Thank You @PawanKalyan garu and @JanaSenaParty for inspiring us to do social activities. We will continue our support in this long journey.
- @JSPEurope
We are proud to announce that Shri @NagaBabuOffl garu has officially launched the #JanasenaFormationDay posters for grand celebrations across European countries! 🔥This marks a major milestone to celebrate 12 years of Janasena’s unstoppable journey in serving the people.
జర్మనీ (యూరప్) రీజియన్‌కు APNRT Regional Coordinators అధికారికంగా ప్రకటించింది. వీరు స్థానిక భారతీయ ఎంబసీలతో కలిసి తెలుగు వారి సంక్షేమం కోసం పని చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, APNRT ప్రెసిడెంట్ శ్రీ రవి కుమార్ వేమూరు గారు అభినందనలు తెలిపారు.
Thank you, UK and Europe NRI Janasainiks. It was a wonderful interaction with all of you. Your energy, commitment, and dedication truly inspire us. Grateful for your time and support.
@JanaSenaParty
On the occasion of the visit of Hon’ble Prime Minister Sri @narendramodi Ji to Andhra Pradesh, he visited the sacred Srisailam Jyotirlinga Temple of Sri Bhramaramba Mallikarjuna this morning and sought divine blessings. He was accompanied by Hon’ble Chief Minister Sri @ncbn and Deputy Chief Minister Sri @PawanKalyan during this temple visit.
ప్రపంచ యోగా దినోత్సవం... భారతావనికి దక్కిన గౌరవం
* యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే... గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు విశ్వవ్యాప్తం చేశారు
* ‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ థీమ్ ను మనందరం ముందుకు తీసుకెళ్దాం
* గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి కృషితో ప్రపంచ రికార్డు
* విశాఖలోని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను, గొప్పదనాన్ని చెబితే ... దానిని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విశ్వవ్యాప్తం చేశారన్నారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, విశ్వ నరుడు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు యోగా దినోత్సవాన్ని ‘‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’’ అనే థీమ్ ను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నం సాగర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “యోగా భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్య భాగం. భారతీయ సనాతన ధర్మం యావత్ మానవాళికి అందించిన వరం. ఇది శరీరం.. మనసు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఈ యోగా క్రియకు ఆది యోగి పరమ శివుడు ఆద్యుడు అయితే... ఆ మహా యోగాన్ని ఆది శేషుడి అంశగా పతంజలి మహర్షి యోగ శాస్త్రం రూపంలో మనందరికీ అందించారు.
•శ్రీ నరేంద్ర మోదీ గారే నిలువెత్తు నిదర్శనం
యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా ఖండాంతరాలకు చేర్చిన ఘనత శ్రీ నరేంద్ర మోదీ గారిదే. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారో... ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో అన్నదానికి శ్రీ మోదీ గారే నిలువెత్తు ఉదాహరణ. యోగా డే విషయమై శ్రీ మోదీ గారి ప్రతిపాదనకు 177 దేశాలు ఆమోదం తెలిపాయి. ఆయన చొరవతోనే ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. శ్రీ మోదీ గారి పిలుపు మేరకు మన విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయ్యింది. శ్రీ మోదీ గారి సమక్షంలో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింద"న్నారు.
*విశాఖ వేదికగా గిన్నిస్ రికార్డు*
విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ విశిష్ట కార్యక్రమంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితోపాటు గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, క్రీడాకారులు, యోగా సంఘాలు, నౌకాదళం, కోస్ట్ గార్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు సామూహిక యోగా ప్రదర్శనలు చేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మంది ఆసనాలు వేశారు. సముద్రంలో యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది, వారి కుటుంబాలు వేసిన యోగసనాలు అందరినీ ఆకర్షించాయి. అంతకు ముందు ప్రధాని శ్రీ మోదీ గారు యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.
#YogaForOneEarthOneHealth
#InternationalYogaDay #YogaAndhra2025
ప్రగతి పథంలో పిఠాపురం నియోజక వర్గం
• శ్రీ @PawanKalyan గారు బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు
• పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం
• విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
• పల్లె పండగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ
• రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు
• టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు
• శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
• పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
• దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అడుగులు వేస్తున్న పిఠాపురం
• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#PawanKalyanAneNenu
ప్రజా తీర్పుకు ఏడాది...
ప్రజా చైతన్యానికి ఏడాది...
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది...
NDA కూటమి చారిత్రక విజయానికి ఏడాది...
జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది...
04-06-2024 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు... దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే @JanaSenaParty సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు.
మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం, గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా "జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ" పార్టీల NDA కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, @JaiTDP, @BJP4Andhra కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#1YearForNDAHistoricVictory #PrajaTeerpuDinam
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
పాకిస్థాన్ మన దేశంలోకి వచ్చి కొడితే... మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం
• మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది
• దేశ విభజన జరిగిన నాటి నుంచి ప్రశాంతత లేకుండా చేస్తోంది
• శాంతివచనాలు వారికి పనికి రావు... ఇక పాకిస్థాన్ ఆటలు సాగవు
• క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి
• సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి
• సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు... దేశాన్ని నడపరు
• విజయవాడ తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
• ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలసి పాల్గొన్న శ్రీ @PawanKalyan గారు
#JSPSalutesIndianArmedForces
#TirangaYatra
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है,
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।
-Dinakar
దశాబ్దాలుగా సహనం.. సహనం!
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము.
జైహింద్!
@adgpi@IAF_MCC@indiannavy
#OperationSindoor
నూతన రైస్ కార్డుల నమోదు అవకాశం రేపటి నుంచే..!
అందుబాటులోకి ఆరు రకాల సేవలు
1. నూతన రైస్ కార్డుల జారీ
2. కార్డుల విభజన
3. చిరునామా మార్పు
4. సభ్యులను చేర్చడం
5. ఉన్నవారిని తొలగించడం
6. కార్డులను సరెండర్ చేయడం
రేపటి నుంచి ఈ సేవలను దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయాల నుంచి పొందవచ్చు.
* వారం తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.
* రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు రూపంలో జూన్ నెలలో జారీ.
@ncbn@PawanKalyan
జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా అవనతం
పెహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించిన శాసన మండలిలో
ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారు, పార్టీ నేతలు
#JSPCondemnsTerror
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ @NagaBabuOffl , గారితో మండలి చైర్మన్ శ్రీ మోషేన్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం శాసన మండలిలో చైర్మన్ కార్యాలయంలో జరిగింది.