నైరుత్తమ్మ మాట...
జగనన్న హామీ..
డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ సమ్మె నిర్వహిస్తున్న సందర్భంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారు డాక్యుమెంట్ రైటర్లు నిర్వహిస్తున్న పెన్‌డౌన్ సమ్మెకు మద్దతిస్తూ మీకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని భరోసా
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం..
పోలీసులు మానవ మృగాల్లా వ్యవహరించి లాఠీలతో ఓ వ్యక్తి మర్మాంగాలపై కూడా చితక బాదారు. అది కూడా తన భార్య, పిల్లలు చూస్తుండగానే కొట్టడం, అడ్డుగా వచ్చిన పసిబాలుడుని కొట్టడంతో ఆ వ్యక్తి తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక, భార్య, బిడ్డల ముందు మర్మాం��ాలపై కొట్టడం అవమానంగా భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్రాపురం మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నాడని జనసేన సానుభూతి పరుడు, టీడీపీ ఎమ్మెల్యే నానికి అనుచరుడైన సంజీవ హరి అనే వ్యక్తి పోలీసులకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి వెనుక ఎమ్మెల్యే నాని ఉండటంతో పోలీసులు సుబ్రమ���్యం అనే వ్యక్తిని పట్టుకొచ్చి లాఠీలతో చితకబాదారు. ఎంత దారుణంగా కొట్టారంటే అతని మార్మాంగాలపై లాఠీలతో కొట్టి నరకం చూపించారు. ఒక రోజు గడిచిన తరువాత మరుసటి రోజున మళ్లీ పోలీసులు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పడంతో ముందు రోజు కొట్టిన లాఠీ దెబ్బలు గుర్తుకు వచ్చి మళ్లీ కొట్టి చంపేస్తారన్న భయంతో అతనికి అతనే తన ఇంటిలోపలకి వెళ్లి పంచతో ఉరివేసుకుని సుబ్రమణ్యం చనిపోయాడు. ఒక న్యూసెన్స్ కేసులో పోలీసులు ఇంత దారుణంగా కొట్టడం ఏమిటో ఎవ��వరికీ అర్థం కావడం లేదు. పోలీసులు కొట్టడం వల్లనే అతను చనిపోయినట్టు పత్రికలు, టీవీలల్లో ప్రసారం కావడంతో పోలీసు ఉన్నతాధికారుల్లో ఒకరైన అదనపు ఎస్పీ రంగంలోకి దిగారు. తన పోలీసులను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే నాని అండతో స్థానిక టీడీపీ నాయకుల ద్వారా మృతుని కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని బేరం పెట్టారు. పంచాయతీ చేసి రూ.3.50లక్షలు చెల్లించేలా ఒప్పించారు. ఆ డబ్బులు కూడా మరణానికి కారకుల��న పోలీసుల నుంచి కాకుండా సుబ్రమణ్యంపై ఫిర్యాదు చేసిన సంజీవ హరి నుంచి చెల్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఫిర్యాదు దారుడు అంత డబ్బు కట్టలేనని, పోలీసులు కొట్టినందుకు చనిపోతే తాను ఎందుకు డబ్బు కట్టాలని ప్రశ్నించడంతో నీ ఫిర్యాదు వల్లనే కదా అతనిని పోలీసులు తీసుకువెళ్లి కొట్టిందని గ్రామస్తులు భయపెట్టారు. చివరకు పోలీసుల దెబ్బలు పోస్టుమార్టంలో బయటకు వస్తాయని గ్రహించి పోస్టుమార్టం జరగకుండానే పోలీసులపై కేసు లేకుండా మృతుల కుటుంబీకులకు పరిహారం చెల్లించేలా రూ.3.50లక్షలకు ఫిర్యాదు దారుని చేత ప్రామిసరీ నోటులో సంతకాలు చేయించారు. ఈ మొత్తం వ్యవహరంలో అదనపు ఎస్పీ, ఎమ్మెల్యే నానిల పాత్ర ఉందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రామచంద్రాపురం పోలీసులు కొట్టడం వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, లాఠీ దెబ్బలు మృతుని శరీరంపై స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్��ుందని ఇంతటి దారుణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు తప్పు బడుతున్నారు. పోలీసుల తప్పులను కప్పి పుచ్చడానికి ఫిర్యాదు దారుని చేత ప్రామిసరీ నోటులో బలవంతంగా సంతకాలు చేయిస్తున్న వీడియోను చూస్తే మీకే అర్థమవుతుంద��... (ఇదిగో ఆ వీడియోను ఒకసారి చూడండి).
