, @pawankalyan గారితో ఉన్న వాళ్లకు విలువ పెరుగుతది, పవర్ వస్తది, పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీపరుడు నాన్ కరప్టెడ్ , బలమైన సంకల్పం, ఆశయం ఉన్నవాడు ఒక వైపు సినిమాలు,మరోవైపు రాజకీయాలతో తీరిక సమయం లేని వ్యక్తి!
@JanaSenaParty
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవిద్దాం. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.
వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి, ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలను, ఆయన నిబద్ధతను గుర్తిద్దాం. 🙏❤️
Always with you, @PawanKalyan garu! ❤️
As a Deputy Chief Minister, your leadership, dedication, and commitment to public service continue to inspire me. I deeply admire your leadership, Sir. 🙏
❤️ It's such a relief and absolute joy to see her recover and head home after surviving a brutal attack by an 8-year-old schoolmate with a brick in a locked classroom!
Horrific attack at Anantapur School: 21-year-old enters classroom with power chainsaw, one girl killed another Injured. the attack took place inside the classroom while a teacher was present and lessons were underway. Police launch a hunt to nab the accused. #AndhraPradesh
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన
•బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
•నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
@AndhraPradeshCM@APPOLICE100@PIB_India@IPR_AP@pibvijayawada
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ @DrMohanYadav51 గారు భేటీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోహన్ యాదవ్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్ధి సంబంధితమైన పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రధానంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసే అంశాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గౌర్ (అడవి దున్నలు) పునఃప్రవేశానికి సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. త్వరలో మధ్యప్రదేశ్లో పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
* ఉప్పాడ పట్టు శాలువా, కొండపల్లి కళాకృతి బహూకరణ
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం కొండపల్లి కళాకృతిని, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ కళాకారులు రూపొందించిన శ్రీ దుర్గాదేవి చిత్రపటాన్ని, అరకు కాఫీని బహూకరించారు.
శ్రీ మోహన్ యాదవ్ గారు శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.