ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో!
Here's the Title & a small glimpse of JanaSenani Sri @PawanKalyan's birthday CDP.
Full CDP on Sunday, August 27th at 6:45 PM 💣
Requesting everyone to donate for a better society - https://t.co/qUXn065D1o
#JanaSenaniBdayCDPGlimpse
తాటి వనం… తీరానికి రక్షణ కవచం
• గ్రేట్ గ్రీన్ వాల్ రెండో అంచెలో తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు
• తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం
• 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యం
• సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి గింజలు సేకరించిన అటవీ శాఖ
• తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి పిలుపు
సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గ్రేట్ గ్రీన్ వాల్ సంకల్పంలో కీలకమైన తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యింది. తాటి కాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రకృతి విపత్తుల సమయంలో గాలి నిరోధక వ్యవస్థగా తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పించనున్నాయి. మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు ప్రక్రియలో తాటి వనాల ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఉప్పు నీరు, హోరు గాలులతో ఉండే తీర ప్రాంతాల కఠిన వాతావరణ పరిస్థితులకు తాటి చెట్టు అత్యంత అనుకూలమైన వృక్ష జాతి. ఉప్పు నేలలు, ఇసుక, బుసకతో కూడిన తీర ప్రాంత ఒండ్రు నేలల్లో సైతం పెరిగే సామర్థ్యం తాటి చెట్టుకు ఉంది. ఎత్తుగా పెరిగే జాతి కావడంతో బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా పని చేస్తుంది. అంతే కాదు బలమైన తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉండడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుంది. పక్షులు, కొన్ని రకాల సరిసృపాలకు ఆవాసంగా ఉండే తాటి చెట్లు జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉంటాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తట్టుకోగల శక్తి తాటి చెట్టు సొంతం. అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళికల్లో మొదటి అంచె మడ అడవులకు, రెండో అంచె తాటి వనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో తాటి వనాల ఏర్పాటును లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రతిపాదించారు. అందుకు దాదాపు 55 లక్షల తాటి గింజలు అవసరం అవుతాయని అటవీ శాఖ భావిస్తోంది. ఈ ఏడాది తాటి కాయల సీజన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రజలు, వివిధ వ్యవస్థల భాగస్వామ్యంతో 13 లక్షల తాటి గింజలు సేకరించారు. ఇప్పటికే 1 లక్ష 65 వేల తాటి గింజలను పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, స్కూలు విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో నాటే ప్రక్రియను రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఈ సీజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
తాటి గింజల సేకరణ, నాటడం, తాటి మొక్కల పెంపకం వంటి అంశాల్లో రాష్ట్ర అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు. మొలకెత్తే తాటి మొక్కల స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని, మొలకెత్తిన మొక్కల పైకి పశువులను తోలడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సహజ సంపదను కాపాడుకునే చర్యల్లో అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాల వెంబడి అనుకూల ప్రదేశాల్లో శాస్త్రీయ పద్ధతిలో తాటి గింజలు నాటాలని పేర్కొన్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్తోపాటు 50 శాతం గ్రీన్ కవర్, పర్యావరణ పునరుద్ధరణ, రాష్ట్రంలో సహజ వనరుల పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
"అడవితల్లి బాట" చలిసింగం గిరిజన గ్రామానికి మొదటి సారి రోడ్డు త్వరలో అంబులెన్స్ కూత 💥✊
దశాబ్దాల నుండ డోలీలతో వెళ్తున్న గ్రామానికి 2 కోట్ల 60 లక్షలతో 3 KM రోడ్డు @PawanKalyan గారు నేతృత్వంలో రోడ్డు!!
As an MP, Basic protocol means acknowledging those who initiated and sanctioned and launched the project.
If it was started under @PawanKalyan ’s leadership, giving due credit is simple respect.
Claiming it as your own is neither protocol nor courtesy.
Pulivendula #MegaWaterGrid Revived
• @PawanKalyan ’s initiative brings ₹280 crore funding.
