🌊 పోలవరం స్పిల్ వేను తాకిన ఆరో ఏడాదీ వరద జలసవ్వడి ... గోదావరి వరద జలాల మహాప్రవాహం! ఏ ఏడాది ఎన్ని వేల టీఎంసీలు దిగువకు వెళ్లాయంటే...
🌊 " ది గ్రేట్ వాటర్ వాల్ ఆఫ్ పోలవరం – స్పిల్ వే ! " జలశయ నీటి నిల్వ సామర్ద్యం (పూర్తయ్యాక ) 194 టిఎంసిలు.... అయితే వేల టిఎంసిల నీటిని ఈ స్పిల్ వే ప్రారంభానికి ముందే తనలో సంగమం చేసుకుని కిందకు పంపిస్తోంది. 'గ్రేట్ వాటర్ వాల్ ఆఫ్ పోలవరంగా' పిలవవచ్చేమో కదా.
ప్రతి వర్షాకాలంలో ఉప్పొంగే గోదావరి... పోలవరం స్పిల్‌వేను ముద్దాడుతూ, గేట్లను తాకి పులకరిస్తూ, జలహోరుతో దిగువకు పరుగులు తీస్తోంది. ప్రకృతి పరవళ్లు... ఇంజినీరింగ్ అద్భుతాన్ని పలకరిస్తున్న అపురూప దృశ్యమిది!
పోలవరం వద్ద నమోదైన గోదావరి వరద ప్రవాహాల రికార్డులను టీఎంసీలుగా మార్చి పరిశీలిస్తే ఆసక్తికరమైన జలచిత్రం కనిపిస్తోంది.
💧 2019లో జులై 27 నుంచి అక్టోబర్ 10 వరకు 3,443 టీఎం��ీలు, 2020లో జులై 1 నుంచి అక్టోబర్ 8 వరకు 3,141 టీఎంసీలు ప్రవహించినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.
🌊 2021లో జూన్ 22 నుంచి డిసెంబర్ చివరి వరకు 2,635 టీఎంసీలు, 2022లో జనవరి నుంచి డిసెంబర్ 13 వరకు ఏకంగా 5,123 టీఎంసీల ప్రవాహం నమోదైనట్లు అంచనా.
2023లో జులై–అక్టోబర్ మధ్య 3,063 టీఎంసీలు, 2024లో జులై 20 నుంచి సెప్టెంబర్ చివరి వరకు 3,620 టీఎంసీలు ప్రవహించినట్లు లెక్కల్లో వెల్లడైంది.
🌧️ 2026లో సెప్టెంబర్ 30 వరకు సుమారు 1,786 టీఎంసీల ప్రవాహం!
సంవత్సరంలెక్కించిన కాలంప్రవాహం (టీఎంసీలు)
~ 2019జులై 27–అక్టోబర్ 10- 3,442.52
~ 2020జులై 1–అక్టోబర్ 8 - 3,140.83
~ 2021జూన్ 22–డిసెంబర్ 31 -2,634.99
~ 2022జనవరి 1–డిసెంబర్ 13 - 5,123.20
~ 2023జులై 1–అక్టోబర్ 18 -3,063.16
~ 2024జులై 20–సెప్టెంబర్ 30 - 3,620.46
~ 2026జూన్ 23–సెప్టెంబర్ 30 - 1,786.17
అయితే ఇవన్నీ అందుబాటులో ఉన్న రికార్డుల కాలాలకు సంబంధించిన అంచనాలే. పూర్తి సంవత్సరాల మధ్య నేరుగా పోల్చలేం. పోలవరంతో పాటు అప్రోచ్ చానల్, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ పూర్తయ్యాక 2021 జూన్‌లో నీటిని స్పిల్ వే మీదుగా మళ్ళించారు @MEIL_Group . అప్పటి నుంచీ వరద ఒరిజనల్ నదిలో కాకుండా స్పిల్ వే మీదుగా వెళ్లడం మొదలయ్యింది. అప్పటి నుంచీ ప్రతి ఏడాది వరద స్పిల్ వే తాకి పులకరించి గేట్ల మీదుగా కిందకు వెళుతోంది.
