రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను సైతం పక్కన పెట్టి ఎన్నో సంవత్సరాలుగా నిరంతర ప్రజాసేవలో అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ సేవా తపన అందరికీ ఆదర్శం.
భగవంతుని ఆశీస్సులతో మీరు త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని, మరింత శక్తి, ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేసేలా త్వరలోనే తిరిగి ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రజలు మరియు జన సైనికులతో పాటు నేనూ ఆకాంక్షిస్తున్నాను.
@APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam
#GetWellSoonPawanKalyanGaru #SpeedyRecovery #PawanKalyanGaru #JanaSenaParty
ఈరోజు ఉదయం సుమారు రూ.40 లక్షల డీసీసీబీ నిధులతో మాడుగుల నియోజకవర్గంలోని యం.అలమండ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి @BandaruSNM గారు మరియు డీసీసీబీ విశాఖపట్నం చైర్మన్ శ్రీ కోన తాతారావు గారు శంకుస్థాపన చేశారు.
ఆలమండ PACS చైర్మన్ శ్రీ గొర్లె గోవింద గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార సంఘ ప్రతినిధులు మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
@ncbn@PawanKalyan@mnadendla@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు చిన్న గంట్యాడ, కనితి రోడ్డులోని గాజువాక క్లబ్ వేదికగా నిర్వహించిన కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు @Pallasrinivas4u గారు, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక జనసేన ఇన్చార్జ్ శ్రీ కోన తాతారావు గారు, బీజేపీ గాజువాక ఇన్చార్జ్ శ్రీ కరణం రెడ్డి నరసింహారావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కోన తాతారావు గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు సుపరిపాలన దిశగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత మరియు మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మాజీ కార్పొరేటర్లు, నాయకులు, డైరెక్టర్లు, వార్డు అధ్యక్షులు, మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@narendramodi@ncbn@PawanKalyan@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
#2YearsOfNDAGovt #VijayotsavaSabha #Gajuwaka
నా సోదర సమానులు, నా గురువుగారు, మడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి @BandaruSNM గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీ అంకితభావం, నాయకత్వం, నిరంతర కృషి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 💐🙏🏻
@BandaruTDP
#AdminPost
విశాఖ ఉక్కు కర్మాగారంలో నా సహోద్యోగుల మరణం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఉక్కు కర్మాగారంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఈ ఘటన నాకు ఎంతో బాధను కలిగించింది.
బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,రేపు నా జన్మదిన వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను.
అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి వేడుకలు, శుభాకాంక్ష కార్యక్రమాలు నిర్వహించవద్దని వినమ్రంగా మనవి చేస్తున్నాను.
కోన తాతారావు
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సమస్యల పరిష్కారంలో, పార్టీ బలోపేతంలో మీ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam
Andhra Pradesh securing the 3rd highest allocation in India, with a proposed interim allocation of ₹7,707.21 crore under VB-GRAM-G, is a strong endorsement of our commitment to transparent governance and effective implementation.
This support will accelerate rural transformation, strengthen village infrastructure, improve livelihoods, and create greater opportunities for our farmers, women, youth and Shramikas, whose hard work powers the growth of our State and our nation.
I convey my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his visionary leadership and unwavering focus on rural development. My sincere thanks to Hon’ble Union Rural Development Minister Shri @ChouhanShivraj Ji and the Ministry of Rural Development for their continued support and confidence in Andhra Pradesh.
I once again thank the Government of India for its transparent and objective approach in ensuring that development resources reach states and communities across the nation. We deeply value this trust and will ensure that every rupee entrusted to us creates measurable impact and meaningful change at the grassroots.
Committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh as part of a Viksit Bharat.
- @PawanKalyan@PMOIndia@MoRD_GoI@PIB_India@IPR_AP@pibvijayawada
#VBGRAMG #ViksitBharat #AndhraPradesh #RuralDevelopment
విశాఖ ఉక్కు కర్మాగారంలోని SMS-2 విభాగంలో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక సోదరుల కుటుంబాలకు @janasenaparty పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
తీవ్రంగా గాయపడిన వారికి మెరుగుయన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు తో చర్చిస్తున్నాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా @JanaSenaParty అండగా ఉంటుంది.
@PawanKalyan@mnadendla@NagaBabuOffl
124% profit growth is not just a financial achievement;it is a reflection of visionary leadership,dedicated,and the trust of thousands of customers. Congratulations to Sri @TataraoKona Garu and the entire Visakhapatnam DCCB family on this remarkable milestone.
