మన దేశంలో ఒక రోజున బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి, అలాంటి పరిస్థితులు రావాలి.
పిల్లలు ఎదిగే వయసు నుండి ఐకమత్యంతో కలుపుగోలుతనంతో పెరగాలి.
జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
•జనసేన అనేది నిరంతర ప్రవాహంలా కళ కళ లాడాలి
•ఆంధ్రప్రదేశ్ కు భావి నాయకత్వం అందించే ప్రక్రియకు శ్రీకారం
•రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయి
•ఆ కుట్రలు చేస్తున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
•వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదు
•రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోను
•అన్ని కులాల ఆమోదంతోనే చరిత్ర సృష్టించగలం
•యువతకు ఉచితాలు కాదు.. గౌరవమైన జీవనం కావాలి
•జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు
•ప్రజాస్వామ్యయుతంగా జనసేన పార్టీ నిర్మాణం
•ప్రతి విషయంపైనా నాయకులు బలంగా మాట్లాడాల్సిందే
•జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన శ్రీ @PawanKalyan గారు
#jspmembershiptoleadership
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇలాంటి దుర్ఘటన జరిగిన ప్రతిసారి బాధ పడుతున్నాం కానీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ ఆడిట్లు జరపాలి ఇవన్నీ నిరంతర పహారా.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నేను ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశం అవుతాను.
#VizagSteelPlant #Visakhapatnam
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
ప్రమాద కారణాలపై అధికారులు, కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలు మరియు మానవ తప్పిదమే ఈ విషాదానికి కారణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు @Pallasrinivas4u గారు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు (3/6/2026, బుధవారం) సాయంత్రం 4 గం.30 నిమిషాలకు- రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనంలో అమరజీవికి నివాళులు అర్పిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
150 మందితో మొదలైన జనసేన ప్రస్థానం 22 లక్షల క్రియాశీలక సభ్యులతో బలంగా నిలిచింది.
రానున్న కాలంలో పార్టీని మరింత పటిష్టపరిచేలా అన్ని విభాగాల్లో కమిటీలు, బాధ్యతలు ఉండనున్నాయి.
పార్టీకి అండగా నిలిచి, పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కుతాయి.