ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
•ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
•తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే
•అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం
•తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు
•అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు
•డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా డిజైన్, డీపీఆర్ పై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. నిర్ణీత గడువు లోపు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా పర్యావరణ, తదితర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. (1/2)
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?
•తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా మీ నుంచి స్పందన లేదు
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా? ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, మీరొక్కరే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యింది. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే.. ఇది 70 శాతం అధికం. మీరు విడుదల చేసే కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ, నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, భవిష్యత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు.
మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్ చేయొచ్చు. ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్చు. అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు. అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు థీమ్ తో మన గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నాము. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
Immediate Ga Me Appointment Kavali Medam.. It's Too Much Emergency...
Please 🥺🥺 I'm Humble Request @Anitha_TDP 🙏🙏🙏🙏🙏🙏🙏
Save Girl's.. Save Society..
Please Respond Atleast One Reply Mam..!!!
Travelled all the way to experience the monster euphoria at palani theatre tirupati for #Panja4K
Literally Peak stuff from beginning to ending @TirupatiPKFC 🫡😁❤️
After looking at the MASSIVE birthday celebrations of Janasenani @PawanKalyan
across Andhra Pradesh & Telangana once again proves one eternal truth...
రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు @PawanKalyan 🛐🙏🥵
#HBDJanaSenaniPawanKalyan
Heartfelt gratitude to the Hon’ble Defence Minister Sri @rajnathsingh Ji for your warm birthday wishes and kind words. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Your leadership of our defence establishment, particularly during Operation Sindoor, reflected Bharat’s preparedness, strength, and unwavering resolve to protect our nation. Your steadfast commitment to strengthening our Armed Forces and safeguarding Bharat’s sovereignty remains deeply inspiring.
I remain committed to contributing to the NDA’s collective vision of building a strong, secure, and prosperous Bharat.
@MinofDefIndia
दिल्ली की माननीय मुख्यमंत्री @gupta_rekha जी, आपकी आत्मीय शुभकामनाओं के लिए हार्दिक आभार। जनता की सेवा ही हमारा परम धर्म है और आपका यह स्नेह हमारी इस राह को और मजबूत करता है।
मैं भगवान श्री आंजनेय स्वामी जी से दिल्ली के हमारे सभी प्यारे भाई-बहनों के सुख, समृद्धि, उत्तम स्वास्थ्य और मंगलमय जीवन की कामना करता हूँ।