Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అనుసంధాన వేదికే 'జగన్ 2.0 సూపర్ యాప్'
జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి...
౼ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి...
౼ పార్టీ శ్రేణులతో కలసి 'Jagan 2.0 Super app' ను ఆవిష్కరణ..
మహిళా విద్యార్థినుల భద్రతలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం
అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగభూషణం గారికి వినతిపత్రం సమర్పించిన విద్యార్థి నాయకులు
– వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్
#YSRSU #JaganannaConnects
రైతుల కోసం పోరాడితే కేసులా...?
ప్రశ్నిస్తే 'రౌడీ షీటర్' ముద్రా...?
ఇదేనా కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలన?
- పానుగంటి చైతన్య మీద ఆధారాలు లేకుండా రౌడీ అని ముద్ర వేయడం పాత్రికేయ బాధ్యత కాదు.
- ప్రశ్నిస్తానన్న వ్యక్తి... ఇప్పుడు ప్రశ్నించే వారినే చూస్తూ మౌనంగా ఉండటం బాధాకరం.
- ప్రశ్న అడిగినోడు నేరస్థుడు... తప్పు చేసినోడు పాలకుడు అన్నట్టుంది.
- నోటికి నెయ్యి, చేతికి కత్తి అన్నట్టుంది కూటమి ప్రభుత్వం.
- కుర్చీ కోసం చెప్పిన మాటలు కుర్చీ వచ్చాక గాలికి వదిలేశారు.
- పొలంలో పంట లేదు... రైతుల కంట్లో కన్నీటి పంట ఉంది
- అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నలు సెలవుకెళ్లాయా?" పవన్ గారు
- ప్రశ్నిస్తే కేసు... మాట్లాడితే బెదిరింపు... ఇదేనా ప్రజాస్వామ్యం?
ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి... ప్రతీకారం కాదు.
అనంతపురం:
అమరావతి రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులకు పాల్పడటం, అనంతరం వారిపైనే కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవీన్ రెడ్డి, విజయ్ రెడ్డి పాల్గొన్ని మాట్లాడారు
రైతుల కోసం గళమెత్తిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పై కేసు నమోదు చేయడమే కాకుండా, అధికారానికి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఆయనను "రౌడీ షీటర్"గా ప్రచారం చేశాయని ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై రౌడీ షీట్ నమోదైందని అధికారికంగా ఎక్కడా నిర్ధారణ లేకపోయినా, అలాంటి ముద్ర వేయడం మీడియా నైతిక విలువలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే 'రౌడీ', రైతుల పక్షాన నిలిస్తే 'నేరస్థుడు' అనే ముద్ర వేయడమే ఇప్పుడు కొత్త పాలనా విధానమా? ఇదేనా నారా లోకేష్ చెప్పే సుపరిపాలన? ఇదేనా పవన్ కళ్యాణ్ కలల ఆంధ్రప్రదేశ్? అని ఎద్దేవా చేశారు.
మంత్రి నారా లోకేష్ విద్యా సంస్కరణల పేరుతో సభల్లో గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు కనీస సౌకర్యాల లేమి, హాస్టళ్ల దుస్థితి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై నెలకొన్న అనిశ్చితి వంటి సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందన్నారు. ప్రశ్నించే గొంతుకగా వస్తానన్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వారినే మౌనం చేయడాన్ని చూస్తూ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని రైతులపై దాడులు జరిగినప్పుడు ఆయన గొంతు ఎందుకు వినిపించడం లేదు? విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు మీరు మాపై "కేసులు పెట్టొచ్చు... కానీ గొంతులు నొక్కలేరని "రైతు కోసం, విద్యార్థి కోసం మాట్లాడటం నేరమైతే... ఆ నేరం మేము మళ్లీ మళ్లీ చేస్తామని "పోరాటం మా వైస్సార్సీపీ రక్తంలో ఉందని తెలియజేసారు
వైస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నగర అధ్యక్షులు కైలాష్ మాట్లాడుతూ పుస్తకాలు లేవు... ఉపాధ్యాయులు లేరు... ఉద్యోగాలపై స్పష్టత లేదు... కానీ ప్రచారంలో మాత్రం విద్యా విప్లవం అంటున్నారు. ఇది విద్యా సంస్కరణా? లేక ప్రభుత్వ విద్యపై ప్రయోగాలా? అని నిలదీశారు.
రైతుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా, రైతులకు అండగా నిలిచిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వం అసహనానికి నిదర్శనమన్నారు. రైతును కాపాడాల్సిన ప్రభుత్వం రైతు తరఫున మాట్లాడిన వారినే లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైతులు, యువత, విద్యార్థుల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అని నిలదీశారు.
