నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి
• తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత
• లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు
• రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో
• కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మాణం పూర్తి
• నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా
• ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
*పనుల పురోగతి వివరాలు*
ఈ సమీక్షలో పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించగా, 182 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో రూ.1,400 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రెండు పథకాల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో గత ఏడాది డిసెంబర్లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టాం. రెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల నిర్మాణంలో కీలకమైన ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో పని చేయాలి.
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో నిరంతర పర్యవేక్షణ
కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యి నత్తనడకన నడుస్తున్న పనులపై దృష్టి సారించాలి. ముఖ్యంగా పైపు లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్ లో ఉంటే ఆ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్ అండ్ బి, జాతీయ రహదారి అథారిటీ, పంచాయతీరాజ్ శాఖలు, అవసరం ఉన్న చోట అటవీశాఖలతో సమన్వయం చేసుకుంటూ, పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలి. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతా. నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామ”న్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ్ ప్రకాష్ @shivprakashbjp గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ @MadhavBJP గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ @BJPMadhukarAP గారు పాల్గొన్నారు.
Then :
Highlighting the Degree College's issues during #Janavaani, #VarahiVijayaYatra - students studying under trees!
Now :
Sanctioning 12.6 crores funds for Degree College building..
#PawanKalyanAneNenu
#PawanKalyanAneNenu
There are orthodox leaders who make election promises and forget them overnight once they come to power..
And then there is #PawanKalyan garu, who became the voice for countless public issues through #JanaVaani & is now turning those assurances into action through his Governance.
The sanction of funds for the Eluru Degree College is yet another example of #PawanKalyan garu's commitment to resolving issues!
Sheikh Rinaz from Kavali has finally received his first pension after a 13-year delay. 🙏
Big Boss fame @adireddyfantasy thanked Andhra Pradesh Deputy CM @PawanKalyan garu for making it possible. 👏
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన అధ్యాయం.
"ఎర్రబస్సే రాని చోటుకి ఎయిర్ బస్సా" అంటూ ఉత్తరాంధ్రను అవమానించిన వారికి సమాధానం.
#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ @S_UdayaBhanu03 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ బలోపేతానికి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం దోహదపడుతుందని ఆకాంక్షిస్తూ, విజయవాడ కనకదుర్గమ్మఆశీస్సులతో శ్రీ సామినేని ఉదయభాను గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటారని ఆకాంక్షిస్తున్నాను - @PawanKalyan
After 13 years of delay, Sheikh Rinaz from Kavali received his first pension, made possible by the initiative of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan.
న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ సమర్థంగా ముందుకు సాగదు
- మన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా… దూషించినా తక్షణమే ఫిర్యాదులు చేయాలి
- కఠిన చర్యలు తీసుకోనేలా చట్ట ప్రకారం ముందుకు వెళ్దాం
•చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో న్యాయవాదుల సేవలు అమూల్యం
•పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు అండగా ఉందాము
•వారిపై గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుతో అన్యాయంగా నమోదైన కేసులను పరిష్కరించేలా సమగ్ర కార్యాచరణ చేపడదాము
•జిల్లాలవారీగా కార్యకర్తల కేసుల పూర్తి వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపించండి
• వారికి న్యాయ సహాయం అందించే ప్రత్యేక ఏర్పాటు
•జనసేన న్యాయవాదుల సమీక్ష సమావేశంలో మాట్లాడిన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు
న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థంగా ముందుకు సాగలేదని జనసేన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణలోనైనా, ప్రజా సమస్యల పరిష్కారంలోనైనా, ఎన్నికల ప్రక్రియలోనైనా లేదా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే సందర్భంలోనైనా న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఏ సమస్య ఎదురైనా, చట్టపరమైన సలహా, సరైన మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది న్యాయవాదులేనని అన్నారు. జనసేన పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల హైకోర్టు న్యాయవాదుల సమీక్ష సమావేశం మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర, కొత్త న్యాయవాదులను లీగల్ సెల్ లోకి ఆహ్వానించడం, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకునేలా చొరవ తీసుకోవడం, జనవాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ హరిప్రసాద్ గారు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పార్టీ కోసం నిరంతరం సేవలందిస్తూ, పార్టీ పిలుపు మేరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల కారణంగా వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై అధ్యక్షులవారు కూడా రెండుసార్లు ప్రత్యేకంగా సమావేశమై, ఏ కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారం ఎలా సాధ్యమవుతుందనే విషయంపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కేసుల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపుతో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం వాటి స్టేటస్, ఏ కోర్టులో విచారణ జరుగుతోంది, ఏ సహాయం అవసరమనే అంశాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి కేంద్ర కార్యాలయానికి అందించగలిగితే కార్యకర్తలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయడమే కాకుండా, పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు మనం నిజమైన అండగా నిలిచినవారమవుతాం.
కాకినాడలో మన అధ్యక్షుల వారిని దూషించిన ఘటనకు నిరసనగా రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేసిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలపై కేసులు నమోదయ్యాయి. వారు ఇప్పటికీ ఆ కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే విశాఖ నోవాటెల్ జరిగిన ఘటన, సంఘటన స్థలంలో లేకపోయినా అనుమానాల ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసి 18 మందిని సెంట్రల్ జైలులో పెట్టారు. ఇలాంటి కేసుల వల్ల అనేక మంది కార్యకర్తలు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తూ సమయం, మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే ఈ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చట్టపరంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ స్థాయిలో సమన్వయం అవసరం అనే అంశాలపై మీ విలువైన సూచనలు, సలహాలు అందించాలి. అదే విధంగా, మీ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయి, వాటిలో ప్రస్తుతం ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటి ప్రస్తుత స్థితి ఏమిటి అనే పూర్తి వివరాలను సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించండి.
ప్రతి నామినేషన్ చెల్లుబాటు అయ్యేలా చూడాలి.
తక్కువ ధరకే బియ్యం విక్రయాలకు శ్రీకారం
• విజయవాడలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
• రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ ₹52, రా రైస్ కేజీ ₹50కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
• ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో వ్యక్తికి 10 కేజీల చొప్పున బియ్యం విక్రయించనున్నారు.
• భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులను కూడా తక్కువ ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
• సామాన్య ప్రజలకు ఊరట కలిగించే ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోరారు.
మహా న్యూస్ ఛైర్మన్ అండ్ ఎం.డి. శ్రీ మారెళ్ల వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా పక్షం వహిస్తూ జాతీయ భావనలు పెంపొందిస్తూ మీడియాలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
- @PawanKalyan