#RaoBahadur text review
Venkatesh Maha’s @mahaisnotanoun ‘Rao Bahadur’ is a unique, original, imaginatively done satire that gives the finger to patriarchal traditions
A few weeks after ‘Sing Geetham’, Telugu cinema hits it out of the park once again with a totally out-of-the-box experience.
A rich man is haunted by memories and is kept alive by one toxic burning desire. This premise spirals into a beautifully surrealistic message movie about social conditioning, with a career-best performance from Satyadev Kancharana @ActorSatyaDev
The film is a tad overstuffed, but that is a very, very small issue given what it achieves.
That’s the quick review. The longer, spoiler-filled analysis follows.
https://t.co/22s1CfdO2K
చదువు/ఆన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన
ఉగాది నవలల పోటీ ఫలితాలు
--
చదివే వాళ్ళు లేకుంటే రాసేవాళ్ళు ఎందుకు రాస్తారు?
తెలుగులో ఒక పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కష్టమైపోయింది. ఇది నిజం. ఇప్పుడు చాలామంది తెలుగులో మొదటి ఎడిషన్ అంటే రెండొందల కాపీలు ప్రింట్ చేస్తున్నారు. అదే మలయాళంలో ‘ఆడు జీవితం’ నవల ఇప్పటికి 150 ఎడిషన్స్ ప్రింట్ అయ్యాయి. ‘ఒరు సంకీర్తనం పోలే’ అనే నవల లక్షల కాపీలు అమ్ముడైంది. ‘రాం కేరాఫ్ ఆనంది’ అనే నవల గత రెండు నెలల్లో లక్షన్నర కాపీలు అమ్ముడైంది. ఇవి అప్పుడప్పుడూ జరిగే ‘ఔట్ లయర్స్’ కింద తీసేసి పక్కన పెట్టినా, మలయాళంలో, తమిళ్, కన్నడలో తెలుగులో ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు. పోనీ తెలుగులో చదివేవాళ్ళు లేరా అంటే, మొన్నీ మధ్యన వచ్చిన బ్రహ్మానందం గారి అత్మకథ ఎన్ని వేల కాపీలు అమ్మామో మాకు తెలుసు. రాం గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ ఎన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయో తెలుసుకున్నా, ‘ఇకిగాయ్’, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’, ‘శివ ట్రైలజీ’ లాంటి పుస్తకాలు పదివేలకు పైగానే అమ్ముడుపోయాయి. మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, చివరకు మిగిలేది పుస్తకాలు నెలకి 500 కాపీలు పైగానే అమ్ముడవుతాయని ఒక అంచనా. ప్రతిలపి లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో కొన్ని కథలు లక్షమందికి పైగానే చదివిన సందర్భాలూ ఉన్నాయి. మరి వీరంతా తెలుగు చదివేవాళ్ళే కదా? మరి ఇంతమంది చదువరులు ఉండగా పుస్తకాలు ఎందుకు అమ్ముడు పోవడం లేదు అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే క్రమంలో పుట్టినవే ఆన్వీక్షికి, చదువు.
ప్రపంచ వ్యాప్తంగా పుస్తకాల కొనుగోళ్ల విషయంలో ఉన్న ఒక అంచనా ప్రకారం, 35% పుస్తకాలు నవలలు, 20% పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్, 10% పుస్తకాలు బయోగ్రఫీలు, 10% చిన్న పిల్లల పుస్తకాలు, 10% నాన్ పిక్షన్ పుస్తకాలు అమ్ముడుపోతుండగా మిగిలిన పుస్తకాలన్నీ కలిపి మరో 15% అమ్ముడుపోతున్నాయి. ఇది మరీ ఖచ్చితమైన లెక్క కాకపోయినా, చిట్టచివరి 15%లో ఉండే కథలు, కవితలు లాంటి పుస్తకాలే ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా వస్తున్న పుస్తకాలు. తెలుగులో రచయిత అంటే అత్యధికంగా కథల సంపుటి లేదా కవితలు రాసే వాళ్లే మనకి అత్యధికంగా కనిపిస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా పాఠకులు మొగ్గు చూపుతున్న ఇతర పుస్తకాలు వదిలేయడం వల్లనే మనకి పాఠకుల లేమి అని అర్థం చేసుకోడానికి పి.హెచ్.డిలు చెయ్యక్కర్లేదు. అత్యధిక పాఠకులను ఆకర్షించగలిగే నవల అనే ప్రక్రియను మనం పక్కన పెట్టి, ఇప్పుడు పాఠకులు లేరని బాధపడడంలో అర్థమే లేదు.
