ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి… నేను వైద్యం చేయను
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన
తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
రోగులను పట్టించుకోకుండా ఉండడంతో వైద్యం చేయాలని డాక్టర్‌ను కోరిన బంధువులు
వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన డాక్టర్
434/440 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా!
నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు అంటూ కించపరిచిన మహిళా లెక్చరర్
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్(17) అనే విద్యార్థి
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులతో జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్న తరుణ్
కాలేజీలో 435 మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ తరుణ్‌ను కించపరిచిన ఓ మహిళా లెక్చరర్
అలా అవమానపరచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను విజ్ఞప్తి చేసిన తరుణ్
నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై కొట్టి అవమానించిన లెక్చరర్
లెక్చరర్ ప్రవర్తనకు క్లాస్ అంతా నవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన విద్యార్థి
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి, మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ అవమానించకూడదు, ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి అంటూ తరుణ్ సూసైడ్ నోట్
ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఇది ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్న తరుణ్
నిర్మల్:కడెం ప్రాజెక్టు ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు నదీ ప్రాంత ప్రజలు రైతులు మత్స్యకారులు గొర్రెల కాపరులు నది ఒడ్డుకు వెళ్లవద్దని సూచించారు fillepic @Praja_Snklpm
📢 Important Announcement!
Passport, Visa & Attestation services in the UAE w.e.f. 22 July 2026 have been outsourced to Al Hind Tours & Travels, delivered through 16 Indian Consular Application Centres (ICACs).
🔗 Book appointments at: https://t.co/hc0A9bDny5
జగిత్యాల జిల్లా:
కథలాపూర్ మండల శివారులోని వరదకాలువ వద్ద మెట్ పల్లి, కోరుట్ల, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం, పరివాహక ప్రాంతం రైతుల ఆందోళన,
వరద కాలువలో నీరు విడుదల చెయ్యాలని నిరసన. చేసినా రైతులు కన్నెపల్లి నుండి నీరు విడుదల చెయ్యాలని డిమాండ్. @CPRO_TGCM@Praja_Snklpm@TGGovtUpdates
సాటి కుర్రాళ్లు రాకెట్లు ఎగరేస్తుంటే.. మనం సోషల్ మీడియా బూతుల్లోనే బతికేద్దామా?
ప్రపంచం ఎంత వేగంగా దూసుకుపోతోందో చెప్పడానికి ఇవాళ ఒక అద్భుతమైన ఉదాహరణ కళ్లముందు నిలిచింది. హైదరాబాద్ వేదికగా పురుడుపోసుకున్న 'స్కైరూట్ ఎయిరోస్పేస్' సంస్థ ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి తన రెండో రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపి, స్పేస్ స్టార్టప్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2018లో పవన్, భరత్ అనే ఇద్దరు సాధారణ తెలుగు కుర్రాళ్లు మొదలుపెట్టిన ఈ ప్రయాణం.. ఇవాళ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ విజయం ఎంత గొప్పదంటే.. నేరుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే భరత్‌కు ఫోన్ చేసి, లైవ్‌లో అభినందించారు. ఆ సమయంలో ప్రధాని అన్న ఒక మాట ప్రతి యువకుడి గుండెల్లో తూటాలా పేలాలి. "మీరిద్దరూ ఇలాగే ముందుకు వెళ్లాలని నేను అనను.. ఎందుకంటే మీరు ముందుకు కాదు, నిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లాలి" అంటూ మోదీ వారిని ఆకాశానికెత్తేశారు. ఇద్దరు తెలుగు యువకులు దేశం గర్వించే స్థాయికి చేరుకున్న వైనం ఇది.
కానీ, ఒక్కసారి మన చుట్టూ ఉన్న నేటి యువతను చూస్తే మనసు కలచివేస్తుంది.
ఒకవైపు మన వయసున్న కుర్రాళ్లు అంతరిక్షాన్ని తాకే రాకెట్లు తయారుచేస్తుంటే.. మరోవైపు నేటి యువతలో అధికశాతం మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కాలం వెళ్లదీస్తున్నారు. ఎవడో రాజకీయ నాయకుడి కోసమో, ఏ సినిమా హీరో కోసమో గ్రూపులుగా విడిపోయి, ఒకరినొకరు అత్యంత దారుణంగా బూతులు తిట్టుకుంటూ బతుకుతున్నారు. విలువైన సమయాన్ని, జీవితాన్ని స్క్రీన్ల ముందు టైప్ చేసే బూతు పురాణాలకే పరిమితం చేస్తున్నారు. పరస్పర ద్వేషంతో కాలం గడిపేస్తే జీవితానికి అసలు విలువ ఏముంటుంది?