#VisakhapatnamDCCB
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంకల్పంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
ప్రజల విశ్వాసం... అభివృద్ధి మా లక్ష్యం!
@narendramodi@ncbn@PawanKalyan@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
#NDA2Years #AndhraPradesh #Development #PawanKalyan #NaraChandrababuNaidu #Modi #JanaSenaParty
#AdminTweet
DCCB Visakhapatnam continues to redefine excellence in cooperative banking with remarkable financial performance and a steadfast commitment to rural empowerment.
📈 Net Profit Growth: 82.65%
💰 Total Business: ₹2,849.78 Crore
🏦 Loan Portfolio: ₹1,704.56 Crore
Driving financial inclusion, supporting farmers, empowering women SHGs, and strengthening rural livelihoods across the region.
Under the leadership of Sri Kona Tata Rao Garu, DCCB Visakhapatnam is achieving sustainable growth while setting new benchmarks in trust, service, and performance.
Strong fundamentals. Stronger outcomes. Sustained growth with a people-first approach.
@narendramodi@ncbn@PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@JSPShatagniTeam@JaiTDP@BJP4Andhra
#KonaTataRao #DCCBVisakhapatnam #CooperativeBanking #RuralDevelopment #AndhraPradesh #BankingExcellence
https://t.co/LLZWXiktxd
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభాన్ని ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తూ, దువ్వాడ రైల్వే స్టేషన్లో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు, గాజువాక బీజేపీ ఇంచార్జ్ శ్రీ నర్సింగరావు గారితో కలిసి ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కోన తాతారావు గారు మాట్లాడుతూ, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారం కావడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలందరికీ హర్షదాయకమని పేర్కొన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా మారుతుందని తెలిపారు. ఈ జోన్ కేంద్ర బిందువుగా మారుతుందని, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని కోన తాతారావు గారు అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ఉత్తరాంధ్ర పురోగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
@narendramodi@ncbn@PawanKalyan@Pallasrinivas4u@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@JSPShatagniTeam@JaiTDP@BJP4Andhra
#southcoastrailwayzone
గంట్యాడ సత్యారావు గారి స్టీల్ ప్లాంట్ ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు హాజరై, శ్రీ గంట్యాడ సత్యారావు గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలు, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ @TataraoKona గారు స్వర్గీయ కీ॥శే॥ పల్లా యుగంధర్ (పైడిరాజు) గారి పెద్దకార్యానికి హాజరై నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 🙏
20 ఏళ్లుగా నర్సింగబిల్లి రైతులు ఎదురుచూస్తున్న అభివృద్ధి కల ఈరోజు సాకారమైంది.
మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మరియు డీసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారి సహకారంతో నర్సింగబిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ మరియు ఇతర మౌలిక సదుపాయాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గారు మరియు డీసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారు హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం నర్సింగబిల్లి సొసైటీ అధ్యక్షులు శ్రీ నిరంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ కొట్ని బాలాజీ గారు, బ్యాంకు అధికారులు, రైతులు, యువ నాయకులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
@KonathalaForAKP@ncbn@PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@JSPShatagniTeam@JaiTDP@BJP4Andhra
#DccbVisakhapatnam
ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబాలకు అండగా సుమారు ₹20 లక్షల ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీతో పాటు రూ.15.50 కోట్ల రుణాలు మరియు లబ్ధుల పంపిణీ కార్యక్రమం సీహెచ్ ఎన్ అగ్రహారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఘనంగా నిర్వహించబడింది.
మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మరియు డీసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారి ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. అలాగే పంట రుణాలు, ప్రమాద బీమా క్లెయిమ్లు, సాధారణ బీమా క్లెయిమ్లు, ఎస్టీ రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు తదితర పథకాల కింద మొత్తం రూ.15.50 కోట్ల రుణాలు మరియు లబ్ధులను రైతులు, మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు.
అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మంజూరు చేసిన ₹5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డోర్ మరియు ₹2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ సదుపాయాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమం సీహెచ్ ఎన్ అగ్రహారం సొసైటీ అధ్యక్షులు శ్రీ బంటు రవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ కొట్ని బాలాజీ గారు, బ్యాంకు అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువ నాయకులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
@KonathalaForAKP@ncbn@PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@JSPShatagniTeam@JaiTDP@BJP4Andhra
#DccbVisakhapatnam