ఇది సమస్య.
దీనికి పరిష్కారం ఒక్కరి వల్ల కాదు. ఒక్క రోజులో అవ్వదు. రెండున్నర దశాబ్దాలుగా మనం వదిలేసిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే క్రమంలో మేము మొదటి అడుగు వేద్దామనుకున్నాం. అలా మొదలైందే ఉగాది నవలల పోటీ. మాకు వీలైనంతలో భారీ పారితోషకం అందచేస్తూ, రచయితలను నవల వైపు మళ్ళించాలనే ప్రయత్నంలో ఈ పోటీ ప్రకటించాం. దాదాపు ఆరు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో ఇంతవరకూ తెలుగులో నవలలపోటీ జరిగినట్టు మాకైతే తెలియదు. ఈ పోటీకి మేము అనుకున్నదానికంటే మంచి స్పందనే లభించింది. కానీ ఎక్కువ శాతం పాతకాలపు కథలే వచ్చాయి. ఆ విషయాలన్నీ ఇంతకుముందు మరొక వ్యాసంలో పంచుకున్నాం. ఇప్పుడు నవలలపోటీ ఫలితాల విషయానికి వస్తే …
ఈ నవలలపోటీలో పాల్గొన్న చాలామంది రచయితలతో మేము ఫలితాలు ప్రకటించకముందే సంప్రదించి వారి నవలలు ఎడిట్ చేస్తే బాగవుతాయి అనుకున్న చోట వారి చేత రీరైట్ చేయించడం జరిగింది. దానికి కొంతమంది స్పందించలేదు. చాలామంది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఫలితాల ప్రకటించిన తర్వాత కూడా వీలైనంత రీవర్క్ చేయించి, ఆ తర్వాతే పుస్తకాలను ప్రచురించే ఆలోచనలోనే ఉన్నాం. ఈ పోటీలో గెలుపొందిన రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారనే అనుకుంటున్నాం.
ఈ పోటికి పంపించిన నవలల్లో మాకు వీలైనన్ని ఎక్కువ నవలలను పబ్లిష్ చేసే క్రమంలో గతంలో ప్రకటించిన నియమ నిబంధనలకు ఆతీతంగా ఈ ఫలితాలు ప్రకటిస్తున్నాం. ఎలాగైనా తెలుగు నవలకు మళ్ళీ పునర్వైభవం తీసుకు రావాలన్నదే మా ఆకాంక్ష.
బహుమతులు గెలుచుకున్న రచయితలకు అభినందనలు.
కడలి, సుదర్శన్ ఆన్వీక్షికి ద్వారా రచయితలయ్యారు. వారిద్దరూ ఈ రోజు రెండు వివిధ విభాగాల్లో మొదటి బహుమతి అందుకున్నారు. ఇది ఆన్వీక్షికి విజయంగానే మేము చూస్తున్నాం.
మొదటి బహుమతి, రెండవ బహుమతి అని కాదు కానీ ఓవరాల్‌గా మేము బహుమతికి అర్హమైన నవలలను స్వీకరించడానికి పెట్టుకున్న విధి విధానాల్లో ముఖ్యమైనది – ఈ నవల కొత్త పాఠకుడిని ఆకర్షించగలదా? అని.
కడలి తన నవల ‘చిక్ లిట్’ ద్వారా ఒక అవసరమైన ఒక అర్జెంట్ వాయిస్‌ని ప్రస్తుత ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేసింది. సుదర్శన్ ఒక వెబ్ సీరీస్ కి సరిపోయేలా ‘అనుకోకుండా’ అనే అద్భుతమైన థ్రిల్లర్ రాసి ఆశ్చర్యపరిచాడు. రంగస్థలం నేఫథ్యంలో వచ్చిన కెవివి సత్యనారాయణ నవల ‘యవనిక’ మాకు బాగా నచ్చింది. ఈ నవల కొన్నేళ్ల ముందొచ్చుంటే మనం మరాఠీ సినిమాని రీమేక్ చేయడం కాదు, మన సినిమానే ఇంకెవరో రీమేక్ చేసుకుని ఉండేవాళ్ళు. బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన థ్రిల్లర్ నవల ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు కథనంలో వాడడం నచ్చింది.