పోలవరం ప్రాజెక్టును 2004లో చేపట్టారు. క్లిష్టమైన అనుమతులన్నీ అప్పుడే సాధించగా, తొలుత కాలువల తవ్వకాలు తర్వాత పోలవరం హెడ్ వర్స్క మొదలయ్యాయి.
మరో ముఖ్యమైన విషయం... పోలవరం నుంచి దిగువకు వెళ్లిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసినట్లు కాదు. దిగువ గోదావరి డెల్టా వినియోగం, ధవళేశ్వరం నుంచి సముద్రానికి విడుదలైన మిగులు జలాలు వేర్వేరుగా లెక్కించాలి.
గోదావరిలో ఇంత భారీ జలప్రవాహం నమోదవుతున్న నేపథ్యంలో వరద నీటి నిల్వ, వినియోగం, జలాల మళ్లింపు సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తుచేస్తున్నాయి.
2022లో 5,123 టీఎంసీలు దాదాపు ఏడాది కాలానికి సంబంధించిన లెక్క. 2024లో 3,620 టీఎ��సీలు కేవలం జులై–సెప్టెంబర్ కాలానికి సంబంధించినవి. కొన్ని కాలాల్లో నమోదులు లేనందున ఇవి పూర్తి వార్షిక మొత్తాలు కావు.
#Polavaram #Godavari #GodavariFloods #meil #WaterManagement #AndhraPradesh #Irrigation #పోలవరం #గోదావరి #floods #Drought #Elinino #Deought2026 @polavaram_ppa @CWCOfficial_FF @CWCOfficial_GoI @AP_Irrigation @irrigation_ap @RamanaiduTDP @AndhraPradeshCM @ncbn
🎥 : @gvsvp1 & @surya_kiranam
@GodariYetakaram పోలవరం ఒడిలో గోదావరి జలసవ్వడి.ప్రకృతి పరవశం! 2021 జూన్‌లో అప్రోచ్ ఛానల్,స్పిల్ ఛా���ల్,పైలట్ ఛానల్ నిర్మాణాలు పూర్తవడంతో గోదావరి జలయానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తరతరాలుగా సహజ నదీగర్భంలో పరవళ్లు తొక్కిన గోదారమ్మ. తన ప్రవాహ దిశను మార్చుకుని పోలవరం స్పిల్‌వేను అక్కున చేర్చుకుంది
🇮🇳🏆 INDIA ARE CHAMPIONS! 🇮🇳🔥
India defeat Pakistan in the Asian Games Cricket Final and bring home the GOLD MEDAL! 🥇🏏
What a performance by Team India! A proud moment for every Indian fan. 🇮🇳💙
GOLD IS OURS! 🥇🔥
#INDvsPAK#AsianGames#TeamIndia#GoldMedal#Champions
@GodariYetakaram ఈ నీటి లెక్కలు తేలాలంటే మా జనసేన అన్న @PawanKalyan రంగంలోకి దిగితే చాలు… శ్రీశైలం నీటిలో ఎవరు ఎంత వాడారో, ఎక్కడ ఎంత ఖర్చయిందో అన్ని లెక్కలు బయటకు వస్తాయి!✊✊✊
🎬 డ్రోన్ కెమెరా ఆకాశం నుంచి నెమ్మదిగా కిందకు దిగుతోంది… కిందంతా పచ్చని పైరు పంటల కోనసీమ… మధ్యలో రాగిపట్టీలా ధగధగ మెరిసే ఎర్రనీటి గోదావరి కాలువ… ఆ జలధారను రెండుగా విడదీసి దారి చూపుతూ కనిపించే లొల్ల లాకులు! 🌿🌊
నీటిపై తేలియాడే సూర్యకిరణాలు…
కాలువ గట్టున కొబ్బరి చెట్ల నీడలు…
లాకులను దాటుకుంటూ పంట పొలాల వైపు పరుగులు తీసే గోదావరి జలాలు…
ఇది సినిమా కోసం వేసిన భారీ సెట్ కాదు… ప్రకృతే నిర్మించిన అందమైన సెట్టింగ్ — లొల్ల లాకులు!
