హ్యాపీ బర్త్‌డే రామన్న ఫ్రం రైతన్న
భూపాలపల్లి 9వ వార్డు మైపల్లి (మహబూబ్‌పల్లి) లోని రైతులు @KTRBRS పుట్టినరోజు సందర్భంగా వారి వ్యవసాయ క్షేత్రంలోనే కేటీఆర్ చిత్రపట్టం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రైతన్న...
విద్యుత్ శాఖలో పని చేస్తున్న 23 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు.
సమ్మె చేస్తున్న వారిని డిస్మిస్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలుక పలుకులు పలికిన భట్టి విక్రమార్క, నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో విద్యుత్ కార్మికులకు టెంట్ వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
విద్యుత్ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి, వారితో చర్చలు జరపాలి.
- మాజీ ఎమ్మెల్యే @Gandraofficial
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు.
నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే.
పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది.
తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.
అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు.
తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.
భూపాలపల్లిలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు పంచిన మాజీ ఎమ్మెల్యే @Gandraofficial
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డదో తెలియచేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో స్థానిక, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి బాకీ కార్డు పంపిణీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి.
కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించి ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
#CongressBaakiCard
జోహార్ చాకలి ఐలమ్మ..
ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని, బహుజనులు ఎదుర్కొన్న వివక్షను, మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్యజ్యోతి చాకలి ఐలమ్మ గారు.
జోహార్ చాకలి ఐలమ్మ.... అందుకో మా నివాళులు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో..
విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు!
భూపాల పల్లి నియోజకవర్గం, టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై మేము ధర్నా చేశాం.. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదు.. అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా ?
కొందరు కాంగ్రెస్ నేతలు దొంగే.. దొంగ దొంగ.. అన్నట్టు
ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తుంటే.. పోటీ ధర్నాలు చేస్తున్నారు.
మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు.
భూపాల పల్లి నియోజకవర్గమే కాదు.. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో ఇసుక దోపిడీ జరుగుతోంది.. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మా ప్రాంతం ఎడారిగా మారడం ఖాయం!
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి
@Gandraofficial
కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోయాం... ఇంకోసారి నమ్మేది లేదు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అంటున్న మహిళలు.
భూపాలపల్లి పర్యటనలో @KTRBRS తో ముచ్చటించిన మహిళా రైతులు.
ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు.
ఓటుతోని కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చింది మీరే.. రేపు వాడిని దింపాల్సింది కూడా మీరే.
వాడొకడు, వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 50, 100 ఏండ్లైనా మీకోసం, మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది.
తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నిన్నటి వరకు హైడ్రా తో ప్రజల నీడ కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
నేడు బర్రెల కొట్టం కూలగొట్టి వాటికీ నీడ లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాకు న్యాయం చేయండి అంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్రెలను మేపి నిరసన తెలిపిన రైతు బిడ్డా కూరాకుల ఓదెలు లలిత దంపతులు#wewantjustice
నమ్మి ఓట్లేసిన పాపానికి రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్
రాజకీయ కక్ష, దురుద్దేశంతో కాళేశ్వరంపై కుట్ర చేసి
వర్షాభావ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రైతు ద్రోహి రేవంత్.
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
@Gandraofficial
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు.
బీజేపీ నేతలు యూరియా ఇప్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ నుంచి చెరి 8 మంది ఎంపీలు ఉన్నా రైతులకు, ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి.
@Gandraofficial