భీమిలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కార మార్గం పై అధ్యాయానికి, మరియు అవినీతి పై రాజీలేని పోరాటానికై...
గుండె గుండెకు గాజు గ్లాసు గుర్తు చేరువ చేసే విధంగా...
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో "జులై 31వ తేదీ" నుంచి భీమిలి నియోజకవర్గ పరిధిలో ప్రతీ ఇంటికి "జనంతో జనసేన" కార్యక్రమం ప్రారంభం.
ప్రతీ ఒక్కరి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడమే నా ధ్యేయం. భీమిలి నియోజకవర్గంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశించిన సమసమాజ స్థాపన, జనసేన పార్టీ జెండా విజయకేతనమే నా లక్ష్యం.
#JanamThoJanaSena
VRAలను గ్రూప్ 4 స్థాయికి పెంచి ఆత్మ గౌరవం నింపి తనలో కలుపుకుంటూ గౌరవం పెంచుతుంటే.
పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రo జూనియర్ పంచాయతీ సెక్రటరీ న్యూ పోస్ట్ క్రియేట్ చేయించి, 3ఇయర్స్ నుండి 4ఇయర్స్ పెంచించి,4ఇయర్స్ తర్వాత అది చాలదని మళ్ళీ పెర్ఫార్మన్స్ చూడడానికి వస్తున్నారు,ఇదెక్కడి న్యాయం
Ts lo JPS/OPS ల పనితీరు లో 80% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారి వివరాలు (ప్రతి జిల్లాల్లో 80%పైగా ఉన్నారు) ప్రభుత్వమే సోషియో ఎకానమీక్ ఔట్లుక్ 2023 లో ముద్రించింది మా regularisation కమిటీ లతో కాలయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయండి
@KTRBRS@TelanganaCMO@EDRBRS@BRSHarish
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.