• 96% project work & 99% pipeline work completed.
• 1,106 km of pipelines laid.
• Moving towards a permanent solution to drinking water woes.
*పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం*
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
ఆధ్యాత్మిక ప్రగతి దారులు
•100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం
•రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు
•ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ
•వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు
•శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు
•నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో భక్తులకి సౌకర్యం
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యవయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
(1/3)
ఆధ్యాత్మిక ప్రగతి దారులు
•100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం
•రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు
•ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ
•వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు
•శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు
•నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తులకి సౌకర్యం
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది గానీ, వారికి సరిపడ రోడ్డు సౌకర్యం మెరుగుపడడం లేదన్న అంశం ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో అలాంటి ఎన్నో ఆలయాలు ఆయన కంట పడ్డాయి. కొన్ని ఆలయాల దుస్థితిని ప్రజలు వినతపత్రాల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో దేవుని దర్శనానికి వెళ్లే దారి లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 100కు పైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల పొడుగున రోడ్లతో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రాం జీ, సాస్కీ తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి, పంట పొలాలకు వెళ్లే మార్గాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన గుడి బాట పనులు అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారుల్లో 26 నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారులకి సంబంధించిన పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. అందులో ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూలన ఉన్న ఆలయాలు దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని సింగిరికోన, సోమేశ్వరం తలుపులమ్మలోవ మార్గం, ఐ.ఎస్ జగన్నాథపురం ఘాట్ రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ. 3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు తెనాలి, రాయచోటి తదితర నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్లు, నిడదవోలులో ఆంజనేయస్వామి రోడ్డు, పూతలపట్టు నియోజకవర్గం తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయం తదితర రహదారుల పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రోడ్లు సైతం వివిధ దశల్లో సనులు కొనసాగుతున్నాయి. పుణ్య క్షేత్రాలకు వెళ్ళే రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నిర్మించే రోడ్లు భక్తులకు సుదీర్ఘ కాలం ఉపయోగపడాలని సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయాల రోడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులకి తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సంకల్పంతో భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.
100 కు పైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం.
రూ. 120 కోట్లతో 205 కి.మీ.ల మేర ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.
Young Minds, Inspiring Creativity
During my visit to the World Elephant Day event, I was truly delighted to see the wonderful paintings and artworks created by our young students.
More than 20 lakh students from 21,450 schools across India participated in the World Elephant Day campaign. Out of which nearly 31,000 students participated in the painting competition. Each painting reflected a unique imagination, a deep love for elephants and wildlife, and a beautiful message of conservation. I sincerely appreciate every student who participated and brought their creativity and passion for nature to this initiative. Every young artist deserves appreciation for giving conservation a voice through art.
It was especially heartening to see students from Andhra Pradesh among the winners. In the Junior Category (Classes 6–8), B. Tanvi Praveetha, Plakshita and G. Niharika, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
In the Senior Category (Classes 9–12), S.V.L.N. K. Sharvani, M. Lavanya and S. Sneha Ratna, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
At the National Level, Ujaan B.D.M. Chattopadhyay, Aditi Behera and Harithparans J.H. secured the 1st, 2nd and 3rd positions respectively.
My heartfelt congratulations to all the winners. Your creativity has beautifully captured the spirit of elephant conservation and shown us the power of young minds.
When children create for nature, they inspire a future that cares for it.
- @PawanKalyan@PMOIndia@moefcc@AndhraPradeshCM@APFDOfficial@HANUMAN_APGOV@PIB_India@IPR_AP@pibvijayawada
#WorldElephantDay2026
Your local boy wins BEST ACTOR award in Mumbai for Sivarapalli at the NEXA streaming awards
To My Parents,
To My Dearest Co Power cults,
To My Well Wishers,
Thank you for the love & support you have given me every time. I hope I'll make all of you proud, day by day.
Dedicating this BEST ACTOR AWARD to my parents and my OG @PawanKalyan Sir. ❤️
ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ఉపశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG