ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️
వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది.
Jai janasena
A mutual decision to part ways after 13 years of marriage is never easy for either person
I hope both of you @PawanKalyan & Anna Garu would find peace with your decision.
Wishing Anna Lezhneva all the happiness & success to her future ❤️
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase.
On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage.
Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations.
I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority.
Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it.
- @PawanKalyan
#StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
పవన్ అన్న @PawanKalyan ఒక్కసారి మా ఆవేదన విను!
జనసేన భవిష్యత్తు గురించి ఒక సామాన్య జనసైనికుడి ఆవేదన, కొన్ని ప్రశ్నలు!
ప్రియమైన పవన్ కళ్యాణ్ అన్నయ్యకు,
అన్నా… నీ మీద అభిమానంతో కాదు, నమ్మకంతో ప్రయాణం చేస్తున్న జనసైనికుడిగా ఈ మాటలు రాస్తున్నాను.
అన్నా… నీకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా పరవాలేదు… కానీ మా ఆవేదనను అర్థం చేసుకో. దయచేసి మౌనంగా మాత్రం ఉండకు!
నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుందని నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు చేసిన త్యాగాలను గౌరవిస్తున్నాం. కానీ అన్నా, ఆ త్యాగాలు ఎప్పటికీ జనసేన పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉండకూడదు కదా?
1. మూడు వంతుల హామీ… చివరకు మనకు మిగిలింది ఎంత అన్నా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడు వంతుల వాటా అని చెప్పుకున్నాం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, ఆ మూడు వంతుల్లో సగం కూడా మనకు దక్కిందా అనే అనుమానం కలుగుతోంది.
దక్కిన చోట్ల కూడా టీడీపీ బీ-ఫారాలు, టీడీపీ రెబల్స్, మన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం… ఇవన్నీ జనసైనికులను అయోమయంలోకి నెడుతున్నాయి.
పొత్తులో మనకు కేటాయించిన స్థానాల్లో కూడా మన అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేకపోతే, ఆ పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో మన పార్టీకి కలిగే ప్రయోజనం ఏమిటన్నా?
2. ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలకు సమాధానం ఎవరు చెబుతారు?
పోలవరం, తెనాలి, నెల్లిమర్ల, రైల్వేకోడూరు, రాజానగరం…
ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, బీ-ఫారాలు, రెబల్స్, కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక ప్రచారం వంటి అంశాలపై కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి.
మన పార్టీ అభ్యర్థులకు మన ఎమ్మెల్యేలే పూర్తిస్థాయిలో అండగా నిలబడకపోతే, సాధారణ కార్యకర్త పరిస్థితి ఏమిటన్నా?
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నాగబాబు గారు సాలూరులో ప్రచారం కోసం సమయం కేటాయించగలిగినప్పుడు, మన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం అంతే నిబద్ధతతో ఎందుకు పనిచేయకూడదు?
ఎమ్మెల్యే పదవి జనసేన వల్ల వచ్చినప్పుడు, జనసేనను గ్రామస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా వారిదే కదా అన్నా?
3. 2024లో 175 స్థానాల్లో కేవలం 21 తీసుకున్నప్పుడే బాధపడ్డాం!
అన్నా, 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో మనం కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు చాలా బాధపడ్డాం.
కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఓట్ల చీలికను నివారించడం కోసం, స్థిరమైన ప్రభుత్వం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గుండెల్లో బాధ పెట్టుకుని కూడా అంగీకరించాం.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాజకీయ ఆశలను తగ్గించుకున్నాం. సరే అన్నా… కానీ పార్టీని నిర్మించుకునే అవకాశాలను కూడా వదులుకోవాలా?
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు ఒక సువర్ణావకాశం. గ్రామాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి, మండలాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, రేపటి ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?
అలాంటి అవకాశాన్ని కూడా పొత్తు లెక్కల్లో కోల్పోతే, జనసేన సొంతంగా ఎదిగేది ఎప్పుడు అన్నా?
4. 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు అన్నావు… ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయాయి!
అన్నా, నువ్వు చెప్పిన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం మాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మాటను నమ్మే ఎంతోమంది యువకులు తమ సమయాన్ని, అవకాశాలను, రాజకీయ భవిష్యత్తును జనసేన కోసం వెచ్చించారు.
ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మా ప్రశ్న ఒక్కటే…
2029లో కూడా రాష్ట్ర ప్రయోజనాల పేరుతో 30–40 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైతే, జనసేన సొంత రాజకీయ శక్తిగా ఎదిగేది ఎప్పుడు?
2029 తర్వాత 2034 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత, మారే రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వాలు, కొత్త సవాళ్లు ఎదురవచ్చు. అప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయనే హామీ ఎవరు ఇవ్వగలరు?
అన్నా, రాజకీయాల్లో అవకాశాలు ప్రతిసారీ రావు. వచ్చినప్పుడు వాటిని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి.
రాష్ట్రాన్ని బాగు చేయాలనే నీ సంకల్పం గొప్పది. కానీ ఆ రాష్ట్రానికి రేపు నాయకత్వం వహించే స్థాయికి జనసేనను తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత కాదా?
5. PAC ఏం చేస్తోంది అన్నా? చర్చల్లో మన బలం ఎందుకు కనిపించడం లేదు?
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన సమయం వచ్చింది.
పొత్తు చర్చల్లో మన వాటా, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వానికి అవకాశాలు, రెబల్స్ సమస్యలు… వీటన్నింటిపై ముందుగానే స్పష్టమైన నిర్ణయాలు ఉండాలి.
పొత్తు అంటే పరస్పర గౌరవం ఉండాలి. పరస్పర ప్రయోజనం ఉండాలి.
ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయిలో జనసేన ఉనికిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నా!
PACని పునర్వ్యవస్థీకరించాల్సి వస్తే చేయి. చర్చల బృందాన్ని బలోపేతం చేయాల్సి వస్తే చేయి. పార్టీకి దక్కాల్సిన రాజకీయ అవకాశాల విషయంలో మరింత గట్టిగ నిలబడాలి