అధికారం లో ఉన్నప్పుడు
మీరు చెప్పిన మహా భారతం
ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్న
కాలకేయ యుద్ధం
అప్పటి కి ఇప్పటి కి
పేపర్ లీక్ మీద తీసుకున్న
చర్యల్లో ఏమి తేడా ఉంది
@KTRBRS గారు ?
Educate the immature
Don’t lit the Fire for your poliTRICKs
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership
బాబూ... Khan దాదా
మిత్రపక్షం గా PK ఎందుకు రా resign చెయ్యమని అడుగుతాడు...
Collective respinsibility under west minister model లో, ప్రభుత్వం లో ఉన్న వాళ్లు, బయటకు dissent చెప్పకూడదు, resignations అడగకూడదు, ఏదైనా internal గా నే అడగాలి
ఇది చదువుకుని సస్తే... PK ని అడగరు
Peak hypocrisy! After 16 paper leaks during your tenure, you’re now claiming to speak for students?
Aren’t you, the BRS leaders, answerable to the youth of Telangana first?
అంటే దీని బట్టి మీరు కనీసం మళ్లీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే ఆలోచన కూడా పెట్టుకోకూడదు !
Am i right? @KTRBRS
By the way Happy Birthday sir 💐
#PaperLeaks #TelanganaYouth
#Accountability #BRS
@JSPTelangana@itsRamTalluri@JanaSenaParty
విజయవాడలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు!
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారితో కలిసి 64 డివిజన్ల నాయకులు, వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించాం.
శుక్రవారం ఉదయం 10:00 గంటలకు వెన్యూ కన్వెన్షన్ హాల్లో జరిగే మహాసమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మరియు ఇతరులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేద్దాం!
@JanaSenaParty@PawanKalyan
Kalyan is taking a strong stand against red sandalwood (Red Sanders) smuggling, he has clearly said the mafia must be stopped completely. He held a review meeting with forest officials and is pushing hard for better protection of these precious trees.
కృతజ్ఞత, ఆత్మావలోకనం, సంతృప్తి ఉన్నవాళ్ళకి, ఎదుటివారి మానసిక స్థితి గురించి ఆలోచించగలిగేవాళ్ళకి , తమకి ఉండే బలహీనతలని ఒప్పుకోగలిగే వాళ్ళకి ఒకవేళ చిన్నపాటి మానసిక రుగ్మతలు వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.
నిజానికి సమస్య అనేది ముగియడం అటు Sonam కీ ఇటు ప్రకాశానికి ఎవరికీ ఇష్టం లేదు
ఇకనైనా ఎవడి పనిలో వాడు నిమగ్నం అవుతూ
ప్రధానమంత్రిని గద్దె దించేద్దాం అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి
సొంత రాష్ట్రంలో ఎవడూ దేకడు కాబట్టి
కనీసం MAA ఎన్నికల్లో అయినా
గెలిచేందుకు కృషి చేయాలని ఆశిద్దాం
ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 🇮🇳
రేషన్ పంపిణీలో పారదర్శకత, సాంకేతికత ఆధారిత సేవలు, సమర్థవంతమైన ధాన్యం కొనుగోలు విధానాలను అధ్యయనం చేసేందుకు కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ అనూప్ జాకబ్ గారి నేతృత్వంలోని బృందం ఏపీలో పర్యటిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను పరిశీలించి, వాటిని కేరళలో అమలు చేసే అవకాశాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది.
ఇది కేవలం ఒక రాష్ట్ర విజయమే కాదు ప్రజల సంక్షేమానికి, సమర్థవంతమైన పాలనకు ఆంధ్రప్రదేశ్ రూపొందించిన నమూనాకు దేశవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపు.
@mnadendla !! @ncbn !! @PawanKalyan
Reply ఇద్దాం అనుకున్నా
DP చూసి, పాపం అని లైట్ తీసుకున్నా
వీళ్లకు ఉన్న identity crisis, inferiority complex నుంచి బయట పడటానికి ఇదొక coping mechanism అంతే
వాళ్ల hero, politics కి కాదు కదా, సేవా కార్యక్రమాలకు కూడా ఒప్పుకోవట్లేదు అనే frustration లో ఇలా వాగుతుంటారు
బోటు యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి మీరు డబ్బులు ఇస్తారు అక్కడ రాజకీయ లబ్ధి ఉంటుంది కాబట్టి.
హత్యలు, మానభంగాలు చేసేవాళ్ళ ఇంటికెళ్ళి ఇరవై లక్షలు ఇస్తారు అక్కడ ప్రధాన కులపు ఓట్లు ఉంటాయని.
