While campaigning at a recent #APNRT event, Georgia representatives announced plans to adapt Andhra Pradesh’s "One Family – One Entrepreneur" model for Forsyth County. Proof that AP's innovative governance is capturing global attention.✊
#NDA#TDP#JanasenaParty#NaraLokesh
సైకో ACCENTUREతో:ఆంధ్ర రాజధాని ప్లాన్
రాష్ట్ర మధ్యలో నీళ్లున్న చోట గ్రీన్ఫిల్డ్ రాజధాని.వైజాగ్ తుఫాన్లు వస్తాయి,బిల్డింగ్స్ రిస్క్
రాజధాని RE హంగామాతో 2BILLION$ వస్తుంది.కేంద్రం సహాయం చెయ్యకపోయినా రాష్ట్ర మధ్య రాజధాని
:ఇట్లు సైకో జగన్ రెడ్డి
తర్వాత💇♂️
https://t.co/uBomBGKTq9
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ శుభాకాంక్షలు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు గారి దివ్య ఆశీస్సులతో...సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా.
తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా
తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా.
ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా
రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా.
భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా... మన పసుపు జెండా!
దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం.
కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి...తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ...చారిత్రాత్మక దినమైన నేటి రోజున...ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను.
జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్!
#43YearsOfTDP
#TDPFoundationDay
నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి... ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది.
#FekuJagan
1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. ఇన్నాళ్లూ రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటివేళ్లతో సహా పెకలించి వేశారు అక్కడి ప్రజలు.
పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.
#PsychoFekuJagan#EndOfYCP
#AndhraPradesh
వికసిత భారత్ నినాదంతో బాగస్వామయవుతూ 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ 10 మార్గదర్శకాలతో రాష్ట్ర భవిష్యత్ నభూతో నభవిష్యత్ గా అన్నచందంగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాను
#SwarnaAndhraVision2047
#SwarnaAndhra2047
#Vision2047
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Congratulations to the youngest world chess champion @DGukesh! We’re so proud of your achievement. My son and I were carefully following the competitive rounds. Thank you for inspiring young talent of India!!
జగన్ ప్రభుత్వ బాధితులం అంటూ మాజీ జవాన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఇంటికి బిల్డింగ్ ప్లాన్ ధ్రువపత్రం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధించటం వల్ల, ఇల్లు కబ్జాకు గురైందని దంపతులు వాపోయారు. దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తాను, గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని జవాన్ జ్ఞానానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తప్పక పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు
#ChandrababuNaidu
#AndhraPradesh
ఇందుకే బ్రో మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. ప్రజలు ఛీ కొట్టినా మీ బుద్ధి ఏ మాత్రం మారకపోవడం బాధాకరం. ప్రభుత్వ నుండి చిన్న తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధం. కానీ పనిగట్టుకొని ఫేకు ప్రచారం చేస్తే తాటతీస్తాం.
#FekuJagan#AndhraPradesh
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగపురుషుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాపురుషుడు ఎన్టీఆర్ శతజయంతిని గత ఏడాది జరుపుకున్నాం. ఏడాది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉత్సవాలు జరిపి ఆయనకు ఘన నివాళి అర్పించాం. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న ఈ సినీ వజ్రోత్సవ వేడుక అపూర్వ ఘట్టం. ఎన్టీఆర్ తొలిసారి నటించిన ‘మనదేశం’ చిత్రం విడుదలైన 75 ఏళ్లు కాగా ఎన్టీఆర్ మొదటి సినిమా హీరోయిన్ కృష్ణవేణి. 102 సంవత్సరాల వయసులోనూ ఈ వేడుకకు ఆమె హాజరుకావడం ఎంతో గొప్ప విషయం. కారణజన్ముల చరిత్ర మనం గుర్తు చేసుకోని స్పూర్తి పొందాలి. తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 కల సాకారం చేసుకుందాం.
Today, we, the people of Andhra Pradesh, have together turned a new chapter in our State's history. The launch of the "SwarnaAndhra 2047 Vision" marks a transformative step for our State. It's a reflection of the collective aspirations of our people and outlines a 10-point transformational plan, the "Padi Sutralu," to guide our journey over the next 23 years. I call upon every citizen to unite in rebuilding our state with innovation, perseverance, and a shared commitment to creating a Healthy, Wealthy and Happy Andhra Pradesh.
The SwarnAndhra 2047 Vision aligns our State with India's global aspirations under the visionary leadership of the Hon'ble Prime Minister, Shri @narendramodi Ji. Let's all unite to transform Andhra Pradesh into a $2.4 trillion economy by 2047 with inclusive growth at its core.
#SwarnaAndhraVision2047
నీటి సంఘాల ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) గారు ... 🔥🔥
ఎక్కడికక్కడ తన అనుచరగణంతో వైసిపి గూండాలకు అడ్డుకట్ట...
ఎక్కడా కనిపించని ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు....
నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం చేసి సత్తా చాటడంతో తన బలం ఏంటో నిరూపించుకున్న బీటెక్ రవి గారు ...
పులివెందుల చరిత్రలో ఎన్నడూ టిడిపి వారికి దక్కని పదవులు..
బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో 32 సాగు నీటి సంఘం ప్రెసిడెంట్లను దక్కించుకొని ఘనత వహించిన పులివెందుల డైనమిక్ లీడర్
బీటెక్ రవిగారి ని అభినందించిన అధిష్ఠానం మరియు పలువురు పార్టీ ప్రముఖులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు.. వాటి పరిష్కారం కోసం ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన 51వ రోజు ప్రజాదర్బార్ లో పెన్షన్ మంజూరు చేయాలని, వైద్యం సాయం అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎమ్.ఓబులమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఆయా విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించి, బాధితులకు అండగా ఉంటాను.
#PRAJADARBAR
దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించడమే కాకుండా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ నుంచి తన 30 మంది సహచరులను కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన హవల్దార్ వి వి సుబ్బయ్య త్యాగాన్ని ఈ దేశం మర్చిపోదు. ఆ వీరుడి మరణానికి దిగ్భ్రాంతి చెందుతూ నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అనంతపురం లో హవల్దార్ సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయన చూపించిన ధైర్యసాహసాలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి.