స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. అభ్యర్థులు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఈ రెండేళ్లలో రూ. 1.46 లక్షల కోట్లతో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి.
హిందూ సంప్రదాయంలో రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) మరియు వేప చెట్టు (నింబ వృక్షం)లను ఒకే చోట కలిపి నాటడం, వాటికి కళ్యాణం జరిపించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ జంట వృక్షాలను పూజించడం వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. AP GREEN Executive Committee Chairperson గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా మొదటి కార్యక్రమంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని సతీసమేతంగా నిర్వహించిన MLC @NagaBabuOffl గారు.
• ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
లక్ష్మీనారాయణుల రూపం:
రావి చెట్టు: పురుష శక్త్యత్మకమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పరిగణించబడుతుంది (రావి చెట్టు మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు కొలువై ఉంటారని నమ్మకం).
వేప చెట్టు: స్త్రీ శక్త్యత్మకమైన శ్రీ మహాలక్ష్మి లేదా గౌరీ దేవి / శక్తి స్వరూపంగా పూజిస్తారు.
ఈ రెండింటినీ కలిపి పెంచి వివాహం జరిపించడం (అశ్వత్థ కళ్యాణం) వల్ల లక్ష్మీనారాయణులను ఒకే చోట ఆరాధించిన ఫలితం దక్కుతుంది.
• ఆరోగ్య మరియు శాస్త్రీయ ప్రయోజనాలు:
స్వచ్ఛమైన ప్రాణవాయువు: రావి చెట్టు నిరంతరం (రాత్రి వేళల్లో కూడా) విస్తారంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
రోగనిరోధక శక్తి: వేప చెట్టు సహజ సిద్ధమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.
పరిశుద్ధమైన గాలి: ఈ రెండు చెట్లు కలిసి ఉన్న చోట వీచే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమై, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
#APGREEN
గత ప్రభుత్వానికి నరకడం తప్ప... నాటే ఆలోచనే రాలేదు
•కూటమిది నరికే సంస్కృతి కాదు... నాటే సంస్కృతి
•భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత
•ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం “అశ్వత్థ నారాయణ వివాహం”
•అరణ్యారామంలో రావి–వేప మొక్కలు నాటిన శ్రీ నాగబాబు దంపతులు
•ప్రకృతి సంరక్షణలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి
•రావి, వేప మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు, సతీమణి శ్రీమతి పద్మజ గారు కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి ఎన్నో వనరులను భూమాత నుంచే పొందుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు పెట్టే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదే. అలాంటి భూమాతకు తిరిగి మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అడవులను నరికి వేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నాం. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యం.
*ప్రకృతి పరిరక్షణకు... అశ్వత్థ నారాయణ వివాహం*
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం సంప్రదాయం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీక. రావి, వేప చెట్లను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించడం మన సంస్కృతిలో ప్రకృతికి ఇచ్చిన విశిష్ట స్థానం. రావి, వేప చెట్లు కలిసి పెరగడం ద్వారా పచ్చని పరిసరాల ఏర్పాటుకు, స్వచ్ఛమైన వాతావరణానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది. ఈ చెట్లు దాదాపు 250 జీవరాశులకు ఆవాసంగా మారి, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
*ఆ ఆలోచనే మమ్మల్ని కలిపింది*
ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు మొక్క నాటడం నా అలవాటు. ప్రకృతిని ప్రేమించడంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి, నాకూ ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు పర్యావరణంపై ఆయనకున్న నిబద్ధత నాకు స్పష్టంగా తెలిసింది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే మమ్మల్ని ఇలా ఒకే వేదికపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలోని వారికి చెట్లను నరకడమే తప్ప, నాటాలనే ఆలోచనే వాళ్లకు రాలేదు. ఏ కార్యక్రమం చేసినా అడ్డువచ్చిన చెట్లను నరుక్కుంటూ పోయారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కెన్యా వంటి దేశాలే అడవులకు, వన్యప్రాణులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరి జ్ఞానానికి పురిటిగడ్డ అయిన మన భారతదేశం, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరణ్యారామం డిజైన్లు పరిశీలించిన శ్రీ నాగబాబు గారు
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ₹24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అరణ్యారామం' భవన డిజైన్లను శ్రీ నాగబాబు గారు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ శ్రీ పి.వి. చలపతిరావు గారు శ్రీ నాగబాబు గారికి వివరించారు. అలాగే తాడేపల్లి పరిధిలోని అటవీ ప్రాంత వివరాలను తెలియజేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వృథాగా నరికేయకుండా, వేరే చోట విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ విధంగా వేరే చోట నాటిన చెట్లను శ్రీ నాగబాబు గారు స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు శ్రీ వై. శ్రీనివాసరెడ్డి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, డిఎఫ్ఓ గుంటూరు శ్రీమతి హిమశైలజ పాల్గొన్నారు.
#RakshaBandhan
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..!
అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినం సందర్భంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థతో పెనవేసుకున్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు ఓ భావోద్వేగపూరిత సంకేతం. సోదర భావాన్ని, మహిళలకు గౌరవాన్ని, భరోసాని అందించే పండుగ.
రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఇప్పటికే దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డోలీ రహిత గిరిజన గ్రామాల కల సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే 426 గిరిజన ఆవాసాలను రోడ్లతో అనుసంధానించడమైనది. అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా ఈ రోడ్లను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టాం.
గిరిజన మహిళల్లో కనిపించే జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షణ కల్పించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాము. ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారత దిశగా ముందుకు వెళ్తామని రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియచేస్తున్నాము.
- Hon'ble Andhra Pradesh Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan
దశాబ్దాల నుండి డోలీలతో వెళ్తున్న చలిసింగం గిరిజనుల కష్టాలు అడవితల్లి బాటతో తీరనున్నాయి.
2 కోట్ల 60 లక్షలతో 3 KM రోడ్డు @PawanKalyan గారు నేతృత్వంలో..
6 నెలలు నుంచి పరిగెడుతున్న పనులు మరొక నెలలో పూర్తి కానున్నాయి.
మొదటి సారి రోడ్డు అంబులెన్స్ కూత!!
అనకాపల్లి జిల్లా,చలిసింగం!!
Happy Birthday daddy!❤️
You’ve always been my greatest inspiration and someone I’ll forever look up to.
Thank you for always inspiring us and being our
constant pillar of strength.
Love you so much my Megastar!😘
@KChiruTweets
Planting trees on the occasion of Annayya’s birthday felt truly happy and meaningful. Instead of celebrating with something temporary, planting a tree is a beautiful way to create something that grows, gives life, and benefits everyone for years to come.
I believe everyone should plant a tree on the occasion of their loved ones’ birthdays. It’s a small gesture today that leaves a lasting gift for tomorrow. 🌳
Happy Birthday, Annayya! ❤️May your legacy continue to grow and inspire, just like these trees. @KChiruTweets
SIIMA 2026 🔥
The combination of @Sujeethsign’s vision and @PawanKalyan’s powerful screen presence deserves all the recognition!
🏆 Vote for Sujeeth - Best Director
🏆 Vote for Pawan Kalyan - Best Actor
Let’s make our support count! 🔥
👉 https://t.co/e5f8dtSzmU
#SIIMA2026 #Sujeeth #PawanKalyan #TheyCallHimOG
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల నియామకానికి మరికొద్ది వారాల సమయం
ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ సంస్థాగత కమిటీల జాబితాను సమీక్షించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను, ఆయన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్న కమిటీ బృందం పరిశీలించిన అనంతరం సమర్పించిన జాబితాలో అవసరమైన పలు మార్పులు, సవరణలు చేయాలని నిర్ణయించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీరమహిళకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కేలా ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు.
#JSPMembershipToLeadership
On this Independence Day, let us cherish the freedom we are blessed with, remember those who sacrificed for our nation, and renew our collective commitment to India’s unity, integrity, progress and prosperity.
Celebrating the Spirit of Freedom. Honouring the Legacy of Nation Builders. Building the Future of Bharat. Let every citizen contribute towards a stronger and brighter Bharat. Jai Hind
#IndependenceDay #80thIndependenceDay
DCM #PawanKalyan at 80th Independence Day celebrations.
Under #AdaviTalliBata' we took up road construction of 2,310 km worth ₹2,078 Cr. 905 km of roads are already completed.!!
#IndependenceDay#PawanKalyanAneNenu
The Real Independence for AndhraPradesh ft. Sri Pawan Kalyan - A True Patriot 🇮🇳
An exclusive video showcasing how Sri @PawanKalyan is transforming lives, empowering the voiceless, bringing governance & opportunities to those who need them the most..
పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు
• శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో భాగమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
On Partition Horrors Remembrance Day, we pause to remember the millions whose lives were profoundly changed by the Partition of 1947.
Homes were left behind, families were separated, communities were displaced, and countless lives were marked by pain and uncertainty. Yet, through those darkest moments, people displayed extraordinary courage, resilience and humanity.
Remembering this chapter of our history is not about carrying its divisions forward. It is about carrying its lessons forward.
Let the memories of those who suffered strengthen our commitment to unity, harmony, peace and the shared spirit of Bharat.
We remember the past with respect.
We honour those who endured it.
And we build tomorrow together.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#PartitionHorrorsRemembranceDay #Bharat