్థమైంది. ఒక తెలంగాణ పల్లెటూరిలో తొంభైలలో మొదలయ్యే ఈ కథలో గాజులు అమ్ముకునే మోనయ్య, అతని కుటుంబం కథ ఇది. వృత్తి కార్మికుడైన మోనయ్య తన ఊర్లో గాజుల వ్యాపారం నడపడం కష్టమై, తన ఊరి నుంచి హైదరాబాద్‌కి వలస వచ్చి పాతబస్తీలోని చూడీ బజార్లో ఒక గాజుల షాపులో పనికి చేరడంతో కథ మొదలవుతుంది. గాజుల తయారీ నుంచి, గాజుల అమ్ముకం వరకూ ఎన్నో అద్భుతమైన డీటెయిలింగ్ ఈ నవలలో ఉంది. అంతే కాకుండా మనసుకు హత్తుకునే మానవసంబంధాలు, పేదవారి జీవితంలోని కష్టనష్టాల తోపాటు వారి జీవితంలోని చిన్ని చిన్ని ఆనందాలనూ ఎంతో చక్కగా వివరించారు. ముఖ్యంగా గాజులు తయారు చేసే ఫ్యాక్టరీలు, అక్కడ పనిచేసే వారి జీవితాలే కాకుండా గాజుల తయారీలో ఎంతో ముఖ్యమైన లక్క అసలు ఎక్కడ తయారవుతుంది, లక్కను చెట్లనుండి తీసే విధానం గురించి కూడా ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా గాజుల తయారీ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇదొక ఉపయోగకరమైన డాక్యుమెంట్‌గా కూడా పనికొస్తుంది.
పెళ్లి పుస్తకం - లక్ష్మి గాయత్రి
ఇంజనీరింగ్ కాలేజ్‌లో కలిసి చదువుకున్న నలుగురు అమ్మాయిలు, వారి జీవితాలను ఎక్స్ప్లోర్ చేసిన నవల ఇది. అందరూ ఒక్కోదారిలో వెళ్లిపోయినా తమ జీవితాల్లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ తమలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలబడి స్నేహానికి ఉన్న విలువలను తెలియచేసిన నవల.
వచ్చే వారం మరికొన్ని నవలల పరిచయాలు పరిచయం చేయబోతున్నాం. వీలైతే @AnvikshikiPub@chaduvuapp పేజెస్ ఫాలో అవ్వండి. మా పుస్తకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి.
చదువు/ఆన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన
ఉగాది నవలల పోటీ ఫలితాలు
--
చదివే వాళ్ళు లేకుంటే రాసేవాళ్ళు ఎందుకు రాస్తారు?
తెలుగులో ఒక పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కష్టమైపోయింది. ఇది నిజం. ఇప్పుడు చాలామంది తెలుగులో మొదటి ఎడిషన్ అంటే రెండొందల కాపీలు ప్రింట్ చేస్తున్నారు. అదే మలయాళంలో ‘ఆడు జీవితం’ నవల ఇప్పటికి 150 ఎడిషన్స్ ప్రింట్ అయ్యాయి. ‘ఒరు సంకీర్తనం పోలే’ అనే నవల లక్షల కాపీలు అమ్ముడైంది. ‘రాం కేరాఫ్ ఆనంది’ అనే నవల గత రెండు నెలల్లో లక్షన్నర కాపీలు అమ్ముడైంది. ఇవి అప్పుడప్పుడూ జరిగే ‘ఔట్ లయర్స్’ కింద తీసేసి పక్కన పెట్టినా, మలయాళంలో, తమిళ్, కన్నడలో తెలుగులో ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు. పోనీ తెలుగులో చదివేవాళ్ళు లేరా అంటే, మొన్నీ మధ్యన వచ్చిన బ్రహ్మానందం గారి అత్మకథ ఎన్ని వేల కాపీలు అమ్మామో మాకు తెలుసు. రాం గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ ఎన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయో తెలుసుకున్నా, ‘ఇకిగాయ్’, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’, ‘శివ ట్రైలజీ’ లాంటి పుస్తకాలు పదివేలకు పైగానే అమ్ముడుపోయాయి. మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, చివరకు మిగిలేది పుస్తకాలు నెలకి 500 కాపీలు పైగానే అమ్ముడవుతాయని ఒక అంచనా. ప్రతిలపి లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో కొన్ని కథలు లక్షమందికి పైగానే చదివిన సందర్భాలూ ఉన్నాయి. మరి వీరంతా తెలుగు చదివేవాళ్ళే కదా? మరి ఇంతమంది చదువరులు ఉండగా పుస్తకాలు ఎందుకు అమ్ముడు పోవడం లేదు అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే క్రమంలో పుట్టినవే ఆన్వీక్షికి, చదువు.
