ఎన్నికల ప్రచారంలో 'ఇందిరమ్మ రాజ్యం తెస్తాం' అంటే జనం సంక్షేమం అనుకున్నారు. కానీ ఆనాడు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో కుక్కినట్లే... ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి కూడా అదే నియంతృత్వాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత కేసులు పెట్టడమే కాదు, అక్రమంగా అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు!
#CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద శాంతియుత నిరసనకు సిద్ధమైన జనసేన నాయకులను, జనసైనికులను, వీరమహీళలను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు.
వందలాదిమంది జనసేన నాయకులను, వీరమహిళలను, జనసైనికులను పోలీస్ వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్ నగరమంతా తిప్పుతున్న పోలీసులు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…ప్రశ్నించే గొంతును అణచివేయడమే సమాధానమా? రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ రెండు పార్టీలు బ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..!!
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
దశాబ్దాలుగా ఎ.కొండూరు ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం.
తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక, ప్రమాదమని తెలిసినా దాహార్తిని తీర్చుకోడానికి తప్పక కలుషిత నీటితోనే దశాబ్దాలుగా గొంతు తడుపుకునేవారు ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండల ప్రజలు. తద్వారా తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారిన పడేవారు.
వీరి తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జెజెఎం - అమరజీవి జలధార ద్వారా 15 గిరిజన తండాలతో కలిపి మొత్తం 21 గ్రామ పంచాయతీల ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించే లక్ష్యంతో, రూ.49.94 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసి ఎ. కొండూరు ప్రజల తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanMarkGovernance
Under the HANUMAN initiative, the AP Forest Department successfully carried out a Sloth Bear rescue operation at Parimithadaka, Yeleswaram Mandal, Kakinada District.
The timely intervention of the Forest Department team ensured the safe rescue and protection of the animal, reflecting our continued commitment to wildlife protection and human-wildlife coexistence.
#HANUMAN #APForestDepartment #WildlifeRescue #SlothBear #WildlifeConservation
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జేజేఎం - అమరజీవి జలధారలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక శ్రద్ధతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
• కీలకమైన ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్లో పురోగతి
• 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
• శరవేగంగా సాగుతున్న రూ. 2,370 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు
• 18 మండలాలు, 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం
• దాదాపు 25 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత
అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన తాగు నీటి ప్రాజెక్టుల పనులు వారాంతపు లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఏడాది చివరినాటికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని, ఎప్పటికప్పుడు పూర్తికావాల్సిన పనులపై సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేసి, గడువులోపు ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ. 2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్‌లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలి. ప్రతి గొంతు దాహార్తి తీరాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ సంకల్పాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధారలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 2024తో ముగిసిన జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దాదాపు రూ. 26,000 కోట్ల విలువ చేసే తాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో మొదటి విడతగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో చిత్తూరు కూడా ఒకటి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగిస్తూ అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించనున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి సంబంధించి గండికోట వద్ద నిర్మాణం చేపట్టిన ఒక ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నాలుగు రా వాటర్ సంపులు నిర్మించాల్సి ఉండగా, అందులో మూడు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఒక నీటి శుద్ధి కేంద్రం, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర 167 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
•ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
•తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే
•అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం
•తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు
•అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు
•డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా డిజైన్, డీపీఆర్ పై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. నిర్ణీత గడువు లోపు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా పర్యావరణ, తదితర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయి తాగు నీటి భద్రత దిశగా శ్రీ @PawanKalyan గారు అడుగులు
• తాగు నీటి వ్యవస్థల బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగంపై దృష్టి
• రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ పనులు
• లక్షలాది మందికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు
• ఇప్పటికే రూ. 26,000 కోట్లతో జేజేఎం-అమరజీవి జలధారల పనులు
• గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ తాగు నీటి పథకాలు
• రంగు మారిన నీరు, నాణ్యతలేని నీటి సరఫరాతో ఇబ్బందులుపడిన ప్రజలకు ఉపశమనం
• సమస్య తీవ్రత, స్థానిక అవసరాల ఆధారంగా పనులకు ప్రాధాన్యత
• ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో వేగవంతంగా అమలవుతున్న పునరుద్ధరణ చర్యలు
• గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్తృత స్థాయి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ తాగునీటి పథకాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 35 కోట్ల నిధులు కేటాయించి, దాదాపు 370 గ్రామాల పరిధిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లు పునరుద్ధరించారు. తద్వారా సుమారు 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీటి సరఫరా చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ, సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
