పొలిటికల్ గా చెప్పడం లేదు
#అనంతవరంవెంకటేశ్వరస్వామి కోరుకున్న కోర్కెలను తప్పక తీరుస్తాడు...మొక్కుకున్న పని అయిన తరువాత తప్పకుండా మళ్ళీ వెళ్లి దర్శనం చేసుకోవాలి నేను అని మొదటి సారి వెళ్ళినపుడు అక్కడి పంతులు గారు చెప్పారు...
నాకు స్వీయనుభవం...
ఆరు నెలల క్రితం వెళ్ళినపుడు తీసిన ఫోటో
రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఎవరు పట్టించుకోరు
అదే 300 కోట్లు పెట్టి సినిమా తీస్తారు.అందులో సగం హీరో దొబ్బేస్తాడు అయినా సినిమా టిక్కెట్స్ రేట్స్ పెంచాలిపెంచక పోతే నువ్వు ఎవడ్రా టిక్కెట్ రేట్స్ తగ్గించటానికి అని ఫ్యాన్స్
మరి ఇప్పుడు ఎందుకు అనలేకపోతున్నారు
ఏదైనా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత ఓ మంచిరోజు చూసుకుని రిటైర్ అయిపోవడం ఉత్తమం. లేదూ చచ్చే���ాకా అక్కడే ఉండాలనుకుంటే ఆ స్థానం ఎప్పడు పోతుందో అనేభయంతో దాన్ని కాపాడుకోవడానికి అడ్డమైన పనులు చేస్తూ నవ్వులపాలౌతూ జీవితాన్ని ముగించాలి
ఎప్పడు ముగించాలో తెలిసినోడు నిజమైన ఆటగాడు!
ఆ స్పెషల్ ట్రైన్ల టికెట్ రేట్లు ఎంత.?
ఇవాళ్టి సంక్రాంతి, దసరా సెలవుల్లో ప్రైవేట్ ఆపరేటర్లు నిలువు దోపిడీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం..
ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్లంతా ఓట్లు వెయ్యడాని��ి వెళ్తారా, ఓట్ల కోసం వెళ్ళే వాళ్ళను దారి దోపిడీ చేస్తారా
దేశమంతా జమిలి ఎన్నికలు ఒకేసారి జరిపే బిల్లు కు లోకసభ ఆమోదించింది.ఇది ముందు రోజుల్లో అమల్లోకి వస్తే దేశం అంతటా ఒకే రోజు ఎన్నికలు. అందరికి ఆ రోజు సెలవు ఇస్తారా.? ఈ నిర్ణయం ఓటింగ్ శాతం పై ప్రభావం చూపుతోందా లేద���.?
15 రోజుల్లో 8 సార్లు చూసా..
రవి కిషన్ (మద్దాలి శివారెడ్డి) కామెడీ సీన్స్,
పెళ్లి చేసుకున్నవాడు తన ను వెదుక్కుంటూ వస్తాడని ఫూల్ కుమారి నమ్మకం,
ఆమె కి సాయం చేసే మంజు మాయి,
చోటు,
స్టేషన్ మాస్టర్, పుష్ప రా��ి
మొత్తం అద్భుతం
బ్యాంక్ కస్టమర్ కేర్ పని చెయ్యదు.
ఇక్కడ DM చెయ్యడానికి చూస్తే బ్యాంక్ వాడ��� హ్యాండిల్ వేరిఫై అయ్యింది ,నీది కూడా వేరిఫై అయితేనే DM చెయ్యొచ్చు.డబ్బు కట్టు అంటుంది..
సర్వీస్ సరిగ్గా లేదు అని చెప్పడానికి కూడా డబ్బు కట్టి స��్క్రైబ్ చేసుకొని చెప్పాలా..??
#బలవంతపువసూళ్లు
నేటి అమ్మానాన్న.
“అమ్మా కడుపులో ఏదో లాగుతోంది, గొంతులోకూడా పొడిగా ఉంది” అంటూ పరిగెత్తుకొచ్చి చెప్పాడు ఏడేళ్ల నాని.
