తిరుమల శ్రీవారి చెంత 'చెన్నై లవ్ స్టోరీ' టీమ్
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరి ప్రియ, ప్రొడ్యూసర్ SKN, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ & లిరిసిస్ట్ అనంత శ్రీరామ్. నూతన చిత్రం సక్సెస్ కావాలని మొక్కులు
ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసే నీచమైన వ్యక్తి చెవిరెడ్డి...
అలాంటి చెవిరెడ్డి, కుటుంబం లాంటి కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు..
నువ్వు ఎన్ని చిచ్చులు పెట్టాలని చూసిన 2029లో మళ్ళీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నిన్ను పులివర్తి నాని గారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడించటం పక్కా..
#AdminPost #PulivarthiNani #ChandragiriMLA #ChandragiriConstituency #TeluguDesamParty #fakechevireddy #tirupatidistrict
ప్రాణాలను నిలిపే ప్రేమాంజలికి పాతికేళ్లు
హైదరాబాద్ గుండెకాయ లాంటి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 గుండా వెళ్తుంటే.. ఆకుపచ్చని చెట్ల నీడన ప్రశాంతంగా కనిపించే ఒక భవనం కనిపిస్తుంది. అదే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధనా సంస్థ (BIACH&RI).
కానీ, ఒక సాధారణ పౌరుడిగా ఆ ప్రాంగణంలోకి అడుగుపెడితే.. అది కేవలం కాంక్రీటు గోడల ఆసుపత్రిగా అనిపించదు. అదొక నమ్మకం, ఒక తపన, ఒక భర్త తన భార్య స్మృతికి అర్పించిన నిలువెత్తు ప్రేమాంజలి.
ఆశల దీపం
"క్యాన్సర్" — ఈ ఆరు అక్షరాల పదం వినబడితేనే సామాన్యుడి గుండె ఝల్లుమంటుంది. ప్రాణం పోతుందనే భయం ఒకవైపు, ఉన్నదంతా అమ్ముకున్నా వైద్యం చేయించలేమనే ఆందోళన మరోవైపు మనుషులను కుంగదీస్తాయి. డబ్బున్నవాడు విదేశాలకు వెళ్లి ప్రాణాలు దక్కించుకుంటాడు, మరి పేదవాడి పరిస్థితి ఏంటి? విధిని తిట్టుకుంటూ రోదించాల్సిందేనా?
సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం, తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఇంట్లో ఇదే విషాదం చోటుచేసుకుంది. ఆయన ధర్మపత్ని శ్రీమతి నందమూరి బసవతారకం గారు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి కన్నుమూశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ఒకే ఒక దృఢసంకల్పం తీసుకున్నారు — "నా భార్యకు వచ్చిన గతి ఏ పేదవాడికీ రాకూడదు. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి."
ఆ సంకల్పం నుండి పుట్టిందే ఈ బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్. అమెరికాలోని ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ (IACO) సమన్వయంతో, ఎందరో దాతల సాయంతో రూపుదిద్దుకున్న ఈ అక్షయపాత్రను జూన్ 22, 2000న నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ప్రారంభించారు. నేటికి ఈ ప్రేమాంజలి విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవ వెలుగులు జిమ్ముతోంది.
వైద్యం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో, బసవతారకం సాధించిన మైలురాళ్లు కేవలం ఒక ఆసుపత్రి రిపోర్ట్ కార్డ్ కాదు.. నిరాశలో ఉన్న లక్షలాది కుటుంబాలకు అందించిన పునర్జన్మల పట్టిక. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ సంస్థ నిర్మించిన నమ్మకానికి ఈ గణాంకాలే సాక్ష్యం:
3,80,000 పైగా రిజిస్ట్రేషన్లు: దాదాపు నాలుగు లక్షల మంది బాధితులు నమ్మకంతో ఈ దేవాలయం వైపు అడుగులు వేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్యంతో పాటు గుండె నిబ్బరాన్ని కూడా ప్రసాదించింది ఈ సంస్థ.
1,25,000 కు పైగా సర్జరీలు: క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను అత్యంత నైపుణ్యంతో, అత్యాధునిక సాంకేతికతతో విజయవంతంగా పూర్తి చేసి, లక్షకు పైగా ప్రాణాలను మృత్యుముఖం నుండి రక్షించారు ఇక్కడి వైద్యులు.
27,000 పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు: మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న రొమ్ము క్యాన్సర్‌పై ఈ సంస్థ ప్రత్యేక పోరాటం చేస్తోంది. 27 వేల మందికి పైగా మహిళలకు చికిత్స అందించి, వారి ఇళ్లల్లో మళ్లీ ఆనందాన్ని నింపింది.
10,000 మందికి పైగా చిన్న పిల్లలకు చికిత్స: పసిప్రాయంలోనే క్యాన్సర్ బారిన పడి విలవిల్లాడుతున్న పది వేల మందికి పైగా చిన్నారులకు నూతన ఆయుష్షును అందించి, వారి భవిష్యత్తుకు భరోసానిచ్చింది.
