మనకొచ్చింది స్వాతంత్ర్యం,
కష్టపడి పనిచేసేవాళ్ళకి ఆవకాశాలివ్వక దేశం నుంచి తరిమి కొట్టడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని పెల్లెట్ బుల్లెట్లతో కాల్చడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అయ్యేయస్సు ప్రొబేషన్లోనే అవినీతి చెయ్యడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వెలితి లేకుండా అన్నిటినీ కల్తీ చేసి తినేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజాస్వామ్యం అంటూనే పిల్లల పరంపరకి అధికారాన్ని ఇచ్చుకునేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దూకుడుగా వచ్చి పడిపోయిన లారీని దొమ్మీచేసి దోచుకెళ్లడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
చట్టాన్ని చట్రంలో బంధించి చుట్టాలకి వాడుకోవడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
శాస్త్రీయ దృక్పథాన్ని శవంలా పాడెక్కించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దేశాన్ని పాలిస్తూ, పిల్లలకి విదేశీ పాలు తాగేందుకు పంపించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మానసిక రుగ్మతలను అమానవీయం అని ముద్రవేసి వార్తలు ముద్రించటానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వివేకాన్ని వదిలి వ్యక్తి పూజ చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజలందర్నీ మత్తులో ముంచి, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సూక్ష్మ పరిశీలనని చిదిమేసి సూత్రాల్ని బట్టీకొట్టే చదువు నేర్పేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సాధ్యాసాధ్యాలను వదిలేసి సాధ్యమైనంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
పెచ్చులూడిన రహదారులపైన పెక్కు జనాభాని ప్రమాదాల్లో చంపేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అభిమానాన్ని సొమ్ముచేసుకుని అణాకానీ వినోదాన్ని విసిరేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఆటస్థలాలన్నీ కబ్జా చేసి కాంక్రీటు కోటల్ని కట్టేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
న్యాయస్థానాలన్నీ నత్తనడకగా నడిచి న్యాయం మరిచేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఈజ్ ఆఫ్ బిజినెస్ వదిలి, ఈసురోమని ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
భారీ తప్పిదాలకి కూడా బాధ్యత తీసుకోకుండా బాదరబందీ లేకుండా బ్రతికేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అస్థికలు, సగం కాలిన శవాలు, కర్మాగారాల వ్యర్థాలు అన్నీ మననదుల్లో వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఇది పక్కోడు పీల్చే గాలిలే అని పొగ అంతా వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మనకొచ్చింది స్వాతంత్ర్యం.
- డా శ్రీకాంత్ మిర్యాల
@arunkalyan5 Nothing wrong..17pro ki apple care 21000 kattali..vadu display or back glass thapa edi repair cheyadu..so ila pagalkottedi 8900 pay cheste kotha phone istadu
Dear @JPNadda@DrJitendraSingh ji,
We are observing a complete breach of the agreement regarding no police action against the protestors. Hundreds of students have been arrested in Bihar and Bengal, and hundreds are being surveilled/harrassed in Delhi and other states. Multiple reports are emerging in Delhi around detention of volunteers supporting protestors with logistics.
We demand that all the FIRs against the protestors be immediately withdrawn, students be released and no future FIRs be filed (in line with our agreement) by Delhi police / Central investigative agencies / Police in BJP-allied states, FAILING WHICH WE WILL BE FORCED TO SIT ON PROTEST AGAIN.
We also demand that the written agreement around legal cases be shared with us by tomorrow, the aligned timelines with the Government of India.