కుమార్ యశస్వి రాసిన ‘వేసవి కూలీ’ మా అందరికీ బాగా వచ్చిన నవల. పాతికేళ్ళు కూడా నిండని ఈ రచయితకు ఇది మొదటి నవల. అయినా ఒక రోజులో జరిగే జీవితాన్ని కథనం చేయడంలో అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అలాగే మరో ముగ్గురు యువరచయితలు – ప్రసాద్ సూరి (24), భవ్య శర్మ (21), మొహమ్మద్ గౌస్ (26) - సాధన చేస్తే భవిష్యత్తులో మంచి నవలలు రాయగలిగే సామర్థం కలిగి ఉన్నవాళ్లే. వీరందరికీ ఆలవిల్లి (సత్తూరు) నిర్మలా దేవి పురస్కారాల అందచేస్తున్నాం.
జోగిని వ్యవస్థ మీద సంధ్యా విప్లవ్ రాసిన ‘త్రికాల’, స్టూవర్ట్ పురం గురించి ఇంతవరకూ ఒక అథెంటిక్ డాక్యుమెంట్ లేని లోటు తీరుస్తూ సలీం రాసిన ‘లోహముద్ర’, మారుతున్న మానవ సంబంధాల్లో ఉన్న కాంప్లికేషన్స్‌ని కొంత మెలోడ్రామాతో రాసిన తటవర్తి నాగేశ్వరి నవల ‘ప్రేమే నేరమా?’ ఎంతో అవసరమైన పుస్తకాలు అనిపించాయి.
కృష్ణ కిశోర్ రాసిన ‘రుద్ర రుధిరం’ ఒక మంచి ఫాంటసీ థ్రిల్లర్. టైం ట్రావెల్ ఉంటుంది కానీ సైన్స్ ఫిక్షన్ కాదు. సుగుణా రావు నవల ‘పైనల్ డయాగ్నాసిస్’ చివరి పేజీ దాకా ఎంతో అసక్తికరమైన మలుపులతో సాగింది. ఎనిడ్ బ్లైటన్ సృష్టించిన ‘ఫేమస్ ఫైవ్’ లాగా కొయిలాడ రామ్మోహన్ రావు ‘ఎదురులేని ఏడు’ చిన్న పిల్లలు చదువుకోదగ్గ మంచి నవల.
అజ్ఞాతవాసి (సింహప్రసాద్), బుట్టబొమ్మ (సాయిరాం ఆకుండి), అన్వేషణ (శిరంశెట్టి కాంతారావు), ఆపరేషన్ రెడ్ (పాణ్యం దత్తశర్మ), అదృశ్య సంకెళ్లు (జయప్రకాశ్ సొంటి), కలిసుందాం కడదాకా (బొంతా లక్ష్మీ గాయత్రి), తోకలేని పిట్ట (పుల్లా రామాంజనేయులు), దేవుడి మొర (ఆకురాతి భాస్కర్ చంద్ర), నాలో ఉన్న ప్రేమ (స్వప్నప్రియ గంజి), నియాంపురం (రాజా నరసింహ), బిట్టు దేవత (చంద్రశేఖర్ ఆజాద్), బ్లాక్ ఎండ్ వైట్ (వాణిశ్రీ), శృంగార యాత్ర (వి. రాజారాంమోహన్ రావు), సాలెగూడు (పివివి సత్యనారాయణ) నవలలు కొన్ని అవసరమైనవి, కొన్ని వినోదాత్మకమనవి కూడా ఉన్నాయి. ఈ నవలలు కూడా చదువులో ఈ బుక్స్ గా ఉంటాయి. రచయితల ఆసక్తిని బట్టి కొన్ని ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంది.
మాకు వచ్చిన వందకు పైగా నవలల్లో ముప్ఫై నవలలు ప్రచురించి, రచయితలను నవల వైపు ప్రోత్సాహించాలనే మా ఈ ప్రయత్నం.
ఈ నవలలన్నీ ఎడిటింగ్, లే అవుట్, ప్రూఫ్ చేయడానికి చాలా సమయం పడ్తుంది. కాబట్టి ఈ నవలలు పబ్లిష్ చేయడానికి మరో మూడు నాలుగు నెలలైనా పడ్తుంది. అది కూడా ఒకేసారి అన్ని నవలలు కాకుండా డిశెంబర్ కల్లా అన్ని పుస్తకాలూ అచ్చు వేయాలనేదే మా ప్రయత్నం.