"రెడ్ బుక్" అంటే చట్టం కంటే పైచేయి సాధించే పుస్తకమా? లేక అధికారాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టే మార్గదర్శకమా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల తరఫున పోరాడే నాయకులను అణచివేసే ప్రయత్నాలు ఎంత చేసినా వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. కేసులతో భయపెట్టవచ్చు... కానీ ప్రజల గొంతును అణిచివేయలేరు. రైతులు, విద్యార్థులు, యువత తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, నవీన్, హరీష్, అశోక్,బబ్లు, బాబా ఇమ్రాన్, రఫీ, చరణ్, ఫయాజ్, మధు, రఘు, శేఖర్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
పానుగంటి చైతన్య గారి మీద అక్రమ కేసుని ఖండించిన వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం
అమరావతి రైతులను పరామర్శించిన నేతలపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం — వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్
- తప్పుడు ప్రచారాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీడియా
- పానుగంటి చైతన్యను "రౌడీ షీటర్"గా చిత్రీకరిస్తూ, ఆయనపై A1గా కేసు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపు చర్య.
- విద్యార్ధి సమస్యలు పరిష్కారం చూపక ప్రశ్నించే వారిమీద కేసులా?
- రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే దాడులు కేసులు
అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, అలాగే వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యపై కేసులు నమోదు చేయడాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను పరామర్శించడం, వారి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్న హక్కు అని అన్నారు. అలాంటి సందర్భంలో పానుగంటి చైతన్యను "రౌడీ షీటర్"గా చిత్రీకరిస్తూ, ఆయనపై A1గా కేసు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపు చర్యగా కనిపిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సంబంధిత అధికారులను కోరారు.
విద్యార్ధి నాయకుడు చైతన్య గారిని రౌడీ షీటర్‌గా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ప్రభుత్వం చట్టాన్ని అందరికీ ఒకే విధంగా అమలు చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంఅమలు చేస్తూ రాజకీయ భేదాభిప్రాయాల కారణంగా ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తీసుకురావడం సరైన విధానం కాదని .
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము రైతులకు అండగా ఉంటాం. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను ఎప్పటికీ వ్యతిరేకిస్తామని తెలియజేశారు
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
అనంతపురంలో @YSRCParty youth & స్టూడెంట్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన..
- కలెక్టరేట్ ఎదుట ఆందోళన
– విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
– ప్రభుత్వ పాఠశాలల్లో అటకెక్కిన నాడు–నేడు పనులు
– కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న నారా లోకేష్
#ysjagan#atp#ysr
APSRTC ఇంచార్జ్ RM గారికి YSRSU ఆధ్వర్యంలో వినతిపత్రం
అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తగిన బస్సు సౌకర్యం కల్పించవలెనని వినతి.
జిల్లా వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలి.
@_Ysrkutumbam@AKYOnline@JaganannaCNCTS@ysjagan
అనంతపురం:-
గ్రామీణ ప్రాంత విద్యార్థుల బస్సు కష్టాలు పట్టవా మంత్రి @naralokesh ?
జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని @YSRCPStudtWing అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు.
ఈ మేరకు @apsrtc ఇంచార్జ్ ప్రాంతీయ మేనేజర్ కె. శ్రీలక్ష్మి కి వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో జిల్లా RTC కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి కొత్త సర్వీసులు ప్రారంభించాలని,విద్యార్థులు రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు ట్రిప్పులు నడపాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని APSRTC ప్రాంతీయ మేనేజర్ ని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేక విద్యార్థులు ప్రతిరోజూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సంక్షేమం కంటే ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఒకవైపు విద్యార్థులపై ఆర్థిక భారం పెంచుతూ, మరోవైపు కనీస రవాణా సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు.