ప్రపంచ వ్యాప్తంగా పుస్తకాల కొనుగోళ్ల విషయంలో ఉన్న ఒక అంచనా ప్రకారం, 35% పుస్తకాలు నవలలు, 20% పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్, 10% పుస్తకాలు బయోగ్రఫీలు, 10% చిన్న పిల్లల పుస్తకాలు, 10% నాన్ పిక్షన్ పుస్తకాలు అమ్ముడుపోతుండగా మిగిలిన పుస్తకాలన్నీ కలిపి మరో 15% అమ్ముడుపోతున్నాయి. ఇది మరీ ఖచ్చితమైన లెక్క కాకపోయినా, చిట్టచివరి 15%లో ఉండే కథలు, కవితలు లాంటి పుస్తకాలే ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా వస్తున్న పుస్తకాలు. తెలుగులో రచయిత అంటే అత్యధికంగా కథల సంపుటి లేదా కవితలు రాసే వాళ్లే మనకి అత్యధికంగా కనిపిస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా పాఠకులు మొగ్గు చూపుతున్న ఇతర పుస్తకాలు వదిలేయడం వల్లనే మనకి పాఠకుల లేమి అని అర్థం చేసుకోడానికి పి.హెచ్.డిలు చెయ్యక్కర్లేదు. అత్యధిక పాఠకులను ఆకర్షించగలిగే నవల అనే ప్రక్రియను మనం పక్కన పెట్టి, ఇప్పుడు పాఠకులు లేరని బాధపడడంలో అర్థమే లేదు.
ఇది సమస్య.
దీనికి పరిష్కారం ఒక్కరి వల్ల కాదు. ఒక్క రోజులో అవ్వదు. రెండున్నర దశాబ్దాలుగా మనం వదిలేసిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే క్రమంలో మేము మొదటి అడుగు వేద్దామనుకున్నాం. అలా మొదలైందే ఉగాది నవలల పోటీ. మాకు వీలైనంతలో భారీ పారితోషకం అందచేస్తూ, రచయితలను నవల వైపు మళ్ళించాలనే ప్రయత్నంలో ఈ పోటీ ప్రకటించాం. దాదాపు ఆరు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో ఇంతవరకూ తెలుగులో నవలలపోటీ జరిగినట్టు మాకైతే తెలియదు. ఈ పోటీకి మేము అనుకున్నదానికంటే మంచి స్పందనే లభించింది. కానీ ఎక్కువ శాతం పాతకాలపు కథలే వచ్చాయి. ఆ విషయాలన్నీ ఇంతకుముందు మరొక వ్యాసంలో పంచుకున్నాం. ఇప్పుడు నవలలపోటీ ఫలితాల విషయానికి వస్తే …
ఈ నవలలపోటీలో పాల్గొన్న చాలామంది రచయితలతో మేము ఫలితాలు ప్రకటించకముందే సంప్రదించి వారి నవలలు ఎడిట్ చేస్తే బాగవుతాయి అనుకున్న చోట వారి చేత రీరైట్ చేయించడం జరిగింది. దానికి కొంతమంది స్పందించలేదు. చాలామంది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఫలితాల ప్రకటించిన తర్వాత కూడా వీలైనంత రీవర్క్ చేయించి, ఆ తర్వాతే పుస్తకాలను ప్రచురించే ఆలోచనలోనే ఉన్నాం. ఈ పోటీలో గెలుపొందిన రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారనే అనుకుంటున్నాం.