ఈ నవలలపోటీలో యువ రచయితలకు బహుమతులు అందచేసి వారిలో ఉత్సాహం నింపిన శ్రీనివాస్ ఆలవిల్లి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ నవలల పోటీ నిర్వహించడంలో సహకరించిన మిత్రులు, రచయితలకు మా కృతజ్ఞతలు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
Let’s just accept the fact that the majority of audience see cinema just as a means of entertainment. Not art. We can sit and write long posts, share screenshots and interview clips to discuss and celebrate movies but it hardly makes any real impact doesn’t go beyond the online cinephile bubble.
Also, let’s not pretend like it’s crushing the box office everywhere except the Telugu states. It’s a very important and anticipated film for the Malayalam audience and understandably so because of the significance of the real life story and the popularity of the book. But outside social media, at least here, the general audience who make or break a film are not aware that this movie exists because of low-key promotions. Neither are they familiar with the struggle that went into its making, which was its biggest USP.
And no, Aadujeevitham is a demanding, disturbing, and unpleasant watch—I mean it as a compliment, fyi.
The general sentiment that prevails among normal ticket-buying public is “why should I pay money and go to theatre to see the struggles of a man while my life itself sucks” applies to this too and fair enough. And of course, the truth is, the online cinephile community doesn’t make any difference in reality. It’s common audience that makes a film work and if they don’t want to sit through this painful film, it’s understandable.
Continue to live in your la la land, assuming moral high ground, and labelling audience, and completely ignoring the reality. Aadujeevitham is a good film but it’s not for everyone, certainly those who just want to escape their ordeals for the time being, which is, the majority of people, accept it or not.
Cinephiles/purists can come and argue that cinema shouldn’t be seen just as avenue for escapism, it’s meant to make you introspect, cure your mental health issues, make you a better person, blah blah blah…. just remember once again that these arguments don’t make any difference, as harsh as it may sound. I’m sick of this.
It has been six years since the release of my first film. I want to express my heartfelt thanks to @sreevishnuoffl, Krishna Vijay, Prashanthi Mullapudi, and @IamRohithNara sir for believing in me and giving me the opportunity to direct. I am eternally indebted to the technicians who worked on this film, as well as to my family and friends who have supported me on this journey.
#NeediNaadiOkeKatha #SreeVishnu
"మంజ్ఞుమ్మల్ బాయ్స్ - తాగుబోతు పోరంబోకుల పిచ్చిగంతులు"
రచన: జయమోహన్ - తమిళ రచయిత
March 9, 2024
(Bhaskar Avineni's FB wall)
సాధారణంగా ఇప్పుడొచ్చే సినిమాలను నేను విమర్శించను, నా అభిప్రాయం చెప్పను. ఎందుకంటే నేను కూడా సినిమా రంగం లోనే పని చేస్తున్నాను. వాణిజ్య సినిమాలు తీయడం గొప్ప కళేమీ కాదు. ప్రవచనం కూడా కాదు. కేవలం వ్యాపారం. నూటికి నూరు శాతం వ్యాపారం. కాబట్టి ఒక వ్యాపారస్తుడు మరొకరి వ్యాపారం మీద దాడి చెయ్యకూడదు. అదొక కట్టుబాటు.
అయితే ఏనుగు డాక్టర్ కథను రాసిన వాడిగా నేను ఈ వ్యాసం రాయాల్సిన అవసరం ఉంది. మంజ్ఞుమ్మల్ బాయ్స్ అనే మలయాళం సినిమాకు వస్తున్న పొగడ్తలు, చూసిన జనాల పులకింతలు, ఇస్తున్న కితాబులు విని నేను కూడా ఆ సినిమా చూడాల్సి వచ్చింది.
ముందుగా, మలయాళం సినిమాలు మనవాళ్ళల్లో కలిగించే భావోద్వేగపు సందోహం గురించి మాట్లాడుకుందాం! ముఖ్యంగా, ‘ది హిందూ - తమిళం’ దినపత్రిక మలయాళ సినిమాల విషయానికొచ్చేటప్పటికి ఇరవైనాలుగు గంటలూ తన్మయత్వంలోనే ఉంటుంది. వారి దృష్టిలో అన్ని మలయాళం సినిమాలూ క్లాసిక్కులే. నిజానికొస్తే వాటిల్లో చాలా సినిమాలు, ఆఖరికి తీసినవాడి సొంత కన్న తల్లిగూడా చూసి భరించలేని కుహనా కళాఖండాలే!
మంజ్ఞుమ్మల్ బాయ్స్ సినిమా గనక తమిళంలో వచ్చి ఉంటే ఇక్కడ ఉన్న సాదాసీదా విమర్శకులు కూడా ఒక ప్రశ్న అడిగి ఉండేవాళ్ళు. ‘పత్రికల్లో ప్రచురింపబడిన అంత పెద్ద ప్రమాదకరమైన వార్త, అంత వీరోచితమైన సంఘటన కేరళలోని ఆ మంజ్ఞమ్మల్ ప్రాంత ప్రజలకు మటుకు ఎలా తెలియకుండా పోయింది అని! మంజ్ఞుమ్మల్ బాయ్స్ అసలు ఈ విషయం గురించి ఊర్లో ఏమీ చెప్పనేలేదా? అది ఒకడు మరొకడికోసం ప్రాణం ఇవ్వడానికైనా తెగించిన సంఘటన, దాన్ని అలా ఎలా దాచిపెట్టారు! రోజుల తరబడి కూడా ఈ విషయం బయటకు రాలేదా? ఈ సినిమాలో పతాక సన్నివేశం విపరీత భావోద్వేగాన్ని సృష్టించడం కోసం వండి వార్చబడిన వ్యవహారం. అయితే మలయాళం సినిమాలో వచ్చింది కాబట్టి ఇది మటుకు ‘వాస్తవ చిత్రీకరణ(Realism)’ అంటారు మన ఊరి మహా మేతావులు.
అదలా ఉంచితే, అన్ని వాణిజ్య చిత్రాలూ అదీ ఇదీ కల్పించి సృష్టించినవే. కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొచ్చేవి. తమకున్న కొద్ధిపాటి బుర్రతో విషయం మీద లోతైన అవగాహన లేకుండా పొద్దస్తమానం సినిమాల చుట్టూ మాత్రమే తిరుగుతూ వాటినే విశ్లేషిస్తూ తమను తాము మేధావి వర్గానికి చెందిన వాళ్ళం అని భావించే వాళ్ళే ఇక్కడంతా. వాళ్ళ జేబుల్లోంచి వచ్చే డబ్బే నా బాంక్ అకౌంట్ ను కూడా నింపుతుంది, కాబట్టి అలాంటి వాళ్ళ మీద నాక్కూడా కొంచం సానుభూతి ఉంది. గడ్డి ఏపుగా పెరుగుతోంటే సంతోషించేది పశువేగదా!
కాకపోతే, మంజ్ఞుమ్మల్ బాయ్స్ నన్ను బాగా చిరాకు పెట్టింది. ఎందుకంటే అది చూపించేది కల్పితం కాదు, వాస్తవం. సినిమా మొత్తం, దక్షిణాదంతా విహార యాత్రలంటూ తిరిగే సగటు కేరళ పోరంబోకుల ముఠాల వైఖరే మనకు చూపిస్తారు. ఇలాంటి వాళ్ళెంతో మంది పర్యాటక స్థలాలలో మాత్రమే కాకుండా, దట్టమైన అడవుల్లో కూడా తిరగడం ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ ముఠాలకు పొద్దస్తమానం తాగుడు, వాంతులు చేసుకోవడం, గలాటా చేయడం, పడి నిద్రపోవడం, హద్దులు దాటి ప్రవర్తించటం ఇలాంటివి కాకుండా మరో పనంటూ ఉండదు. ఇలాంటి వాళ్లకు కొంచెం కూడా వ్యవహార జ్ఞానం, బాధ్యతాయుతమైన ప్రవర్తనా ఉండదు.
నా మటుకు నేను ఇప్పటివరకు కనీసం ఓ పదిసార్లయినా ఊటి, కొడైకానల్, కుట్రాలం ప్రాంతాల్లో ఈ మలయాళపు తాగుబోతు పోరంబోకులు రోడ్లమీదబడి గలాటాలు చేయడం చూశాను. వాళ్ళు తిరిగే వాహనాలకు రెండు పక్కలా వాళ్ళు తాగి చేసుకున్న వాంతులు, ధారలు ధారలుగా కారుతు ఉంటాయి - ఈ సినిమాలో చూపించినట్టు. తాగేశాక అదే సీసాలను బయటకు విసిరేస్తూ ఉంటారు. మీకు అనుమానం ఉంటే సెంగోటై-కుట్రాలం రోడ్డులోనో, కూడలూరు-ఊటీ రోడ్డులోనో ఒకసారి తిరిగి చూడండి. రోడ్డు పొడవునా ఇరువైపులా పగిలిపోయిన సీసా పెంకులు, పగలని సీసాలుూ పడి ఉంటాయి. దాన్ని కూడా ఈ సినిమాలో అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు చూపించారు.