వైయస్ జగన్ గారిపై చేసిన 6 పెద్ద ఆరోపణలు.. ఆరోపణలు గానే మిగిలిపోయాయి..
ఈ ప్రభుత్వం ఏది నిరూపించలేకపోయింది..
రాజకీయ లబ్ది కోసం..
ఈ ప్రభుత్వ పెద్దలు చేసింది తప్పడు ప్రచారం అని.. ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
#TDPFakeNewsFactory#YSRCP#CBNJungleRaj#JaganannaConnects
#TDPFakeNewsFactory
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడి గురించి వైయస్ జగన్ గారు చెప్పిందేంటి? నువ్వు వక్రీకరించి చెప్తున్నదేంటి నారా లోకేష్?
సీదిరి గారి కుమారుడు చేసింది కరెక్ట్ అని వైయస్ జగన్ గారు చెప్పలేదు. కానీ.. ఆ యాక్సిడెంట్ విషయంలో పోలీసులు పెట్టిన తీవ్రమైన సెక్షన్స్‌ని మాత్రమే వైయస్ జగన్ గారు తప్పుబట్టారు
న్యాయమూర్తి కూడా ఆ సెక్ష��్స్ పెట్టడంపై మీ పోలీసులకు మొట్టికాయలు వేశారు కదా?
వాస్తవాల్ని దాచేసి ఇంకెంత కాలం ఇలా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడతారు @naralokesh ?
🚨 #RayalaseemaDrohiCBN
రాయలసీమ గురించి కానీ, సీమ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు @JaiTDPకి కానీ, @ncbnకు కానీ లేదు. 2014-19లో అధికారంలో ఉండి రాయలసీమకు మీరు చేసింది ఏమిటి? @ysjagan గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా మీ ఖాతాలోనే వేసుకుంటారా? సీమకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
1- కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌ను వేగవంతం చేసి, రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసింది వైయస్ జగన్‌గారి ప్రభుత్వం కాదా? మీ ఐదేళ్లలో ఇలాంటి ఒక్క ఇండస్ట్రియల్ నోడ్‌ను తీసుకొచ్చారా?
2- సెంచూరీ ప్లేవుడ్ పరిశ్రమలను తీసుకువచ్చి వేలాది ఉద్యోగాలకు పునాది వేసింది జగన్ గారి ప్రభుత్వంలో కాదా? మరి 2014-19లో మీరు తీసుకొచ్చిన ఒక్క భారీ పరిశ్రమ పేరు చెప్పండి?
3- ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించింది కూడా మా ప్రభుత్వ హయాంలోనే అన్నది వాస్తవం కాదా? మీరు కొత్తగా అభివృద్ధి చేసిన పారిశ్రామిక హబ్ ఏదో చెప్పండి?
4- రాయలసీమలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు కానీ, నాడు-నేడు ద్వారా వేలాది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం కానీ మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. మీ పాలనలో విద్యారంగంలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమం ఒక్కటి చెప్పండి?
5- హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. మీరు సీమ కోసం పూర్తి చేసిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టు ఏంటో చెప్పండి?
6- రాయలసీమకు ఎవరు పరిశ్రమలు తెచ్చారు.. ఎవరు పెట్టుబ��ులు తీసుకొచ్చారు.. ఎవరు విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు.. అన్నది ప్రజలకు బాగా తెలుసు.
7- అంతెందుకు.. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో మీరు మరోసారి శంకుస్థాపన చేసి క్రెడిట్ చోరీ చేసిన బంగారు గనులను గుర్తించి నాడే పనులను ప్రారంభించింది జగన్ గారు కాదా?
మీరు ఎన్ని అబద్ధాలను చెప్పినా చరిత్ర మారదు. ఇప్పటికైనా వాస్తవాలను చెప్పడం నేర్చుకోండి.
రాజధానిలో రాక్షసకాండ...
కోర్టు విచారణకు ముందే రైతుల భూములపై బుల్డోజర్లు!
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని పదేళ్లుగా గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు అదే రాజధానిలో భూములు ఇవ్వని రైతులపై పోలీసులను, జేసీబీలను దింపి తన అసలు స్వరూపాన్ని బయట పెట్టింది. రైతు పండించిన పంటను కోసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో ధ్వంసం చేయడం, మహిళలను ఈడ్చిపారేయడం, వృద్ధ రైతులను బలవంతంగా లాగేయడం, వందలాది మంది పోలీసులతో గ్రామాలను ముట్టడించడం... ఇవన్నీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం.
-బండి పుణ్యశీల ��ారు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#TDPAntiFarmers
#SadistChandraBabu
నెల్లూరు
- రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్
- నికర జలాల వినియోగానికి ఇదే ఏకైక మార్గం
- ఇది లేకపోతే కేటాయించిన నీళ్లూ వాడుకోలేం
: సజ్జల రామకృష్ణారెడ్డి గారు
- రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు
- రాయలసీమ హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం
: సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ
నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వై.యస్.ఆర్.సి.పి. రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డా.కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఎస్వీ మోహన్‌రెడ్డి గారు, శిల్పా చక్రపాణిరెడ్డి గారు, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. సమావేశం ��నంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి.
* రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కేటాయించిన 101 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే ఏకైక మార్గమే రాయలసీమ ఎత్తిపోతల పథకం.
* జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు 80 శాతానికి పైగా పూర్తి
* రూ.900 కోట్లకు పైగా బిల్లులు చెల్లించగా కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది.
* పంపులు, మోటార్లకు ఆర్డర్లు ఇచ్చినా ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కొనసాగించలేదు.
* తెలంగాణకు ఇచ్చిన రాజకీయ హామీ కారణంగానే ��ంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపివేశారు.
* ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలపై నిర్లక్ష్యానికి నిదర్శనం.
* పోలవరం ఎత్తు తగ్గింపు, బనకచర్ల వంటి కొత్త హామీలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.
* రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
* అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మే���ావులు, పౌరసంఘాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి
* వైయస్సార్సీపీ ��్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు
నెల్లూరు:
రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని, రాయలసీమ భవిష్యత్తును మార్చే "గేమ్ చేంజర్" అని వైయస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లేకుంటే రాయలసీమకు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కేటాయించిన కృష్ణా నదీ నికర జలాలను కూడా వినియోగించుకునే పరిస్థితి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 80 శాతానికి పైగా పూర్తయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాష్ట��రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, పోలవరం అంశం, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వంటి విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని, రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రెస్మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
- రాయలసీమ లిఫ్ట్ ఈ ప్రాంతానికి జ���వనాధారం
రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కృష్ణా జలాల్లో 101 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రం తక్కువ ఎత్తు నుంచే నీటిని తీసుకుంటున్న పరిస్థితుల వల్ల ఆ నీటిని వినియోగించుకునే అవకాశం క్రమంగా తగ్గిపోయింది. ఈ సంక్షోభానికి ఏకైక పరిష్కారం రాయలసీమ ఎత్తిపోతల పథకమే. తెలంగాణ తీసుకుంటున్న అదే స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా శ్రీ వైయస్ జగన్ గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. కాలువలు, సివిల్ పనులు పూర్తి చేసి రూ.900 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాం. పంపులు, మోటార్లకు కూడా ఆర్డర్లు ఇచ్చాం. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని బిగించి ప్రాజెక్టును పూర్తి చేయాల్సింది పోయి కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. దీంతో రాయలసీమకు కేటాయించిన నికర జలాలను కూడా వినియోగించుకోలేని ప్రమాదం ఏర్పడింది.
- రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివే��ింది కూటమి ప్రభుత్వమే
ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసింది. తనతో జరిగిన చర్చలో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేస్తానని చెప్పారని ఆయన వెల్లడించారు. దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఒకసారి పర్యావరణ అ��ుమతుల పేరుతో, మరోసారి ప్రాజెక్టును తామే ఆపలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అందుకు విరుద్ధంగా ఆధారాలను కూడా మేము ప్రజల ముందుంచాం. ప్రస్తుతం నీటి లభ్యతపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.
- రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల కేవలం రాయలసీమ మాత్రమే కాదు, కృష��ణా జలాలపై ఆధారపడిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభావితమవుతుంది. అయినా ఆల్మట్టి ఎత్తు పెంపుపై చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. గతంలోనూ ఇదే వైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కేంద్రంలో కీలక పాత్రలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క మాట మాట్లాడకుండా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఆల్మట్టి ఎత్తు పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, పోలవరం అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది. పూర్తి కావాల్సిన ర���యలసీమ లిఫ్ట్‌ను వదిలేసి బనకచర్ల పేరుతో కొత్త భ్రమలు సృష్టించడం ప్రజలను మోసం చేయడమే. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టే రాయలసీమ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్. అది లేకపోతే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కేటాయించిన నికర జలాలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు
- రాయలసీమ సాగునీటి హక్కుల కోసం కార్యాచరణ:
- రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయికి విస్తరించాలని నిర్ణయం.
* రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై సాంకేతిక నిపుణులు, మేధావులు, రాజకీయ నాయకులతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించనున్నారు.
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీ ప్రతినిధులతో పాటు మేధావులు, రైతులు, పదవీ విరమణ పొందిన అధికారులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియను జూలై 25లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు.
* జూలై 30న అన్ని జిల్లాల్లో కొత్త కమిటీలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లా వారీ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
* రాయలసీమ ఎత్తిపోతల పథ���ం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
* కమిటీ సభ్యులకు సాగునీటి ప్రాజెక్టుల సాంకేతిక, చారిత్రక, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక ఓరియంటేషన్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
* రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సభ్యులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అసెంబ్లీ కమిటీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నార��.
* పదవీ విరమణ పొందిన ఇంజనీర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, నీటి వనరుల నిపుణులతో ప్రత్యేక సలహా కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమానికి సాంకేతిక, విధానపరమైన సహకారం అందించనున్నారు.
* ఆగస్టు నెలలో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించి రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశం నిర్ణయించింది.
అభివృద్ధి పేరుతో రైతులను భయపెట్టి భూములు లాక్కోవడం ప్రజాస్వామ్యమా? లేక అధికార అహంకా��మా? జూలై 31న కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తే... ఇప్పటికే ధ్వంసం చేసిన పంటలను, తొలగించిన చెట్లను, వేసిన రోడ్లను ప్రభుత్వం తిరిగి యథాతథ స్థితికి తీసుకురాగలదా?
రాజధాని నిర్మాణంపై వ్యతిరేకత లేదు. కానీ రైతుల కన్నీళ్లపై రాజధాని నిర్మించడం అభివృద్ధి కాదు. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టు పరిశీలనలో ఉన్న అంశాలపైనే బుల్డోజర్లు నడపడం ప్రజాస్వామ్యంపై, న్యాయవ్యవస్థపై, రైతుల ���క్కులపై జరిగిన దాడి చూస్తే జంగిల్ రాజ్‌ను తలపిస్తోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన అండగా ఉంటుంది. న్యాయస్థానంలోనూ, ప్రజాక్షేత్రంలోనూ రైతుల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతుంది. రైతు గెలిచే వరకు.. రైతుకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
-గుంటూరు తూర్పు నియోజకవర్గ స��న్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు
#TDPAntiFarmers
అమరావతి రాజధానిలో రాక్షసకాండ జరుగుతుంది.
హైకోర్టు ఆదేశాలను దిక్కరించి..
ఈ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తూ జేసీబీలతో 3 పంటలు పండే భూములను నాశనం చేస్తుంది.
న్యాయస్థానాల తీర్పులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా?
- పల్ల.దుర్గారావు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ.
#CBNJungleRaj #TDPAntiFarmers #AndhraPradesh #JaganannaConnects
ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి @ncbn కంకణం కట్టుకున్నాడు.
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఆర్టీసీ ఆర్థిక మూలాలపై దెబ్బతీసే రీ���ిలో ఇ-బస్సుల విధానాన్ని ఖరారు చేస్తోంది. ఇ-బస్సుల కాంట్రాక్టు ధర పెంపుదల అధికారం ప్రైవేటు సంస్థల గుప్పెట్లో ఉంచేందుకు సిద్దపడుతోంది. తద్వారా ఆర్టీసీ ఖజానాపై ప్రైవేటు సంస్థలకే పెత్తనాన్ని కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది.
- వీర శేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#SadistChandrababu #TDPScams #MosagduBabu #JaganannaConnects
ప్రజాహృదయ నేత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా DMVలో ఘన నివాళులు
క్లార్క్స్‌బర్గ్, మేరీల్యాండ్ | జూలై 10, 2026
ప్రజాహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ DMV (డీసీ, మేరీల్యాండ్ & వర్జీనియా) ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మేరీల్యాండ్ రాష్ట్రంలోని క్లార్క్స్బర్గ్లో అత్యంత ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. తెలుగు రాష్ట్రాల పట్ల మమకారం కలిగిన ప్రవాస భారతీయులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ఆయన జీవితం, ప్రజా సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, విద్య, వ��ద్యం, పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింత గారు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ అడ్వైజర్ & గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ రమేష్ రెడ్డి వల్లూరు గారు, వైఎస్సార్సీపీ య��త్ వింగ్ సెక్రటరీ శ్రీ సుబ్బు రాయాని గారు మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవలను, ప్రజల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను, సంక్షేమ పాలనను, దూరదృష్టి నాయకత్వాన్ని హృదయపూర్వకంగా స్మరించుకున్నారు. వైఎస్సార్ గారి ఆశయాలు నేటికీ కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని, ఆయన చూపిన సంక్షేమ మార్గమే సమాజ అభివృద్ధికి ఆదర్శమని కొనియాడారు.
ఈ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ ��ూఎస్ఏ మిడ్-అట్లాంటిక్ ఇన్చార్జ్ శ్రీ పార్థ బైరెడ్డి గారి సమన్వయంతో అత్యంత విజయవంతంగా నిర్వహించారు. తక్కువ సమయంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చేసిన కృషిని పలువురు నాయకులు అభినందించారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను ప్రవాస భారతీయుల మధ్య మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేషంగా సహకరించిన శ్రీ సాయి జితేంద్ర పైడిమర్ల గారు, శ్రీ శ్రీనివాస్ పూసపాటి గారు, శ్రీ లక్ష్మీకాంత్ గారు (దోసా ప్లేస్), శ్రీ ఉమా మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ శివ పిటు గారు, శ్రీ వీర లక్ష్మయ్య గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ రవి బారెడ్డి గారు, శ్రీ సునీల్ గారు, శ్రీ మోహన్ రెడ్డి గారు (పెర్సిస్ గ్రిల్) తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
జోహార్ వైఎస్సార్! 🙏🏻
#77thYSRJayanthi
రాజకీయాల్లో రావటానికి ఇద్దరికీ అర్హత ఉంది..
ఎందుకంటే ఇద్దరూ బాధించబడ్డారు కాబట్టి..
వీళ్ళ రాకతో ఉనికి కోల్పోయే పార్టీలు మాత్రం కచ్చితంగా ఇవే :- @DrPradeepChinta 💥💯🔥👌