ఈ పోటికి పంపించిన నవలల్లో మాకు వీలైనన్ని ఎక్కువ నవలలను పబ్లిష్ చేసే క్రమంలో గతంలో ప్రకటించిన నియమ నిబంధనలకు ఆతీతంగా ఈ ఫలితాలు ప్రకటిస్తున్నాం. ఎలాగైనా తెలుగు నవలకు మళ్ళీ పునర్వైభవం తీసుకు రావాలన్నదే మా ఆకాంక్ష.
బహుమతులు గెలుచుకున్న రచయితలకు అభినందనలు.
కడలి, సుదర్శన్ ఆన్వీక్షికి ద్వారా రచయితలయ్యారు. వారిద్దరూ ఈ రోజు రెండు వివిధ విభాగాల్లో మొదటి బహుమతి అందుకున్నారు. ఇది ఆన్వీక్షికి విజయంగానే మేము చూస్తున్నాం.
మొదటి బహుమతి, రెండవ బహుమతి అని కాదు కానీ ఓవరాల్‌గా మేము బహుమతికి అర్హమైన నవలలను స్వీకరించడానికి పెట్టుకున్న విధి విధానాల్లో ముఖ్యమైనది – ఈ నవల కొత్త పాఠకుడిని ఆకర్షించగలదా? అని.
కడలి తన నవల ‘చిక్ లిట్’ ద్వారా ఒక అవసరమైన ఒక అర్జెంట్ వాయిస్‌ని ప్రస్తుత ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేసింది. సుదర్శన్ ఒక వెబ్ సీరీస్ కి సరిపోయేలా ‘అనుకోకుండా’ అనే అద్భుతమైన థ్రిల్లర్ రాసి ఆశ్చర్యపరిచాడు. రంగస్థలం నేఫథ్యంలో వచ్చిన కెవివి సత్యనారాయణ నవల ‘యవనిక’ మాకు బాగా నచ్చింది. ఈ నవల కొన్నేళ్ల ముందొచ్చుంటే మనం మరాఠీ సినిమాని రీమేక్ చేయడం కాదు, మన సినిమానే ఇంకెవరో రీమేక్ చేసుకుని ఉండేవాళ్ళు. బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన థ్రిల్లర్ నవల ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు కథనంలో వాడడం నచ్చింది.
కుమార్ యశస్వి రాసిన ‘వేసవి కూలీ’ మా అందరికీ బాగా వచ్చిన నవల. పాతికేళ్ళు కూడా నిండని ఈ రచయితకు ఇది మొదటి నవల. అయినా ఒక రోజులో జరిగే జీవితాన్ని కథనం చేయడంలో అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అలాగే మరో ముగ్గురు యువరచయితలు – ప్రసాద్ సూరి (24), భవ్య శర్మ (21), మొహమ్మద్ గౌస్ (26) - సాధన చేస్తే భవిష్యత్తులో మంచి నవలలు రాయగలిగే సామర్థం కలిగి ఉన్నవాళ్లే. వీరందరికీ ఆలవిల్లి (సత్తూరు) నిర్మలా దేవి పురస్కారాల అందచేస్తున్నాం.
జోగిని వ్యవస్థ మీద సంధ్యా విప్లవ్ రాసిన ‘త్రికాల’, స్టూవర్ట్ పురం గురించి ఇంతవరకూ ఒక అథెంటిక్ డాక్యుమెంట్ లేని లోటు తీరుస్తూ సలీం రాసిన ‘లోహముద్ర’, మారుతున్న మానవ సంబంధాల్లో ఉన్న కాంప్లికేషన్స్‌ని కొంత మెలోడ్రామాతో రాసిన తటవర్తి నాగేశ్వరి నవల ‘ప్రేమే నేరమా?’ ఎంతో అవసరమైన పుస్తకాలు అనిపించాయి.