ఎన్నోసార్లు వీళ్ళతో మేము గొడవకు దిగాము. ఒకసారి వాగమన్కు మాతోపాటు వచ్చిన చెన్నై హైకోర్టు లాయర్ సెందిల్‌కుమార్ ఆ పచ్చని నేలమీద వీళ్ళు పడేసి పోయిన సీసాలన్నీ ఓపిగ్గా, జాగ్రత్తగా ఏరి వూర్లో ఉన్న చెత్తకుండీలో పడేయడం నా కళ్ళతో నేను చూశాను.
సంవత్సరానికి కనీసం ఇరవై ఏనుగులు ఈ సీసా పెంకులు కాళ్ళల్లో గుచ్చుకుని ఇన్ఫెక్షన్ వచ్చి, ఒళ్ళంతా కుళ్ళి చచ్చిపోతున్నాయి. అదే విషయం మీద ఆగ్రహావేశం ప్రకటిస్తూ రాసిన ఏనుగు డాక్టర్ అనే కథ మలయాళంలో కూడా లక్ష ప్రతులకు పైగా అమ్ముడు పోయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఆ కథ చదివుండే అవకాశం మృగ్యం.
ఈ మలయాళపు పోకిరిగాళ్ళకు పొట్టబొడిస్తే ఇతర భాషల్లో మాట ఒక్కటి కూడా నోట్లో పలకదు. అన్ని ప్రశ్నలకూ మలయాళంలోనే జవాబు చెప్తారు. అంటే నా భాష ఎదుటివాళ్ళకు తెలిసుండాలి అన్న అహంకారం. ఈ సినిమాలో తమిళనాడు పోలీసులు, వాళ్ళతో వ్యవహరించే విధానం కూడా వాస్తవమే. చేతి భాష తప్ప ఇంకేమీ అర్థం కాదు వీళ్ళకి.
కేరళలో పెళ్ళిళ్ళకు వెళ్ళడం ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య. మలయాళీల్లో రెండు రకాలుంటారు. విదేశాల్లో రక్తం ధారపోస్తూ ముప్పొద్దులా కష్టపడేవాళ్ళు మొదటి రకం. రెండో రకం - ఈ దేశంలో బతుకుతూ వాళ్ళ సొమ్ము దోచుకుని ఇరవైనాలుగు గంటలూ తాగి తందనాలాడేవాళ్ళు. ఈ తాగుబోతులు ప్రతి పెళ్ళి లోను జొరబడి ఒళ్ళు తెలియకుండా పిచ్చిగంతులు వేస్తూ ఉంటారు. పెళ్ళి వేదిక మీద అక్కడికక్కడే భళ్ళున వాంతులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది. ఆఖరికి పెళ్ళికూతుర్ను పక్కనపెట్టుకుని వాంతులు చేసుకున్న పెళ్ళి కొడుకులను కూడా నేను చూశాను.
ఈ తాగుడు సంస్కృతిలో తమిళనాడు కూడా మెల్లగా కేరళ స్థాయికి చేరుకోడానికి తహతహలాడుతోందని చెప్పి తీరాలి. కేరళకి ఇక్కడికీ తేడా ఏంటని చూస్తే, తాగుడు మైకాన్నీ, తద్వారా జరిగే విధ్వంసాన్నీ అతి సాధారణ వ్యవహారంగా చిత్రీకరించడం కేరళ సమాజానికి అలవాటైపోయింది. పైపెచ్చు పొరపాటున చట్టాన్ని గౌరవించే సామాన్యుడు ఎవరైనా ఉంటే వాణ్ణి దద్దమ్మగాను, పనికిరాని వాడుగాను చిత్రీకరిస్తుంది. కేరళ బీచీల్లో సాయంత్రం ఏడు తర్వాత ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా అడుగుపెట్టలేరు - ఆఖరికి ఈ విషయం గురించి అక్కడి పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తుంది.
