భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తికి జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు.
#ChakaliIlammaJayanthi#JanaSenaTelangana#JSPForTelangana
The Indian Railways network is set for a major transformation with five multitracking projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity. This will mean faster passenger movement, smoother operations, stronger freight connectivity and new possibilities for growth.
For Andhra Pradesh, the Arakkonam–Renigunta 3rd & 4th Line is particularly significant. It will strengthen connectivity to Tirupati and the Rayalaseema region, ease congestion and give a major boost to tourism, trade, logistics and regional development.
My heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw Ji for their continued support to Andhra Pradesh and their unwavering commitment to strengthening the State’s infrastructure.
Across Andhra Pradesh, Tamil Nadu, Karnataka and Telangana, these projects will connect 17 districts, 2,121 villages and nearly 52 lakh people, while creating additional freight capacity of 47 MTPA.
Every new track is more than infrastructure. It connects people to opportunity, businesses to markets and communities to a faster, stronger future.
Stronger Railways. Stronger Connectivity. A Stronger Bharat.
- @PawanKalyan@PMOIndia@RailMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పరామర్శ
• పార్టీ తరఫున రూ 5 లక్షల ఆర్థిక సహాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బెండమూర్లంక గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన జనసైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బుధవారం సాయంత్రం పరామర్శించారు.
ముందుగా శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం ఆ జన సైనికుడు చేసిన సేవలను స్మరించుకుంటూ, తన జేబుపై ధరించిన పార్టీ బ్యాడ్జ్‌ను గౌరవ సూచకంగా తీసి ప్రేమ్ కుమార్ చిత్రపటం ముందు ఉంచి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అనంతరం ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. శ్రీ ప్రేమ్ కుమార్ లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మాటలతో తీర్చడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చింతిస్తున్నారు అని తెలిపారు.
•పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున మృతుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని పార్టీ తన సొంత కుటుంబంగానే భావిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముకలాంటి వారని, వారి కష్టసుఖాల్లో వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవడం జనసేన పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
(శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ పోస్టుకి అనువాదం)
జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
- ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి @narendramodi గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వార నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని.
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అభిమానులు నా పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీతో ఉన్న ఈ అనుబంధం నాకు ఎంతో విలువైనది.
మీరు అందించిన శుభాకాంక్షలను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. అదే సమయంలో, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను.
మీరు చూపే అభిమానం నాకు మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించేందుకు ఇది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.
ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాకు గొప్ప బలంగా నిలుస్తాయి.
#HBDJanaSenaniPawanKalyan
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
ప్రజల కోసం పరితపించే గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@PawanKalyan || @JanaSenaParty
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ధర్మవరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాము. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్‌పై ప్రసారమైన లైవ్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి వీక్షించాను.
@PawanKalyan || @JanaSenaParty
జనసేన యువజన విభాగం ఆవిష్కరణ✊
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా, ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం.
📅 02-09-2026
🕙 ఉదయం 10:00 గంటలకు
📍 ఛత్రపతి శివాజీ సెంటర్
జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
@JanaSenaParty@PawanKalyan
సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక విజన్..
* రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు
* రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు
* 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి
* జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం
* ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు... 28 వేల మంది రైతులకు లబ్ధి
* నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి
* 50 వేలకు పైగా ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం
* పాడి రైతుకు అండగా గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం
* సీమ దాహార్తి తీర్చేందుకు సిద్ధమవుతున్న జేజేఎం-అమరజీవి జలధారలు
* 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపు
@APDeputyCMO@NagaBabuOffl@JanaSenaParty@JSPFanTG
#pawankalyan #rayalaseema #janasenapartytelangana #janasenafantelangana
శ్రీ @PawanKalyan గారి ప్రయాణంలో తెలంగాణ ఒక అధ్యాయం మాత్రమే కాదు—ఆయన హృదయానికి దగ్గరైన భావోద్వేగం. నల్లమల నుంచి కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబం వరకు, ఆయన పరాయివాడిలా కాదు… మనవాడిలా నిలిచారు.
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ టీమ్ ప్రేమతో సమర్పిస్తున్న ఈ వీడియో ట్రిబ్యూట్. ❤️✊
From Telangana Janasainks #HBDJanaSenaniPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan#Kerala#GenZ
Kerala Gen-Z stands with JanaSena & Pawan Kalyan!
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
యువతలో ఆయనపై ఉన్న అభిమానానికి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనం. నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యతతో ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఏపీ-గ్రీన్ సంకల్పాన్ని శ్రీ నాగబాబు గారు సమర్థంగా అమలు చేయాలి
పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ ఎన్రిచ్మెంట్ నెట్వర్క్ (ఏపీ-గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతాన్ని పచ్చదనంతో నింపే బృహత్ కార్యాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్లనున్నారు. ప్రకృతిపై అపారమైన ప్రేమ కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ-గ్రీన్ సంకల్పాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని విశ్వసిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచే బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో శ్రీ నాగబాబు గారిని నియమించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, మద్దతు ఇచ్చిన కూటమి పక్షాల నాయకులకు ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు ₹280 కోట్లతో 96% పనులు పూర్తి కాగా, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తైంది.
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది.
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics