ల్యాప్‌టాప్ టెండర్ల పేరుతో రాష్ట్ర విద్యాశాఖ రూ. 112 కోట్ల భారీ అవినీతికి తెరలేపిందని.. రాష్ట్రంలోని 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లకు 27,672 ల్యాప్‌టాప్‌ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. శాన్‌బే 70 శాతం, సెల్‌కాన్‌కు 30 శాతం ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసేలా ప్రభుత్వం టెండర్లను కట్టబెట్టిందని, చంద్రబాబు సర్కారు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను తుంగలో తొక్కిందని.. బహిరంగ మార్కెట్లో రూ. 45 వేల నుంచి రూ.50 వేలకు దొరికే ల్యాప్‌టాప్‌ను ఏకంగా రూ. 89 వేలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుందని, ఒక్కో ల్యాప్‌టాప్ మీద ఏకంగా రూ. 40 వేల వరకు అదనంగా చెల్లిస్తూ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారు.
-రవిచంద్ర గారు, వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
జననేత జగన్ అన్న జన్మ దినం పురస్కరించుకొని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవి చంద్ర ఆధ్వర్యం లో స్థానికంగా ఉన్న ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#JaganannaConnects#HappyBirthdayYSJagan#Ysrstudentunion#YSRCP
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను లోక్ భవన్ కి తరలిస్తున్న సందర్భంగా తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయం వద్ద మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర.
#savemedicalcollegeInAP#Ysrstudentunion
పిల్లల స్కూల్ బ్యాగుల్లోనూ భారీ అవినీతి
- కమీషన్ల కోసం విద్యార్థి మిత్ర పథకాన్ని వాడుకున్నారు
- అవినీతిమయంగా మార్చి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ని అవమానించారు
: వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఆగ్రహం.
#Ysrcongressparty#Ysrstudentunion
ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని ర్యాలీగా వచ్చిన విద్యార్థులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. మా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్యను, పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పలు స్టేషన్లు తిప్పుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా అయితే పేద విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు? ప్రశ్నిస్తే చంద్రబాబు ఫాసిస్ట్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేస్తోంది.
-రవిచంద్ర గారు, వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్
#YSRCPForStudents
#SadistChandraBabu
పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోంది కూటమి ప్రభుత్వం. విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని కోరితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల కోసం వైయస్ఆర్ సీపీ ఉద్యమ బాటపడుతుంది.
-లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ
#YSRCPForStudents
#SadistChandraBabu
గుంటూరు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్యగారి పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించమని నిరసన తెలిపినందుకు పానుగంటి చైతన్య పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
పానుగంటి చైతన్యతో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేసి మంగళగిరి కోర్టులో హాజరు పరిచిన తాడేపల్లి పోలీసులు
పానుగంటి చైతన్యకు 14 రోజులు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
మిగిలిన నలుగురు విద్యార్థి విభాగ నాయకులకు 41A ప్రొసీజర్ కావాలని ఆదేశించిన కోర్టు
...ఫీజుల అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే విదేశాల్లో విద్యాశాఖ మంత్రి .
....ఫీజు బకాయిలు 7,800 కోట్లు ఇచ్చేంత వరకు ఉద్యమిస్తాం.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర.
#Ysrstudentunion#Ysrcongressparty#Ysrcp
ఫీజు బకాయిలకై వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ.
...అడ్డుకుని అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు.
...దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి 8 మంది విద్యార్థి నేతల తరలింపు.
..సాంఘీక సంక్షేమ కార్యాలయం వరకు భారీ ర్యాలీ అడ్డగించిన పోలీసులు.
#jaganannaconnects