•గ్రామీణ తాగునీటి వ్యవస్థ బలోపేతం దిశగా ఎన్నో కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల ద్వారా దాదాపు రూ. 26,000 కోట్ల విలువైన పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల ద్వారా వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. మరో పది మల్టీవిలేజ్ స్కీం పథకాలకు రూ. 9,355 కోట్లు మంజూరు చేశారు. అత్యంత తీవ్ర నీటి ఎద్దడి కలిగిన 3 వేల గ్రామాలను గుర్తించి, రూ. 1,814 కోట్లతో సింగిల్ విలేజ్ వాటర్ స్కీంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటితోపాటు గత ప్రభుత్వం అరకొర పనులు చేసి వదిలివెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం తదితర తాగునీటి పథకాల పనులు పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో 7,439 గ్రామీణ తాగునీటి పనుల క్రమబద్దీకరణ, విస్తరణ నిమిత్తం రూ. 4,054 కోట్ల కేటాయింపులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు చేరాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్ల సమస్యలు ఉన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో గ్రామీణ తాగునీటి పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఫిల్టర్ బెడ్లు దెబ్బతిని, నీటి నాణ్యత తగ్గిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో రంగు మారిన నీరు సరఫరా కావడం, శుద్ధి వ్యవస్థలు సక్రమంగా పని చేయకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపాయి. గ్రామాల్లో సైతం ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు డబ్బు వెచ్చించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల సమగ్ర పరిశీలనకు ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రత, స్థానిక అవసరాలు మరియు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలనుసారం ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బతిని, రంగు మారిన నీరు సరఫరా అవుతున్న గ్రామాలను గుర్తించి ఈ పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టారు. నీటి శుద్ధి వ్యవస్థలో ఫిల్టర్ బెడ్లు అత్యంత కీలకమైన భాగం. నీటిలో సూక్ష్మ మలినాల తొలగింపునకు ఉపయోగపడతాయి. నాణ్యమైన తాగునీటి సరఫరాకు ఫిల్టర్ బెడ్ల సమర్థ నిర్వహణ అవసరమన్న అంశాన్ని గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు. 1/2
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాస కానుక
10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు
* నాణ్యతపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి
అభివృద్ధి పనుల వేగంతో పాటు వాటి నాణ్యతపై కూడా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, ప్రతి పని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. పనులను సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం, నాణ్యత రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, రాష్ట్రంలో అమలుకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారికి, సహాయ మంత్రి శ్రీ @PemmasaniOnX గారికి కృతజ్ఞతలు తెలిపారు.
సాగు నీరు, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత ఈ చెరువుల ఆధునీకరణ కార్యక్రమంలో ప్రతిబింబిస్తోంది.
సాగు నీటి సంరక్షణ… పర్యావరణ పరిరక్షణ… అహ్లాదకర వాతావరణం
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ
* ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం
* భూగర్భ జలాల పెంపు.. సమగ్ర అభివృద్ధే ధ్యేయం
* ఆధునిక హంగులతో ఆహ్లాదకర కేంద్రాలుగా చెరువులు
* వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో కొత్త రూపు
* సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం
సాగు నీటి వనరుల సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వరకు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధిపై లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవకు ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ పథకం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి కొత్త ఊపు వచ్చింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతతో చెరువులకు కొత్త జీవం పోయడమే కాకుండా, వాటిని మరింత సమర్థవంతమైన సాగునీటి వనరులుగా తీర్చిదిద్దే దిశగా విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, సాగునీటి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన జీవన వాతావరణాన్ని అందించాలన్న సమగ్ర లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి.
• 105 చెరువులు... రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పనులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం మొత్తం రూ.50 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 26 చెరువులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే చెరువుల అభివృద్ధి పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా పనులను చేపడుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు సాగు నీటి వనరులు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే భూగర్భ జలాల వృద్ధికి తోడ్పడనున్నాయి.
• చెరువులకు కొత్త రూపు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు
చెరువుల ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా చెరువు గట్ల బలోపేతం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, ప్రవేశ ద్వారాల నిర్మాణం, సోలార్ లైట్ల ఏర్పాటు, సిట్టింగ్ బెంచ్‌ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ ఎయిర్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు చెరువుల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ, వాటిని ప్రజల విశ్రాంతి, ఆరోగ్యం, వినోదానికి అనువైన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం పరిధిలోని వెదుళ్ల చెరువు, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పండూరు చెరువు, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు, అనంతపురం జిల్లాలో గుడిశెలపల్లి చెరువు, నెల్లూరు జిల్లాలోని వింజమూరు, శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం తదితర చెరువులు పూర్తి స్థాయి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
• సాగు నీటితోపాటు భూగర్భ జలాలకు బలం
ఈ పనుల ద్వారా చెరువులు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ ప్రయోజన కేంద్రాలుగా రూపుదిద్దుకోనున్నాయి. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల సాగునీటి వనరులు బలోపేతం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులకు సాగునీటి పరంగా ప్రయోజనం చేకూరడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు అందనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడనుంది.
