#APpreparesForMontha
మొంథా తుపానును ఎదుర్కోడానికి కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తతో పని చేయాలి.
- ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి.
- తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
- గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో సైతం వైద్యం అందేలా చూడాలి.
- పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి.
- పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి.
కాకినాడ ఇంచార్జి మంత్రి పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు, ఎస్పీ బిందు మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#CycloneMontha
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
• ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి
• ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి
• తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
• గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలి
•పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి
• పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి
•మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan వీడియో కాన్ఫరెన్స్
మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావం, ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. రేపు కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలి. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా గర్భిణి స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియపర్చండి. తుపాను పట్ల ప్రజల్లో భయాందోళనలు లేకుండా గ్రామాల్లో మైకుల ద్వారా తుపాను ప్రభావం, తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించాలి. గజ ఈతగాళ్లను తీర ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద సిద్ధంగా ఉంచాలి. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉంది. తక్షణం వాటిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలి.
• అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి
తుపాను ప్రభావం ఉన్న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, వీర్వోలు అందుబాటులో ఉండాలి. పోలీసులు... ముంపు ప్రాంతాల్లో భద్రత చర్యల పర్యవేక్షణ పెంచాలి. పునరావాస కేంద్రాలకు వెళ్లే ప్రజల ఇళ్లకు సైతం భద్రత కల్పించాలి. ప్రజలు ఇళ్లలో లేని సమయంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. బలహీనంగా ఉన్న చెరువులు, వాగులు, కుంటల గట్లను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి. గండ్లు పడితే పూడ్చేందుకు వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలి. (1/2)
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్టర్ & భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @DrSandeepJSP
AP State Pollution Control Board Director & JanaSena incharge Bheemil Consiitunty
Heartfelt birthday wishes to our Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji.
Beyond being a powerful voice in Parliament, his ability to engage in meaningful discussions and respond to the opposition’s questions with facts, clarity, and conviction truly reflects the spirit of true statesmanship.
On this special day, I extend my warmest greetings and pray to Lord Sri Venkateswara of Tirumala to bless him with long life, good health, and unwavering strength to continue serving our motherland with courage and dedication.
@HMOIndia@PIBHomeAffairs
దీపావళి శుభాకాంక్షలు
దీప కాంతులతో శోభాయమానంగా... సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి @APDeputyCMO
#HappyDiwali