అందమే కాదు… గోదావరి సెంట్రల్ డెల్టాలో పంట పొలాలకు నీటిని చేరవేసే కీలక జల నియంత్రణ వ్యవస్థలో లొల్లది ప్రత్యేక స్థానం. గోదావరి జలాలను కాలువల ద్వారా సాగుభూముల వైపు నడిపిస్తూ తరతరాలుగా రైతుల పంటలకు జీవం పోస్తోంది.
ఒకవైపు పొలాలకు జీవజలాలు…
మరోవైపు కళ్లకు కనువిందు చేసే ప్రకృతి సోయగాలు!
అందుకే వెండితెర కూడా లొల్ల అందాలకు మంత్రముగ్ధమైంది. పచ్చని చెట్లు, ప్రశాంతంగా సాగే కాలువ, లాకుల నిర్మాణం, అచ్చమైన గ్రామీణ నేపథ్యం…
ఎన్నో సినిమా దృశ్యాలకు ��ొల్ల సహజమైన షూటింగ్ స్పాట్‌గా నిలిచింది.
" గోదావరి అందాలను చూడతరమా… ఆ గోదావరినే అన్నపూర్ణగా మలిచిన కాటన్‌ను మర్చిపోగలమా! "
🌴🌊
#LollaLocks #Godavari #GodavariDelta #CentralDelta #Konaseema #GodavariBeauty #Irrigation #AndhraPradesh #Tourism @Tourism_AP @APTourism1 @AP_Tourism
🎥 : @surya_kiranam & @palakurlla
🌊🌾 అక్కడ కరవు పంట భూములను బీడులుగా మార్చేస్తే ... ఇక్కడ గోదావరి పచ్చని పైరులతో రైతుల జీవితాలలో పంటలు పండిస్తోంది...!
“దక్షిణాదిలో కరవు వేళ... దాదాపు 10 లక్షల ఎకరాలకు జీవం పోస్తున్న గోదావరి డెల్టా!”.
"గోదావర��� అందాలను చూడతరమా… ఆ గోదావరినే అన్నపూర్ణగా మలిచిన కాటన్‌ను మర్చిపోగలమా...!?"
నీరు ప్రవహిస్తే నది.
పొలాలకు చేరితే జీవ(నది)నాడి.
అదే గోదావరి... ఇదే కాటన్ బ్యారేజి గొప్పతనం! 🌊🌾
ఎర్రటి నీటితో ఉరకలెత్తే గోదావరి...
కాటన్ బ్యారేజి చెంతకు రాగానే నాలుగు పాయలుగా విడిపోయి...
పచ్చని పొలాల ఒడిలోకి జీవధారగా సాగిపోతోంది.
ఓ పక్క నిండుగా గోదావరి...
మరో పక్క కనుచూపు మేర విస్తరించిన పచ్చని పైరులు... ఆ రెండింటినీ కలిపే వారధిలా కాటన్ బ్యారేజి!
గోదావరి డెల్టా కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. Central Water Commission చారిత్రక వివరాల ప్రకారం, కాటన్ నిర్మించిన పాత Dowleswaram Anicut మొదట సుమారు 3.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించగా, తరువాత కాలువ వ్యవస్థ విస్తరణతో Godavari Delta ayacut సుమారు 4.45 లక్షల హెక్టార్లు — అంటే 10.1 లక్షల ఎకరాలకు విస్తరించింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి నుంచి ప్రధానంగా Eastern Delta, Central Delta, Western Delta అనే మూడు కాలువ వ్యవస్థలకు నీరు వెళ్తుంది.
#Godavari #SirArthurCotton #CottonBarrage #GodavariDelta #Dowleswaram #Pattiseema #KrishnaDelta #AndhraPradesh #Agriculture #Irrigation #GreenDelta
#Drought2026 #EliNino
🎥 : కాటన్ బ్యారేజి ఎగువ భాగం అంటే రాజమండ్రి వైపు నుంచి / నీరు నిల్వ ఉండే ప్రాంతంనుంచి డ్రోన్ తో చిత్రీకరించినది - SAC Barrage overall aerial view from left to right ....
@surya_kiranam & @palakurlla