కేరళ సినిమాల్లో వినోదం అంటే - తాగి గొడవపెట్టుకుని, తగవులాడి, వాంతి చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి గంతులేయడం మాత్రమే, అన్నట్టు చూపించటం అలవాటైపోయింది. అసలు తాగకుండా సంతోషంగా ఓ నలుగురు మాట్లాడుకుంటూ ఉండే దృశ్యాన్ని ఏ మలయాళం సినిమాలోనైనా మీరు చూడ్టం జరిగిందా? ఈ సినిమా కూడా అలాంటి పనికిమాలిన వెధవల్నే ఆనంద మందారాలుగా చిత్రీకరిస్తుంది. అలాంటి సమర్థింపుని మెల్లమెల్లగా ప్రజల మనస్సులో చొప్పిస్తున్నారు. అంటే ఒక సగటు తమిళ సినిమాలో హీరో ఎలాంటి నికృష్టులనుంచైతే ప్రజలను రక్షించి పుణ్యంగట్టుకుంటాడో అలాంటి వాళ్ళే నేటి మలయాళ సినిమాల్లో గొప్ప హీరోలు!
దీనికంతా కారణం - ఎర్ణాకుళాన్ని ఆక్రమించుకున్న ఓ మందుబాబుల ముఠా చుట్టూ మాత్రమే నేటి మలయాళ సినిమా అంతా తిరుగుతోంది. అక్కడ రాత్రీ పగలన్న తేడా లేకుండా మందు ప్రవహిస్తూనే ఉంటుంది. దీనికంటే ఘోరం మాదకద్రవ్యాల వాడకం. కేరళలో, మరీ ముఖ్యంగా ఎర్ణాకుళంలో జరిగేటన్ని మాదకద్రవ్యాల విందులు భారత దేశంలో ఇంక ఎక్కడా జరగవు. మలయాళ కథానాయకులుకూడా తరచూ మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కోవడం అన్నది వార్తల్లో మనం చూస్తున్నాం. మత్తు సంస్కృతిలో మునిగిపోవడాన్ని మలయాళ సమాజం అతి సాధారణ విషయంగా పరిగణించేందుకు కృషి చేస్తున్నది నిజానికి వీళ్ళే.
పదేళ్ళ క్రితం కేరళలో మత్తును, వ్యభిచారాన్ని అతి మామూలు విషయాలుగా చిత్రీకరించిన ‘కిళి పోయి’, ‘ఒళివునేరత్తే కళి’, ‘వెడివళిపాడు’, ‘జల్లికట్టు’ వంటి అనేక చిన్న సినిమాలు వచ్చాయి. ఇవన్నీ నాసిరకం, డొల్ల సినిమాలు. అతి మేతావులందరూ వాటిని ‘సహజమైన కళాత్మక సినిమాలు’ అని కొనియాడారు. తమిళనాడులో కూడా అదే స్థాయి మేతావులు కొంతమంది వాటికి బ్రహ్మరథం పట్టారు. ఇదే ధోరణి నేటి సినిమా ప్రపంచమంతా ప్రబలిపోయింది. కేరళ సమాజం మేలు కోరుకునే ఆలోచనంటూ ఉండే ఏ ప్రభుత్వమైనా అంటూ ఉంటే ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళమీద వెంటనే చర్యలు తీసుకోవాలి.
వీళ్ళు తీసే మత్తుపిచ్చి సినిమాలను తెగ మెచ్చుకునే తమిళుల్ని ఎవరినైనా సరే, పనికిమాలిన దద్దమ్మలుగా, అయోగ్యులుగా మాత్రమే నేను పరిగణిస్తాను. కమర్షియల్ సినిమా తియ్యడం అనేది ఓ గొప్ప కళేమీ కాదు. అది కళంటూ ఏమాత్రము అవగాహనలేని, బుర్రను ఏమాత్రము కష్టపెట్టడానికి ఇష్టపడని జన బాహుళ్యాన్ని నేరుగా చేరే ప్రయత్నం. దాన్ని అనవసరంగా ఓ కళంటూ నెత్తికెక్కించుకోవటం తగని పని. ఎలాంటి సాలోచనలేని సామాన్య ప్రజల జీవితాలను ఈ విచ్చలవిడితనం నాశనం చేసేస్తుంది.
