ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#AndhraPradeshFormationDay
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులు, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు.
• ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.
• ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలి.
• వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
• తుపాను నష్టాలను త్వరగా అంచనా వేసి బాధితులకు పరిహారం అందించాలి.
• దీపావళి అనంతరం మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తాను.
తుపాను సమయంలో సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
#ArnabCyclone #AndhraPradesh
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass#VoteForNDA#APLocalBodyElections
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం!
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం.
#VoteForGlass
#APLocalBodyElections
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
#HappyDussehra
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, యువత, డిజిటల్ మీడియా ప్రతినిధులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
.@RusthumHere erripuk gadu kalyan ee 2 yrs 4 months 5 days lo as dcm & panchayati raj rural development minister ga chesina works gurinchi asal tweets eh veyyaledhu ippudu vacchi nen sainik ni kadhu neutral ga unta opinions cheptha even political ga anta noice ra kojja👏🏻👏🏻