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
A New Milestone in Bharat’s Space Journey
From Earth to the stars, Bharat continues to push the boundaries of what is possible.
The successful GSLV-F17 mission, placing EOS-05 into its intended Sub-Geosynchronous Transfer Orbit, marks another remarkable achievement for ISRO. EOS-05 is India’s first-ever imaging satellite from a geosynchronous orbit, strengthening our Earth observation capabilities.
Heartiest congratulations to the brilliant ISRO scientists, engineers, technicians and everyone involved in this historic mission.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, Bharat’s space programme continues to reach new heights, inspiring our youth and strengthening our position among the world’s leading spacefaring nations.
Another launch. Another milestone. Another proud moment for Bharat.
Jai Hind!
- @PawanKalyan
కూటమి ధర్మం పాటిస్తూనే.. జనసేన గౌరవానికి అగ్ర తాంబూలం
•స్థానిక సమరంలో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం
•నిస్వార్థం జనసేన సైనికుల అసలైన నైజం
•సేవ చేయడంలో పార్టీల రంగులు చూడొద్దని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చెప్పారు
•శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యావరణ ఆశయాలకు అండగా నిలవడం నా అదృష్టం
•బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి త్యాగాలు చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి సముచితమైన ప్రాతినిధ్యం దక్కేలా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ కోసం కార్యకర్తలు చేసిన సేవలు, వారి త్యాగాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్రాంతంలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తోందన్నారు. గురువారం బాపట్ల నియోజకవర్గం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ... “పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా, స్థానిక సంస్థల్లో జనసేన ప్రాతినిధ్యం మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయాలు ఉంటాయి. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ గౌరవం, కార్యకర్తల ఆకాంక్షలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాం.
*కార్యకర్తల శ్రమే జనసేన బలం*
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తను నాయకత్వం ఎప్పుడూ దగ్గరకు తీసుకోవాలని, వారి మాటలను వినాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా చెబుతుంటారు. ఈ రోజు చట్టసభల్లో జనసేన గొంతు బలంగా వినిపిస్తోందంటే అందుకు ప్రధాన కారణం జనసైనికులు చేసిన నిరంతర పోరాటం, వారి శ్రమే కారణం. జనసైనికులంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమ, అభిమానమనే విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా, జనసైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా ప్రేమిస్తారో కూడా ఆయనకు తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజలకు మెరుగైన భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. కార్యకర్తల నమ్మకం, ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని మరింత మెరుగైన దిశగా తీసుకెళ్లేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.
*ఆయన కల కోసం నిలబడే అవకాశం దక్కింది*
పర్యావరణ పరిరక్షణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు కన్న కలను సాకారం చేసే దిశగా పనిచేసే అవకాశం తనకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా లభించింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి ఎంతో కొంత నా వంతుగా నిలబడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. బాపట్లతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తన తండ్రి ఉద్యోగరీత్యా మూడేళ్లకుపైగా బాపట్లలో ఉన్నారు. బాపట్లలోనే చదువుకున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే జన్మించారు. జనసేన కార్యకర్తల్లో ప్రత్యేకమైన ఆవేశం, నిస్వార్థం ఉంటాయి. వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయరు. ప్రతి కార్యకర్త శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా, ఆయన ఆశయాలు, ఆదేశాలను నమ్మకంతో పాటిస్తూ ముందుకు సాగడమే జనసేన కార్యకర్తల ప్రత్యేకత.
*సేవ చేయడంలో తేడా ఉండదు*
మన ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, పార్టీ కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి తేడా ఉండకూడదనే భావనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. పులివెందుల వంటి ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా బలం లేకపోయినా అక్కడి ప్రజలు ఏ పార్టీకి చెందిన వారైనా, రాజకీయంగా ఎవరిని అభిమానించినా, సేవ అందించే విషయంలో మాత్రం పార్టీలు, రాజకీయ భేదాలు చూడకూడదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశ్వసిస్తారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరినీ సమానంగా చూడటం, అందరికీ అందుబాటులో ఉండటమే ఆయన రాజకీయ విధానం” అన్నారు.
ఎ.కొండూరు కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో ఎ.కొండూరు జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధారల తాగునీటి ప్రాజెక్టు కేవలం 26 నెలల్లోనే రూ.49.94 కోట్లతో 100% పూర్తయింది.