ఈ సినిమాలో చూపించినట్టు ఇలాంటి ముఠాలు హద్దులు దాటి పర్యాటక స్థలాలను విధ్వంసం చేయడమే కాకుండా వన్య సంరక్షణ ప్రాంతాలను కూడా నాశనం చేస్తున్నారు. దానికి అడ్డమైన దారులనూ ఎన్నుకుంటున్నారు. ఏ చట్టాన్నీ లెక్కచేయట్లేదు. ఏ హెచ్చరికనూ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు - జామకాయ లోపల మిరప్పొడి కూరి కోతులకిస్తున్నారు. ఏనుగుల మీదకు ఖాళీ సీసాలు విసురుతున్నారు. దట్టమైన అడవుల్లో లౌడ్‌స్పీకర్లతో పాటలు పెట్టి పిచ్చి గంతులు వేస్తున్నారు.
మే నెల చాలా ప్రమాదకరమైనది. ఈ వెధవలు బీడీ, సిగరెట్లు, ఎండుటాకులతో నిండిన తమిళనాడు అడవుల్లోకి విసిరేసి వెళ్ళిపోతారు. మామూలుగా కేరళ అడవులు ఎండవు. కానీ ఇక్కడ అలా కాదు. వందలాది ఎకరాల అడవి ఒక్కసారి కాలి బూడిదైపోతుంది. వేలాది జీవులు సమసిపోతాయి. వీళ్ళకసలు ఆ ధ్యాసే ఉండదు.
కేరళలోని రిసార్ట్‌లకు వెళ్లడం అన్నది చాలా ప్రమాదకరం. బయటకు చెప్పుకోలేని ఘోరమైన అనుభవాల గురించి విన్నాను. ఒకసారి నా స్నేహితుడి కూతుర్నీ అల్లుణ్ణీ హనీమూన్ కోసం నేనే ఏర్పాట్లు చేసి పంపించాను. అప్పుడు ఇలాంటి ఒక ముఠా వచ్చి చేసిన అరాచకానికి, వాళ్ళు తప్పించుకుని పారిపోయి తిరిగి రావాల్సి వచ్చింది. నేను సినిమా పనుల మీద మానందవాడిలో ఒక రిసార్ట్ లో ఉన్నప్పుడు, ఒక ఉత్తరాది జంట మీద ఇలాంటి ముఠా దాడి చేసి మానభంగ యత్నం చేసింది. అప్పుడు నేను జోక్యం చేసుకొని తెల్సినవాళ్ళ సహాయంతో వాళ్ళని రక్షించాను - రిసార్ట్‌లో ఆ రోజు మేనేజర్ కూడా లేడు. మలయాళం రాని ఇద్దరు బెంగాలీ అబ్బాయిలు మాత్రమే ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నారు.
ఇలాంటి చెండాల్లాన్నంతా సామాన్య ప్రజానీకం జరుపుకునే సంబరాలు అన్నట్టు చూపించి సమర్థించడమే కాకుండా, ఈ వెధవలందరికీ పెద్ద పీట వేసి కూర్చోపెడుతోంది, ఈ మంజ్ఞుమ్మల్ బాయ్స్. వాళ్ళను త్యాగమూర్తులుగా, స్నేహశీలులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏ దుర్మార్గుల ముఠాకైనా వాళ్ళల్లో వాళ్ళకు ఐకమత్యం ఉంటుంది. ఆఖరికి నేరగాళ్ళ ముఠాల్లో కూడా త్యాగభావం ఉంటుంది. అవేమీ గొప్ప ఆదర్శాలు కావు. ఇలాంటొక వాస్తవ సంఘటన జరిగింది అనీ, వాళ్ళల్లో ఒకడికి జాతీయ స్థాయిలో పురస్కారం వచ్చింది అనీ సినిమా చివర్లో ఒక వార్తను చూపించారు. అసలైతే చట్టప్రకారం జెయిల్లో పెట్టాలి వాడిని.
ఈ ముఠాల గురించిన అవగాహనను తమిళనాడులోనూ, కర్ణాటలోనూ ఈ సినిమా సృష్టించగలిగిందంటే మంచిదే. వీళ్ళను పోలీసులు నేరస్తులుగానే భావించాలి. ఏ మాత్రం సహకరించకూడదు. అప్పుడప్పుడూ ఇలాంటివాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుని చావడం కూడా ఓ రకంగా మంచిదే. కనీసం మన అడవులు రక్షించబడుతాయి. అదే ప్రకృతి వీళ్ళకిచ్చే నిజమైన శిక్ష.
- జయమోహన్ JJeyamohan
తమిళ మూలం:
https://t.co/wlsdXe32s4