“అయ్యో, బాబూ ఏమైంది? ఎప్పట్నుంచిలా? ఎందుకిలా?” ఆమెలో గాభరా, భయం, ఆందోళన అన్నీ.
“ఏమోనమ్మా,క్రికెట్ మ్యాచుఆట అయిపోయిన దగ్గర్నుంచీ ఇలా, అలా అనిపించగానే ఇంటికి వచ్చేశా…”
“అయ్యయ్యో అక్కడేదో అయ్యిందే, అక్కడేదో నెగటివ్ ఎనర్జీనో, లేక పోలెన్ అలర్జీనో నిన్ను పట్టేసిందే, నాకేం పాలు పోవట్లేదే!”
“ముందు నాన్నకి ఫోన్ చెయ్యమ్మా,” అని అమాయకం���ా చెప్పాడు నాని.
ఫోన�� చేసి విషయం చెప్పింది. ఉండు ఇప్పుడే వస్తున్నా అని ఇంటికి చేరుకున్న నాన్న, నానిని దగ్గరకి తీసుకుని, ఒళ్లంతా తడిమి, జుట్టంతా పామి, “అయ్యో బాబు ఆ క్రికెట్ ఆటలో యే పామో పొడవలేదు, యే కుక్కో కరవలేదు కదా..”
“కుక్కలన్నీ కట్టేసి ఉన్నాయి నాన్నా, ఇంకా ఎవరూ పాముల్ని పెంచుకోవట్లేదు. నాన్నా కడుపులో ఇంకా ఎక్కువ లాగుతోంది.”
“ఓర్నాయనో మా కొడుక్కి ఏదో అయిపోయింది” ఇద్దరూ భోరున ఏడుపు. నాని వాళ్ళని అ���ోమయంగా చూస్తున్నాడు. వాడికి కూడా కొంచెం భయం మొదలైంది.
వాళ్ల నాన్న బుర్రలో ఏదో ఐడియా వెలిగినట్లు వెంటనే సెల్ఫోను తీశాడు, గూగుల్లో వెదికాడు, కొడుకు తెలుగులో చెప్పిన కడుపులో లాగటాన్ని ఎలాగోలా తర్జుమా చేసి సెర్చు చేశాడు. గూగుల్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, అపెండిసైటిస్, మెసెంటరిక్ లింఫెడినైటిస్,హెపటోస్ప్లీనోమెగలీ అని అర్ధంకాని ఇంకో ఇరవైపేర్లు రాసి, చివ���్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా అవ్వొచ్చని చెప్పిండ్.
ఎంత ఉత్సాహంగా పరిష్కారం కోసం వెదికాడో, క్యాన్సర్ని చూసి అంతే నీరుగారిపోయాడు వాళ్ళ నాన్న. నాని వాళ్ల అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో అని చెప్పలేదు. అతని మదిలో కొడుకులేని జీవితం ఎలా అనే ఆలోచనలు అప్పుడే వచ్చేస్తున్నాయి.
ఆమె మాత్రం ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో చూసిన హోమ్ రెమిడీలు ఏవో తయారుచెయ్యడానికి వంటిట్లోకి దూరింది, జీలకర్ర, మిరియాలు మరిగించిన నీటిలో వేస్తోంది, ఆమె చేతులు వణుకుతున్నాయి, నాన్ని వాళ్ల నాన్న చేతులు పిసుక్కుంటున్నాడు. ఇద్దరికీ ఏమీ పాలుపోని స్థితి.
“అమ్మా, నాన్నా కడుపులో లాగుతోంది, గొంతుపొడిగా ఉంది, నేను అరగంటనుంచీ అరుస్తున్నా ఏం చెయ్యరేం!” అంటున్నాడు నాని. వాడు నిలబడలేక కూర్చున్నాడు.
“అమ్మో నాని కూలబడిపోతున్నాడు, వీడికి కేన్సరే, అయ్యో దేవుడా” అని బిగ్గరగా ఏడుస్తూ నెత్తి కొట్టుకుంటున్నాడు నాని వాళ్ల నాన్న, అది విన్న వాళ్ళమ్మ చేతిలో కషాయం నేలజారిపోయింది.
ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్న నాని కాళ్ల దగ్గరకూర్చుని ఏడుస్తున్నారు, ఇంతలో పక్కింటి పరశురామ్ వచ్చి విషయం తెలుసుకుని, బాధపడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.
“తీసుకెళ్లి మాత్రం ఏం చేస్తాం, క్యాన్సర్ ట్రీట్మెంటు అంతా స్కామే, మా బిడ్డ మాకెలా దక్కుతాడు” అని అడిగాడు నాని వాళ్ళనాన్న.
“పోనీలే, కనీసం ఎన్నాళ్లు బ్రతుకుతాడో చెప్తాడ���కదా” అనొక ఇంకొక ఉచిత సలహా పడేశాడు పక్కింటి పరశురామ్.
డాక్టర్ క్లినిక్ వెయిటింగు హాల్లో , కన్నీళ్ళు కలగలిసిన దుఖాన్ని చున్నీ చాటున నాని వాళ్లమ్మ దాయటానికీ ప్రయత్నిస్తుంటే వాళ్ల నాన్న మాత్రం వెయిటింగ్ హాలంతా తిరిగి టైల్సు అరగదీస్తున్నాడు.
“అమ్మా కడుపులో లాగటం ఎక్కువైంది,”అంటూ గొంతుమీద ఒక చెయ్యి, పొట్టమీద ఒక చెయ్యి వేసుకుని పక్కనున్న అమ్మ ఒళ్లో పడుకున్నాడు నాని. వాళ్లమ్మానాన్న నిస్సహాయమైన చూపులు చూస్తున్నారు.
డాక్టరు లోపలికి పిలిచారు. “చూడండి మీరెన్నో నాతో చెప్పాలనుకుంటారు, కానీ నేను ముందు పిల్లాడితోనే మాట్లాడతాను” అని కరాఖండిగా చెప్పేశాడు.
వాళ్లిద్దరి సంభాషణ,
ఏమిటి విషయం?
కడుపులో లాగుతోంది, గొంతులో పొడిగా ఉంది.
ఇంకా?
ఇంకేంలేవు.
జ్వరం?
లేదు.
వాంతులు?
లేవు.
విరేచనాలు?
లేవు.
నొప్పి?
లాగుతోంది అంతే నొప్పి లేదు.
దగ్గు?
లేదు.
ఇవన్నీ ఎప్పట్నుంచి?
క్రికెట్ అయిపోయిన దగ్గర్నుంచి.
ఆ అను.
ఆ
ఇక్కడ కడుపులో నొక్కితే ��ొప్పి ఉందా ?
లేదు.
మా ఆవిడ ఈవెనింగ్ స్నాక్ పకోడి పెట్టింది తింటావా! అని బాక్స్ తెరిచాడు డాక్టర్.
నాని మొత్తం పకోడీ తినేశాడు, కారం వలన అడక్కుండానే డాక్టర్ సీసాలోని నీళ్లు తాగేశాడు. నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
“ఇంకా ఎన్నాళ్లు డాక్టర్?” అని అడగలేని ప్రశ్న అడిగేశాడు నాని వాళ్ళ నాన్న.
“మీ దగ్గరేఉంటే ఎన్నో రోజులు పట్టదు”
“అదేంటి డాక్టర్!?”
“మీరు ఎప్పుడూ పిల్లాడు అడక్కముందే అన్నీ ���స్తుంటారు కదా!”
“అవును” ఇద్దరూ ముక్తకంఠంతో,
“అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్సు!”
“అన్ని హెల్తు అప్డేట్లు తప్పకుండా చూస్తాం”.
“వైద్యం నానీకి కాదు, మీకు చెయ్యాలి!”
“అదేంటి డాక్టర్!?”
“వాడేదో ఆడి అలసిపోయి ఆకలేసి, దాహంవేసి ఇంటికొచ్చాడు. వాడ్ని ఇన్నాళ్లూ ఆకలి దాహం తెలీకుండా పెంచారు. మీ ఇద్దరూ ముందు ఇన్స్టాగ్రాం అకౌంట్లు తీసేసి, వీడ్ని వాళ్ల నాన్నమ్మ తాతయ్య దగ్గరికి కొన్నాళ్లు పంపండి.”