స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి..
ప్రజలచే ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించడం స్థానిక స్వపరిపాలన స్ఫూర్తి దృష్ట్యా ఆలోచించాల్సిన అంశమే..
అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్నప్పుడు, ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ వల్లే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడి, “స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి ఎక్కువ మంది ప్రతినిధులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది” అనే తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఇది స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి అనుకూలం కాదు.
భారీ స్థాయి లేదా రాష్ట్ర ప్రాధాన్యమున్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం, నిధులు, సమన్వయం అవసరమే. అయితే రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కులు వంటి స్థానిక అవసరాలకు సంబంధించిన పనుల్లో ఎన్నికైన మేయర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు తగిన ప్రాధాన్యం, భాగస్వామ్యం ఉండాలి.
భారత రాజ్యాంగంలోని 74వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 243W మరియు పన్నెండో షెడ్యూల్ పట్టణ స్థానిక సంస్థలను స్థానిక స్వపరిపాలన సంస్థలుగా బలోపేతం చేయడానికి రాజ్యాంగబద్ధమైన పునాదిని కల్పించాయి. పట్టణ ప్రణాళిక, రహదారులు, నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాలు తదితర అంశాలు పన్నెండో షెడ్యూల్లో ఉన్నాయి.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965లో ప్రజా వీధులు, డ్రైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి సరఫరా, లైటింగ్ తదితర పట్టణ మౌలిక వసతులకు సంబంధించి స్థానిక సంస్థల బాధ్యతలు, అధికారాలు ప్రస్తావించబడ్డాయి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి మా వినయపూర్వక విజ్ఞప్తి:
స్థానిక సంస్థల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు, పర్యవేక్షణ, ప్రారంభోత్సవాలు, ప్రజలకు వివరించే కార్యక్రమాల్లో సంబంధిత మేయర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు తగిన పాత్ర మరియు ప్రాధాన్యం కల్పించాలి
స్థానిక ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు, సమస్యలను క్షేత్రస్థాయిలో అత్యంత దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంటుంది. వారి భాగస్వామ్యం స్థానిక అభివృద్ధిని మరింత ప్రజాకేంద్రీకృతంగా, జవాబుదారీతనంతో నిర్వహించడానికి దోహదపడుతుంది.
స్థానిక అభివృద్ధి పనులను ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభించడం ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ఆశయమైన స్థానిక స్వపరిపాలనను మరింత బలోపేతం చేయవచ్చు.
ప్రజాధనం – ప్రజా ప్రయోజనం
ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు సమాచారం అందించడం అవసరమే. అయితే ఇలాంటి ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాల కోసం అన్ని పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలకు భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ప్రజలకు వివరించాలి.
స్థానిక ఎన్నికలకు ముందు. ఇలా ప్రభుత్వ ప్రకటనలు పెద్ద ఎత్తున ప్రచురించబడితే, అవి ప్రభుత్వ సమాచార ప్రచారమా? లేదా రాజకీయ ప్రచారమా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తే అవకాశం ఉంది.
ప్రజాధనం రాజకీయ పార్టీల ప్రచారానికి ఉపయోగించబడుతోందనే అపవాదు ప్రభుత్వానికీ, అధికార పార్టీకి రావడం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.
ప్రకటనల కోసం ఖర్చు చేసే ప్రజాధనంలో కొంత భాగాన్ని తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రత్యక్ష ప్రజా అవసరాలకు మళ్లిస్తే ప్రజలకు మరింత ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.
అలాగే ఏ పత్రికలకు ఎంత మొత్తంలో ప్రకటనలు ఇచ్చారు, ఏ నిధి నుంచి ఆ ఖర్చు చేశారు, వాటి ఉద్దేశ్యం, ప్రజా ప్రయోజనం ఏమిటి అనే వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలి.
స్థానిక సంస్థల అధికారాలను గౌరవిస్తూ, ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ, ప్రజాధనాన్ని పారదర్శకంగా మరియు సమర్థవంతంగా వినియోగించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని ఆశిద్దాం.
అభివృద్ధి అంటే కేవలం ప్రారంభోత్సవాలు కాదు; ప్రజల అవసరాలకు స్థానిక స్థాయిలో జవాబుదారీతనంతో స్పందించడం కూడా.
స్థానిక సంస్థలు బలపడితేనే ప్రజాస్వామ్యం గ్రామం, పట్టణం, వార్డు స్థాయిలో మరింత బలపడుతుంది.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరం ✊
#ConstitutionOfIndia #Article243W
@AndhraPradeshCM@ncbn@pibvijayawada@PIB_India@ANI@PTI_News
అందరికి నమస్కారం నాపేరు పద్మ మాఊరు మేకలపల్లి. మా ఆయన మహేష్ జనసేన పార్టీలో పెనుకొండ మండల అధ్యక్షులుగా సేవలందిస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు గణ సాయి ,ప్రణతి . మా కుమారుడు 15/09/2026 సాయంత్రం సుమారు 7 గంటల నుంచి 8గంటల మధ్యలో ఊరిలో నుండి ఇంటికి వస్తున్న సమయంలో వైసీపీ బూత్ కన్వీనర్ రామాంజినప్ప కుమారులు ఇద్దరు కలిసి నా కొడుకు పై గొడవ చేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినారు. కాకపోతే మేము వెంటనే మా కొడుకుని తీసుకుని హాస్పిటల్ కెళ్ళి అక్కడ వైద్యం చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజుకి ఆరు రోజులు అవుతున్నా కూడ స్థానిక టీడీపీ లీడర్స్ మరియు వైసీపీ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకే సపోర్ట్ చేసుకుంటా ఈ కేసుని తప్పుదారులు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే మా ఆయన పార్టీ బలోపేతం కోసం చురుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని కక్షతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని దురుద్దేశంతోనే మాకు అన్యాయం చేస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో మన అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను 🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl
"మనకి బలం ఉన్నచోటే పోటీ చేయాలి " అన్న నాదెండ్ల మనోహర్ గారి మాటలని చాలామంది వ్యతిరేకిస్తున్నారు అతి కొద్ది మంది సమర్థిస్తున్నారు.