38 ఆవాసాలకు 130 కి.మీ. పైప్‌లైన్, 12 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా దాదాపు 75,000 మందికి రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షిత తాగునీరు అందుతోంది.
ఉద్ధానం తరహా కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇది కీలక ముందడుగు.
సురక్షిత నీరు • మెరుగైన ఆరోగ్యం • కొత్త ఆశలు
కొండూరు కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిన శ్రీ @PawanKalyan గారు
* ఎ.కొండూరుకు జేజేఎం–అమరజీవి జలధారలు
* ఉద్ధానం తరహా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
* గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రాజెక్టుకు ప్రాణం పోసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* 26 నెలల కాలంలో రూ. 49.94 కోట్ల పనులు పూర్తి
* 38 ఆవాసాల పరిధిలో 130 కిలోమీటర్ల పైప్‌లైన్
* ఇంటింటికీ కుళాయిలతో దాదాపు 75,000 మందికి స్వచ్ఛమైన తాగునీరు
మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారినపడిన ప్రజలతో మరో ఉద్దానాన్ని తలపించే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండలం. ఈ మండల పరిధిలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు, 38 ఆవాసాలు ఉండగా, దాదాపు అన్ని గ్రామాలు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో గిరిజనులు మాత్రమే నివసించే 15 తండాలున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క, ప్రమాదమని తెలిసినా కలుషిత జలాలతో గొంతు తడుపుకునే పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సమస్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎ.కొండూరుకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధి బారి నుంచి కాపాడాలని సంకల్పించారు. అధికారం చేపట్టిన 26 నెలల్లోనే తన పరిధిలోని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ద్వారా జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల నిధులతో ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశారు. రూ. 49.94 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 100 శాతం పనులు పూర్తి చేసుకుని ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలను తీర్చింది.
- గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టలేదు
ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వం ఆర్భాటం చేసి, కనీసం టెండర్ ప్రక్రియను కూడా మొదలుపెట్టలేదు. ఒక్క పనీ ప్రారంభించలేదు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ప్రాజెక్టు కావడం, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2024 మార్చి నాటికి గడువు కూడా ముగియడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను ముందుకు తీసుకెళ్లారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను మరో నాలుగేళ్లు పొడిగించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా తక్షణమే విడుదల చేసి, పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లింది. కిడ్నీ వ్యాధితో ప్రజలు పడుతున్న అవస్థలను చూసి చలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయించారు. ఇబ్రహింపట్నం ఎన్టీపీసీ కాలువ నుంచి కృష్ణా జలాలను స్వీకరించి, అక్కడే శుద్ధి చేసి, 130 కిలోమీటర్ల పైప్‌లైన్, 12 ఓవర్‌హెడ్ ట్యాంకుల సహకారంతో దాదాపు 75,000 మందికి ఒక్కొక్కరికి రోజుకు 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, రైల్వే శాఖలతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పైప్‌లైన్ నిర్మాణానికి అత్యంత త్వరితగతిన అనుమతులు లభించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు.
గతంలో ఎ.కొండూరు మండల పరిధిలోని ప్రజలకు ట్యాంకర్ల సాయంతో తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ. 2.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. నేడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల రూపంలో తాగునీటి సమస్యకు, తద్వారా కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభించినట్టయింది. త్వరలో ఎ.కొండూరు ప్రాంతంలో పర్యటించి తాగునీటి పథకం పనుల నాణ్యతను ఉప ముఖ్యమంత్రివర్యులు పరిశీలించనున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేయాలని ఇప్పటికే కార్యాలయ అధికారులకు నిర్దేశం చేశారు.
శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పరామర్శ
• పార్టీ తరఫున రూ 5 లక్షల ఆర్థిక సహాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బెండమూర్లంక గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బుధవారం సాయంత్రం పరామర్శించారు.
ముందుగా శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం ఆ జన సైనికుడు చేసిన సేవలను స్మరించుకుంటూ, తన జేబుపై ధరించిన పార్టీ బ్యాడ్జ్‌ను గౌరవ సూచకంగా తీసి ప్రేమ్ కుమార్ చిత్రపటం ముందు ఉంచి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అనంతరం ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. శ్రీ ప్రేమ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మాటలతో తీర్చడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చింతిస్తున్నారు అని తెలిపారు.
•పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున మృతుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని పార్టీ తన సొంత కుటుంబంగానే భావిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలాంటి వారని, వారి కష్టసుఖాల్లో వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవడం జనసేన పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.