కార్యక్రమంలో వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, నగర అధ్యక్షులు కైలాష్ ఉపాధ్యక్షులు అంజన్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, హరీష్,చరణ్, ప్రశాంత్, బబ్లు, బాబాఇమ్రాన్, చరణ్, రియాజ్, మనోజ్, ప్రదీప్, నివాస్,శారీక్, ఫయాజ్, సోహెబ్, రఫీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
#YSRCPStudentWing #YSRCP #JaganannaCOnnects
*బడి ప్రారంభం రోజే విద్యా కానుక ఇవ్వలేరా?*
- *ప్రభుత్వ విద్యార్థుల మీద కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు?*
- *గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో స్కూల్ మొదటి రోజే విద్యా కానుక పంపిణి*
- *జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన వైస్సార్సీపీ విద్యార్ధి, యువజన నాయకులు*
- *ప్రభుత్వ విద్యని నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వం*
- *కార్పొరేట్ విద్యకి కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యకి తూట్లు పొడుస్తున్న కూటమి సర్కారు*
*అనంతపురం/15-06-2026*
*ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే విద్యా సామగ్రిని అందించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం విడాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన, విద్యార్ధి నాయకులు జిల్లా కలెక్టర్ ఆనంద్ కి వినతిపత్రం అందజేశారు.*
*ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలో పేద విద్యార్థులు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు,యూనిఫాంలు, షూస్,సాక్స్, బెల్ట్‌లు, ఇంగ్లీష్–తెలుగు నిఘంటువులు,వర్క్‌బుక్స్ వంటి కనీస అవసరాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇద నిదర్శనమని మండిపడ్డారు.*
*గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అన్న విద్యా కానుక ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు సమయానికి అందించారన్నారు.సీయంగా జగన్ పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించారని గుర్తు చేశారు. నేడు ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.*
*మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యతను పక్కనపెట్టి,విద్యార్థుల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేయాల్సిన సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ, పేద విద్యార్థులను మరింత ఇబ్బందులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.*
*డిజిటల్ యుగంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి, నాణ్యమైన ఐబీ సిలబస్ ఆధారిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యను హక్కుగా కాకుండా భారంగా మార్చే విధానాలను వెంటనే విరమించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.*
*అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ ప్రయోగాలు చేయొద్దని హితవు పలికారు. , వెంటనే విద్యా కానుక ను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.*
*ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు శ్రీనివాస్ గురుదత్త, ఉపాధ్యక్షులు ఉదయ్,వినీత్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇండ్ల విజయ్ కుమార్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, నగర అధ్యక్షులు కైలాష్ నాయకులు నంద కిషోర్,సాయి,పులి కార్తికేయ,గౌరీ శంకర్, శారీక్,లోకేష్,రాహుల్ రెడ్డి, శివ,రఫీ,ఫయాజ్,గంగ శివుడు, రాఘవ తదితరులు పాల్గొన్నారు
పైసా పేక్ తమాషా దేఖ్ అన్న చందంలో మెగా డీఎస్సీ : YSRSU
- అంబేద్కర్ విగ్రహం వద్ద ఊరితాడులతో విద్యార్ధి నాయకుల నిరసన
- DSC నిర్వహణ మీద సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్
- మంత్రి నారాలోకేష్ ని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలి
- DSC అభ్యర్థుల్లో దగా పడిన వారికీ న్యాయం చేయాలి
- కూటమి ప్రభుత్వం కాదు ఇది,కుట్రల ప్రభుత్వం ఇది
అనంతపురం/ 29-05-2026
కూటమి ప్రభుత్వం నిర్వహించిన “మెగా DSC” పూర్తిగా అవ్యవస్థలకు, అనుమానాలకు కేంద్రబిందువుగా మారిందని వైస్సార్సీపీ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంకి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర రెడ్డి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ,డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన గందరగోళం,అభ్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలు,టెక్నికల్ సమస్యలు అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
“మెగా DSC” పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని, ఇది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కాదు… యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న రాజకీయ నాటకమని వారు విమర్శించారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేష్ బర్త్ రఫ్ రాజకీయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని వారు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై సమాధానం చెప్పాల్సిన మంత్రి… విమర్శలు వస్తే బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ ప్రతీకారాలతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. మెగా DSCలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవీన్ రెడ్డి, విజయ్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాశీరాం నాయక్, రాష్ట్ర నాయకులు సుధీర్ రెడ్డి, షెక్ష జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రాయల్, మంజునాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు నిషాంత్ రెడ్డి, అశోక్,గంగ శివుడు, సాయి నితిన్, నాగరాజు గౌడ్ నియోజకవర్గ అధ్యక్షులు కైలాష్, రేవంత్ రెడ్డి,అజయ్, కాశీ మనోజ్, సాకే పురుషోత్తం నగర ఉపాధ్యక్షులు అంజన్ రెడ్డి,శివ దత్తాత్రేయ నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, రాహుల్ రెడ్డి,మనోజ్, హరీష్, చరణ్,ప్రకాష్, సాయి రెడ్డి షరీఫ్,గన, నవీన్,బాబా ఇమ్రాన్,దినేష్, రియాజ్, సుబ్బు, తరుణ్, లోకేష్, సురేంద్ర, ప్రసాద్,అరుణ్,రఫీ, కార్తీక్ నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అనంతపురం జిల్లా వైస్సార్సీపీ విద్యార్ధి విభాగంఅధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి విద్యార్థుల సమస్యలపై చర్చించారు.
@YSRCParty@JaganannaCNCTS@we_ysrcp@_Ysrkutumbam@YSRStudentUnion