వ్యతిరేకత సమర్థన పక్కనపెట్టి ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుందాం.
"మనకు బలమున్న చోటే పోటీ చేయాలి బలహీనంగా ఉన్నచోట వదిలేయాలి " అన్న మాట 100% వాస్తవం. కానీ ఈ మాట ఎమ్మెల్యే ఎన్నికలకే వర్తిస్తుంది. ఎందుకంటే బలం లేని చోట పోటీ చేసి ఎమ్మెల్యే సీట్ ఓడిపోతే అక్కడ ప్రత్యర్థి పార్టీ గెలిస్తే మనం అధికారం కోల్పోవడానికి కారణం అవుతుంది.
కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ మాట వర్తించదు.
గతంలో ఏ లోకల్ బాడీ ఎలక్షన్ లు చూసినా
అధికారంలో ఉన్న పార్టీ గెలవడానికే 75% అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోయిన పార్టీలకి గాని ప్రభుత్వానికి కానీ పెద్ద నష్టం ఉండదు. ఆ ఓటమి ఎమ్మెల్యే ఎన్నికల మీద ప్రభావం చూపించదు.
గతంలో వైసీపీ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుని దౌర్జన్యాలు చేసి 90% గెలిచింది.
కానీ ఎమ్మెల్యే ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందిగా
కాబట్టి స్థానిక సంస్థల ఓటమికి ఎమ్మెల్యే ఎన్నికలకి సంబంధం ఉండదు.
పార్టీకి బలం ఉన్న లేకపోయినా కచ్చితంగా పోటీ చేయాలి.పోటీ చేసి గెలిస్తే బలం పెరుగుతుంది
ఓడిపోతే మనవాళ్ళకి రాజకీయ అనుభవం వస్తుంది.
ఓడిన గెలిచిన మన పార్టీకి మంచిదే.
ఒకవేళ ఓడిపోయిన.. జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయింది ఇతనే " అనే మాట ఎప్పటికీ నిలుస్తుంది.
గెలిచిన వాడి పేరుకి సమానంగా మన పేరు కూడా బలంగా వినిపిస్తుంది.
అధికారంలో ఉండి కూడా పోటీ చేయకపోతే అదే బలహీనత అవుతుంది
మనకు బలం లేని చోట టిడిపి కార్యవర్గం మనకు మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యే ఎన్నికలలో టిడిపి పార్టీకి మన మద్దతు ఇచ్చి గెలిపించాం.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి పార్టీ మనకు మద్దతు ఇచ్చి గెలిపించాలి.
అదేగా పొత్తుధర్మం అందుకేగా పొత్తు పెట్టుకుంది.
వాస్తవానికి మా ఊరిలో టిడిపి పార్టీ బలంగా ఉంటుంది
మా గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉన్నాయి.
పొత్తు ధర్మంలో భాగంగా మాకు అంటే మన జనసేన పార్టీకి నాలుగు వార్డులు.. ఉపసర్పంచి పదవి ఇవ్వాలని స్థానిక టిడిపి నాయకులని అడిగాను. అలాగే ఇస్తామని వాళ్లు ఒప్పుకున్నారు. ఇలా అధిష్టానం దాకా వెళ్లకుండా లోకల్ గా మనమే టిడిపి నాయకులతో మాట్లాడుకుని ఒప్పించుకోవాలి. ఎక్కడైతే టిడిపి నాయకులు అలా ఇవ్వడానికి ఒప్పుకోరో.. అక్కడ కూటమి ఏర్పాటు చేసిన కమిటీ మాట్లాడి ఒప్పించాలి..
చివరిగా నేను చెప్పేది బలం ఉన్న లేకపోయినా కచ్చితంగా మనం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలి. గెలిచినా ఓడినా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో జనసేన నాయకులు ఉన్నారని ప్రజలకు తెలియజేయాలి.
ఇదేదో నేను నాదెండ్ల మనోహర్ గారి మాటకి వ్యతిరేకంగా చెప్పడం లేదు.
బలం అనేది బరిలోకి దిగితేనే తెలుస్తుంది..
ఓడిన గెలిచిన బరిలో ఉన్నాడనే మాట ఎప్పటికీ నిలుస్తుంది. జనసేన పార్టీ పుంజుకోవాలి బలం పెంచుకోవాలి ✊
జై జనసేన 🚩✊
జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరిక
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది,
ధర్మ పరిరక్షణకు మార్గం సుగమం, అధర్మ పాలన అంతం
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను
వ్యూహం నాకు వదిలేయండని @PawanKalyan గారు చెప్పిందే జరుగుద్ది
"పొత్తు గెలవాలి జగన్ పోవాలి" నినాదం నిజమౌతుంది!
@JanaSenaParty