మాకు ఇన్ని కబుర్లు చెబుతున్నావ్..నువ్వేం పీకావ్ అని నన్ను అడగొచ్చు... నేను భరత్,పవన్ లా అంత స్థాయికి ఎదగాలని ప్రయత్నాలుచేసినవాడినే..నిజానికి నేను ఒకరకంగా లైఫ్ లో సక్సెస్ సాధించినట్టే..ఎందుకంటే ఒకప్పుడు చిన్నరైస్ మిల్లులో ఆపరేటర్ గా ఉన్ననేను ఇప్పుడు బిగ్ టీవీ న్యూస్ ఛానెల్ కి చీఫ్ ఎడిటర్ గా ఉన్నాను.. ఇది రాకెట్ ఎగరేసినంత పెద్ద విషయం కాకపోవచ్చు..
నేనూ మీలాంటి వాడినే. నేను పుట్టి పెరిగిన సాధారణ వాతావరణం నుంచి, కష్టాన్నే నమ్ముకుని, ప్రతి అడుగులో శ్రమిస్తూ ఇవాళ ఒక బాధ్యతాయుతమైన, ఉన్నతమైన పొజిషన్‌కు చేరుకున్నాను. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నా స్వంత అనుభవంతో చెబుతున్నాను. నా ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఒక్కటే—సమయాన్ని మన ఎదుగుదల కోసం వాడుకోవాలి తప్ప, పక్కవాడిని బూతులు తిట్టడానికి కాదు
పొలిటికల్ పార్టీల మీరు జెండాలు మోస్తే వాళ్లు అందలాలు ఎక్కుతారు..అభిమానంతో మీరు సోషల్ మీడియాలో అవతలి పార్టీ వారి మీద బూతులు తిట్టి వారితో మీరు తిట్టించుకుంటే నాయకులు పదవు అనుభవిస్తారు.. అంతేతప్ప మీకు ఒరిగేదేమీ లేదు..
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు సమాజంలో గర్వంగా తల ఎత్తుకోవాలన్నా, ఈ తెలుగు గడ్డ కీర్తి ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలన్నా మార్పు మీలోనే రావాలి. మీ ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన హిడెన్ టాలెంట్ (దాగి ఉన్న ప్రతిభ) ఉంటుంది. దాన్ని బయటకు తీయండి. మీకు నచ్చిన రంగం ఏదైనా కావచ్చు—అది వ్యాపారం, సైన్స్, కళలు, లేదా మరేదైనా కావచ్చు—అందులో పవన్, భరత్ లాగా మీ ముద్ర వేయండి.
రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ, హీరోల ఫ్యాన్స్ వార్స్‌లో జీవితాలను వృధా చేసుకోకండి. మీరు కూడా వారిలాగే, అంతకంటే గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాకెట్ లాగా మీ ఆలోచనలు కూడా నింగికి దూసుకెళ్లాలి....అశోక్ వేములపల్లి
Metpalli:Sarpanch Sunketa Aruna Gangadhar a garbage segregation awareness program & women’s GPDP meeting was held.Women’s issues health education rights and Swachh Bharat programs were discussed Officials and villagers Mcp participated @TelanganaCS@Praja_Snklpm@TGGovtUpdates
విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ఇస్రోలో యువ శాస్త్రవేత్తల సంబరాలు..
విక్రమ్-1 రాకెట్‌ను తయారు చేసిన స్కైరూట్ సంస్థ..
మిషన్ ఆగమన్ పేరుతో తొలి టెస్ట్ ఫ్లైట్..
తక్కువ భూకక్ష్యలోకి పేలోడ్లను పంపే సామర్థ్యాన్ని పరీక్షించనున్న విక్రమ్-1
#Vikram1#MissionAagaman #SkyrootAerospace #SpaceSuccess #IndiaSpaceSector #Innovation #RTV
Metpalli:Sarpanch Sunketa Aruna Gangadhar a garbage segregation awareness program & women’s GPDP meeting was held.Women’s issues health education rights and Swachh Bharat programs were discussed Officials and villagers Mcp participated @TelanganaCS@Praja_Snklpm@TGGovtUpdates