కృష్ణ కిశోర్ రాసిన ‘రుద్ర రుధిరం’ ఒక మంచి ఫాంటసీ థ్రిల్లర్. టైం ట్రావెల్ ఉంటుంది కానీ సైన్స్ ఫిక్షన్ కాదు. సుగుణా రావు నవల ‘పైనల్ డయాగ్నాసిస్’ చివరి పేజీ దాకా ఎంతో అసక్తికరమైన మలుపులతో సాగింది. ఎనిడ్ బ్లైటన్ సృష్టించిన ‘ఫేమస్ ఫైవ్’ లాగా కొయిలాడ రామ్మోహన్ రావు ‘ఎదురులేని ఏడు’ చిన్న పిల్లలు చదువుకోదగ్గ మంచి నవల.
అజ్ఞాతవాసి (సింహప్రసాద్), బుట్టబొమ్మ (సాయిరాం ఆకుండి), అన్వేషణ (శిరంశెట్టి కాంతారావు), ఆపరేషన్ రెడ్ (పాణ్యం దత్తశర్మ), అదృశ్య సంకెళ్లు (జయప్రకాశ్ సొంటి), కలిసుందాం కడదాకా (బొంతా లక్ష్మీ గాయత్రి), తోకలేని పిట్ట (పుల్లా రామాంజనేయులు), దేవుడి మొర (ఆకురాతి భాస్కర్ చంద్ర), నాలో ఉన్న ప్రేమ (స్వప్నప్రియ గంజి), నియాంపురం (రాజా నరసింహ), బిట్టు దేవత (చంద్రశేఖర్ ఆజాద్), బ్లాక్ ఎండ్ వైట్ (వాణిశ్రీ), శృంగార యాత్ర (వి. రాజారాంమోహన్ రావు), సాలెగూడు (పివివి సత్యనారాయణ) నవలలు కొన్ని అవసరమైనవి, కొన్ని వినోదాత్మకమనవి కూడా ఉన్నాయి. ఈ నవలలు కూడా చదువులో ఈ బుక్స్ గా ఉంటాయి. రచయితల ఆసక్తిని బట్టి కొన్ని ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంది.
మాకు వచ్చిన వందకు పైగా నవలల్లో ముప్ఫై నవలలు ప్రచురించి, రచయితలను నవల వైపు ప్రోత్సాహించాలనే మా ఈ ప్రయత్నం.
ఈ నవలలన్నీ ఎడిటింగ్, లే అవుట్, ప్రూఫ్ చేయడానికి చాలా సమయం పడ్తుంది. కాబట్టి ఈ నవలలు పబ్లిష్ చేయడానికి మరో మూడు నాలుగు నెలలైనా పడ్తుంది. అది కూడా ఒకేసారి అన్ని నవలలు కాకుండా డిశెంబర్ కల్లా అన్ని పుస్తకాలూ అచ్చు వేయాలనేదే మా ప్రయత్నం.
ఈ నవలలపోటీలో యువ రచయితలకు బహుమతులు అందచేసి వారిలో ఉత్సాహం నింపిన శ్రీనివాస్ ఆలవిల్లి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ నవలల పోటీ నిర్వహించడంలో సహకరించిన మిత్రులు, రచయితలకు మా కృతజ్ఞతలు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
@AmirLadka7 This is mentioned in the book “why I’m an atheist” by Bhagat Singh but not said by him. It’s supposedly said by Thakur Roshan Singh or one of the martyrs of Kalirai case. Still trying to figure out who exactly said it.
Anveshippin kandethum first thoughts: A well written story or a well made movie doesn’t have a single unnecessary scene and each scene feels like a natural progression for the previous. That’s some master storytelling you can learn from this movie.
అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి!
Kotabommali P.S is a decent adaptation from the original #Nayattu. The nativity and issues of the state were well adapted. Congratulations team #KotaBommaliPS. A special mention to dear friend @kasi_nagendra for his splendid dialogues.
@amazonIN order was never delivered but marked as delivered. When contacted the call centre they were not ready to take a compliant and there’s no other way to raise a complaint. Horrible customer service as usual. @jagograhakjago please make a note.