Former Chief Minister and YSRCP President Sri Y.S. Jagan Mohan Reddy met Hon'ble Governor Sri S. Abdul Nazeer at Lok Bhavan on Sunday on a courtesy visit.
@ysjagan
BREAKING NEWS
అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న YSRCP పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు.
అభ్యర్థులకు భద్రత, పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు.
వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలన్న వైసీపీ.
స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై @ncbn నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రూరంగా చేసిన దాడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా చూసింది. స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలిరోజే వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాల దాడులతో పాటు, హత్య చేస్తామని బెదిరించడంతో పాటు, చివరకు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. ఇంత జరుగుతున్నా శాంతి భద్రతలను కాపాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాల్లో భాగస్వాములుగా కూడా మారారు. తమ విధులను నిర్వర్తించని పోలీసులు చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు.
పుంగనూరులో వైయస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన ఆయన వాహనశ్రేణిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశాయి. ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని గాయపరిచాయి. వాహనాలను ధ్వంసం చేశాయి. మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ కేంద్రం ప్రాంగణంలోనే పోలీసుల కళ్లెదుట ఇదంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా మా అభ్యర్థులను మూడు గంటలకు పైగా వేచి ఉంచిన అధికారులు వారి నామినేషన్ పత్రాలను మాత్రం స్వీకరించలేదు. లోక్‌సభలో మా పార్టీ పక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ఆశించగలం?
రాయచోటిలో మా అభ్యర్థులను నామినేషన్లు వేయవద్దంటూ బెదిరించారు. ఆ బెదిరింపులను లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో టీడీపీ గూండాలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై దాడి చేశాయి. పార్టీ కార్యాలయానికి, వాహనాలకు నిప్పుపెట్టాయి. మా కార్యకర్తలను గాయపరిచాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ పత్రాల తయారీ కోసం మా పార్టీ కార్యాలయంలో సమావేశమైన కార్యకర్తలనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మా పార్టీ కార్యాలయానికి నిప్పు పెడుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు.
తిరుపతిలో మా పార్టీ మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. మా నాయకులపై దాడులు చేశారు. ధర్మవరంలో పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. కడపలో 30వ డివిజన్ అభ్యర్థిని అడ్డుకోవడమే కాకుండా, రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాలను కూడా లాక్కుని చించివేశారు. అయినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పోలీసుల ఈ సిగ్గుమాలిన నిర్వాకంతో టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తెగబడుతున్నాయి. దాచేపల్లిలో మా నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి వాహనంలో మద్యం సీసాలు పెట్టి ఆయనను నామినేషన్ వేయకుండా నిర్బంధించారు.
ప్రభుత్వ యంత్రాంగం తన పార్టీ సొంత ఆస్తి కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. ఇలా హింస, దౌర్జన్యాలతో ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని టీడీపీ తిరిగి పొందలేదు. ఇలాంటి ప్రతి దాడి, ప్రజల పక్షాన నిలబడి, వారి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలన్న మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
వైయస్సార్సీపీ కార్యకర్తలందరికీ నేను అండగా నిలబడతాను. బెదిరింపులకు లొంగేది లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని వీడే ప్రసక్తే లేదు. ప్రతి ఘటనపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేయాలి. ఈ హింసకు సహకరించిన ప్రతి అధికారిని కూడా జవాబుదారీగా నిలబెట్టాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తక్షణమే జోక్యం చేసుకోవాలి. దాడులు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలి. కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలకు భద్రత కల్పించాలి. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోటీ చేసే పరిస్థితులు ఉండాలి. ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే వాతావరణం కల్పించాలి.
నామినేషన్ల దాఖలుకు కేంద్రీకృత విధానాన్ని లేదా పారదర్శకమైన, సురక్షితమైన ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసార ఫుటేజీ అందుబాటులో ఉంచాలి. బ్యాలెట్ బాక్సులను ట్యాంపరింగ్ చేయకుండా నిరోధించేందుకు అన్ని స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఉండాలి. అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ ప్రత్యక్ష ప్రసార పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. బ్యాలెట్ పేపర్ అకౌంట్లోని సంతకాలను సక్రమంగా పరిశీలించడంతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించాలి.
స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పారా మిలిటరీ బలగాలను రప్పించాలి.
2029 ఎన్నికల్లో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు.
2029 లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు.
మీరు చేసిన అన్నిటికి తిరిగి అప్పు ఇచ్చేస్తాం.
- పెద్దిరెడ్డి
రక్తం చిందింది, రాజీ పడలేదు.
మీరు రాళ్లు విసిరారు, పత్రాలు లాక్కున్నారు.
అయినా ప్రతి నామినేషన్ వేసి తీరతాం.
నా వాళ్లు గాయపడితే వెనక ఉండను, పక్కనే నడుస్తా.
గాయాలు మానుతాయి, ఈ దురాగతం ధర్మవరం మరువదు.
#Dharmavaram, #SaveDemocracy, #KutamiViolence, #YSRCP, #APMunicipalElections
ముఖం మీదే నీకు అయితే ఓటు వేయము అని చెప్తున్నా ప్రజలు. 🤣🤣
@JanaSenaParty కోసం నిలబడిన యువతకు టికెట్లు ఇవ్వకుండా, వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దాయన.
ఉన్న కొద్దిపాటి సీట్లు కూడా TDP వాళ్లకే ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. 🤡😂
RO చెప్పిన సమాధానం మాకు పై నుండి ఒత్తిడి ఉంది.
నామినేషన్ తీసుకోవడానికి కుదరదు అన్నారు.
ఇంతకన్నా నీచపు బ్రతుకు బ్రతకాల్సిన అంత అవసరం ఏమి ఉంది.
అక్కడ అంత దాడికి దిగజారింది టిడిపి.
- మిథున్ రెడ్డి
ఒంగోలు జనసముద్రమైంది!🔥💥🥵
దారి పొడవునా బ్రహ్మరథం పట్టిన అభిమానం.📈📈
ఇంతమంది వస్తారని ఎవరూ ఊహించి ఉండరు!⚡⚡
ఒంగోలు గడ్డ.. జగన్ అన్న అడ్డా!🔥💥🥵
దారి పొడవునా అడుగు తీసి అడుగు వేయలేనంత జనసముద్రం!🤯🤯
ఈ అభిమానం, ఈ ఆప్యాయత ఊహలకి అందనంత... 🦁👑
#Ongole#JaganAnna #JanaSrambham #YSRCP #OngoleWave #JaganWithPeople #MassEuphoria #KakumanuRajasekhar