ఆసుపత్రి విశేషాలు
ఒక లాభాపేక్ష లేని సేవా సంస్థగా ప్రారంభమైన బసవతారకం, నేడు భారతదేశంలోనే టాప్ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. దీని ప్రత్యేకతలు:
100 పడకలతో ప్రారంభమై, నేడు 500 పైగా పడకల అత్యాధునిక సదుపాయాలతో విస్తరించింది. పేదల కోసం జనరల్ వార్డుల నుండి మధ్యతరగతి, ధనికుల కొరకు ప్రత్యేక గదుల వరకు అందుబాటులో ఉన్నాయి.
9 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ సర్జరీ విధానాలు, టోమోథెరపీ, లీనియర్ యాక్సిలరేటర్లు వంటి ప్రపంచ స్థాయి చికిత్సలు ఇక్కడ లభిస్తాయి.
కేవలం అల్లోపతి వైద్యమే కాకుండా, క్యాన్సర్ రోగుల మానసిక ఉల్లాసానికి, త్వరగా కోలుకోవడానికి వీలుగా నేచురోపతి (ప్రకృతి వైద్యం), ఆయుర్వేద చికిత్సలను కూడా అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత.
ఎన్టీఆర్ గారు నాటిన ఆశల మొక్కను నేడు మహావృక్షంగా పెంచుతున్నారు ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈ సంస్థకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన కేవలం మేనేజ్మెంట్ రూమ్లకే పరిమితం కాలేదు.
రోగులను స్వయంగా పరామర్శిస్తూ, వైద్యులతో నిరంతరం చర్చిస్తూ, ఆసుపత్రికి అవసరమైన నిధులను అంతర్జాతీయంగా సేకరించడంలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయం. సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి, ఒక సేవకుడిగా ఆసుపత్రిని నడిపించడంలో ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు.
క్యాన్సర్ అనేది జీవితానికి ముగింపు కాదు, కేవలం ఒక మలుపు మాత్రమేనని బసవతారకం నిరూపిస్తోంది. 3 లక్షల పైగా నమ్మకాలు, లక్షకు పైగా విజయవంతమైన పోరాటాలు మనకు చెప్పేది ఒక్కటే — సరైన సమయంలో సరైన వైద్యం అందితే మహమ్మారిని జయించడం సాధ్యమే.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌తో భాగస్వామ్యం అవ్వడం కోడెల కుటుంబానికి ఒక అదృష్టం. మహానేత నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు బసవతారకం హాస్పిటల్ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు అందించిన సేవలు నిజంగా అభినందనీయం. ప్రజల ఆరోగ్య సేవలో ఆయన చూపిన అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నువ్వు 6 కోట్ల మంది ఆంధ్రులకు సియం , కోటి మంది కార్యకర్తలకు బాస్ వి కావచ్చు పెద్దయ్య @ncbn ..
ఇంటికి మాత్రం పెద్దమ్మనే బాస్ !!
కొని తీసుకురా అంటే 🤣😆 తీసుకుపోవాల్సిందే తప్పదు 🤣😆😂
#WeStandWithAnitha
వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్లు తప్ప గొడ్డలి పార్టీకి రాజకీయం తెలియదు..
ప్రజల మద్దతుతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో, టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి మంత్రి అనిత గారు ఎదిగారు. ఓ దళిత మహిళ ఎదుగుదలను గొడ్డలి పార్టీ తట్టుకోలేక, నడిరోడ్డుపై మహిళలను కించపరుస్తోంది..
#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
ఈరోజు ఎంతో విశిష్టమైన సోమవతి అమావాస్య సందర్భంగా, హైదరాబాద్ లోని మా ఇంట్లో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించుకున్నాం. వేదమంత్రాల మధ్య మేము మహాశివుడికి రుద్రాభిషేకం చేసి అందరినీ చల్లగా చూడమని ఆ శివుడిని కోరుకున్నాం.
#VisakhaUkkuAndhrulaHakku
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు...కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన మీరు అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్ళండి @ysjagan గారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు బాధితుల ఆవేదన అర్ధం చేసుకొని.. మరో 120 కోట్ల రూపాయల అదనపు పరిహారం చెల్లించేలా.. ఎల్జీ పాలిమర్స్ యాజమన్యాన్ని ఒప్పించారు.
ఈ 120 కోట్లలో బాధితులకు నేరుగా పరిహారం చెల్లించేందుకు 60 కోట్లు కేటాయించగా.. గ్యాస్ లీక్‌తో ప్రభావితమైన కాలనీల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు, రక్షిత తాగు నీటి సరఫరా, పర్యావరణాన్ని మెరుగు పరచడానికి మిగిలిన 60 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న వైసీపీ.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బాధితులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా.. ఫేక్ ప్రచారాలు చేస్తోంది.
#Chandrababunaidu #TDPTwitter
#Andhrapradesh
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాల సామాజిక, ఆర్థిక సాధికారతకు సమగ్ర భరోసా!
భూమిలేని కూలీలకు పింఛన్, రైతులకు రుణమాఫీ, గృహ భద్రత, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, స్థానిక ఉపాధి అవకాశాలతో రైతులు, రైతు కూలీల కుటుంబాల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తోంది.
రైతుల సంక్షేమం – అమరావతి అభివృద్ధి – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు.
#APCRDA #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #LandPoolingScheme #LPS #FarmerFirst #FarmerWelfare #InclusiveGrowth #SustainableDevelopment #APCRDAInitiatives