కానీ మీరే గుద్దేసి మీరే చంపేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అంటున్నారు, ఇక్కడ స్వయంగా మీ వల్లే తప్పు జరిగింది, అందరి వేళ్ళు మిమ్మల్నే చూపిస్తున్నాయని?
వాహ్ ఏం తెలివి వైసీపీది 👌🏻
#YSRCriminalParty
Deputy CM @PawanKalyan garu flagged off the onward journey of Kumki elephants Jayanth and Abhimanyu to the Guchchimi Elephant Camp, Parvathipuram Manyam, during their halt at Mangalagiri.
కలసికట్టుగా పని చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మనదే
•క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటే గెలుపు సులువవుతుంది
•విజయవాడ గడ్డపై జనసేన జెండా గర్వంగా ఎగిరేలా కష్టపడాలి
•శ్రీ @PawanKalyan గారు ఆశయాల సాధనే ధ్యేయంగా అడుగులుపడాలి
•జనసేన పార్టీ విజయవాడ నగర సమీక్షలో రాష్ట్ర మంత్రి శ్రీ @kanduladurgesh , జనసేన పార్టీ నాయకుల ప్రసంగం
‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామ’ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పేర్కొన్నారు. నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తే గెలుపు మరింత సులువవుతుందని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా మన ప్రణాళికలు ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కష్టపడి పని చేస్తే వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారి నేతృత్వంలో విజయవాడ నగర సమీక్ష సమావేశం సుజన కన్వెన్షన్ హాలులో శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ... “ఈ రోజు రాష్ట్రంలో జనసేన జెండా రెపరెపలాడుతోంది అంటే దానికి కారణం జనసైనికులు, వీరమహిళల అలుపెరగని శ్రమే. సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా రాత్రింబవళ్లు పడిన కష్టం, చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయం. అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మనం శ్రమించాల్సిన అవసరం ఉంది. విజయవాడ గడ్డపై జనసేన జెండాను గర్వంగా ఎగరవేయడమే మన తదుపరి లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి నుంచే ప్రజల్లో ఉందాం. వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరాల్లో తోడుగా నిలబడుతూ ప్రజలకు మరింత చేరువవుదాం. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వారి నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుదాం.
•ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అది సాధ్యం కాదు
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం కోసం అధినేత శ్రీ @PawanKalyan గారు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీలను నియమించారు. అందులో భాగంగా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా వెళ్లే అవకాశం నాకు దక్కింది. విజయవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులను స్వీకరించాను. కేవలం అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా, వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను. నన్ను కలవడానికి వచ్చిన వారిలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు తామంతా పార్టీ స్థాపించినప్పటి నుండి జనసేన జెండాను మోస్తున్నామని గర్వంగా చెప్పారు. దశాబ్ద కాలంగా వారిలో ఉన్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్లికేషన్లు అందించిన వారిలో అత్యధికులు దైనందిన జీవితంలో కష్టపడి పనిచేసే సామాన్యులే. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. సమాజంలో కింది స్థాయి వర్గాలుగా ఉన్న శ్రామికుల్లో ఇంతటి బలమైన రాజకీయ భావజాలం, మార్పు కోసం ఆరాటం ఉండటం నిజంగా అద్భుతం. ఇలాంటి నిస్వార్థమైన అండ ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ పార్టీకీ సాధ్యం కాదు. అక్కడకు వచ్చిన విభిన్న వర్గాలను చూస్తే ఒక విషయం స్పష్టమైంది. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో లేదా మతానికో పరిమితమైనది కాదు. ఇది అన్ని కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆశయాల నుంచి పుట్టిన నిజమైన పార్టీ. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మనం కీలక భాగస్వాములుగా ఉంటూ, పార్లమెంట్, శాసనసభలలో ప్రజా గళాన్ని అత్యంత బలంగా వినిపిస్తున్నాం. మనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా, అద్భుతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకువస్తున్నాం. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో అయితే పార్టీని స్థాపించారో, ఆ ఆశయాల సాధనే ధ్యేయంగా మనం సరైన దిశలో అడుగులు వేస్తున్నాం. ఈ కూటమిలోని మూడు పార్టీలు ఇదే ఐక్యతతో, పరస్పర సమన్వయంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో కచ్చితంగా అఖండ విజయం సాధిస్తాం’’ అన్నారు.
•రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం మనదే : శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు
శాసనమండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుంది. ఈ రెండేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాం. ముఖ్యంగా విజయవాడలో శాంతిభత్రలు విఘాతం కలగకుండా చూశాం. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పని చేయాలి. ముఖ్యంగా డివిజన్లలో చాలా సమస్యలు ఉన్నాయి.