చంద్రబాబూ.. నువ్వు చేసింది మోసం.. చెప్పింది అబద్ధం
నీ మీద 420 కేసు పెట్టకూడదా చంద్రబాబు?
నేను ట్వీట్ పెట్టా.. అందరూ ట్వీట్ పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలుపు ఇస్తున్నా :- వైఎస్ జగన్
#YSJaganMohanReddy#YSRCP#andhrapradhesh
Detaining Social Media activists is infringing their fundamental rights and a direct assault on the Constitutional guarantee. These politically motivated arrests of social media activists and their ill treatment in the custody, driven by the influence of @JaiTDP leaders, is a grave violation of all the democratic principles. Such abuse of power by the police is unpardonable and goes against the very essence of right to express. We strongly condemn these motivated actions and will not hesitate to take legal action to protect their rights, if it is not stopped forthwith.
#FreedomofExpression
#JusticeForSMActivists
1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబుగారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా?
2.ఎలాగూ చంద్రబాబుగారి చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్ చేశారు. ఇక చంద్రబాబుగారికి కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్ మీడియా. అందుకే చంద్రబాబుగారు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు?
3.ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబుగారి సిద్ధాంతం. దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినికూడా దీనికి వాడుకుంటారు. ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేష్ద్వారా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబుగారు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా?
4.అయ్యా చంద్రబాబూ, మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్‌మీడియా అకౌంట్లో మీరే ఫేక్ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు. దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్నికూడా ఫేక్ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్ చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్లీ మా అమ్మ సాక్షాత్తూ వీడియో మెసేజ్ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇలాంటివి శతకోటి మీ ఏబీఎన్, మీ ఈనాడు, మీ టీవీ-5, మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా?
5.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబుగారు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారంవరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాలనుంచి ప్రజలను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబుగారు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుగారికి కాదా?
1. @ncbn గారి గురించి చెప్పాలంటే, మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసంచేస్తాడు. దీనికోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ-ప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్‌ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని 2 దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు, ఇప్పుడు సీ-ప్లేన్ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా, సీ-ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబుగారి బిల్డప్, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయి. ఓవైపు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ, మరోవైపు దీనిమీద ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ-ప్లేన్‌తో అభివృద్ధి ఏదో జరిగిపోయినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.
2. సీ-ప్లేన్ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారు. గుజరాత్లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా పలుమార్లు నిలిచిపోయాయి. ప్రతిరాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు?
3. ఆపరేషన్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యలు, ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలని అనేక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి 14 మంది ప్రయాణికుల సీ-ప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబుగారు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లోమీడియా కీర్తించడం, పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా?
4. సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి తద్వారా అభివృద్ధిచేసి ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం, ప్రభుత్వరంగంలో మెడికల్ కాలేజీలు కట్టి ప్రజలకు అందుబాటులోకి ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలు చంద్రబాబూ? సీ-ప్లేన్మీద పబ్లిసిటీ స్టంట్లు కావు.
5. చంద్రబాబుగారూ… రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టడం సంపద సృష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్‌లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా?
6. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91కోట్లతో మూలపేట, రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నంల వద్ద 3 పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? లేక సీ-ప్లేన్‌లో తిరిగి ఈ పోర్టు ఆస్తులను, మీ వారికి స్కామ్‌ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? ప్రభుత్వరంగ పోర్టులవల్ల రాష్ట్రానికి ఆదాయాలు పెరుగుతాయా? లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మి, సీ-ప్లేన్స్ వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా?
7. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734కోట్ల పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ప్రజల ఆస్తికాదా? ప్రజలకోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్రచరిత్రలో ప్రభుత్వరంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీకూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్లముందు లేవా? ఇవన్నీ వైయస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?
8. కాని చంద్రబాబుగారూ.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా, మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజలకోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం రంగంలో మంచి స్కూల్స్ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు.
.@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
@RGVzoomin@perni_nani Ramu sir, you are genius and courageous and every 1 knows the fact..pls raise your voice on national issues, ap govt is doing good ...plz don't degrade yourself by raising your voice for small issues .. lot of people are there to ask,who r making money,let them respond.thanks
At times I wonder whether it’s worth being in public life; especially in today’s social media times where anyone can say anything without an iota of shame or proof
And dragging kids into this cesspool of YouTube channels that dish out 24/7 nonsense in the guise of journalism
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో రైల్వే వీల్స్ ఉత్పత్తి ప్రారంభం కావడం శుభ పరిణామం. ఇకపై రైలు చక్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన విశాఖ ఉక్కు నుంచే తయారు కావడం గర్వకారణం. దేశంలోనే మొట్టమొదటి వీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే నిర్వహణ.
Dear Sri @kishanreddybjp Garu,
You wanted me to furnish the list of roads closed illegally within the Secunderabad Cantonment area
Here it is 👇 Hope you can do justice and ensure LMA reopens all roads immediately for the benefit of Millions of our citizens