Combined VISAKHA District Library Authority Chairman
MA Public Admin,
MA Human Rights
@JSPDhalam Grass Roots Level Democracy
@Pawankalyan @JanasenaParty
భవిష్యత్తులో భారతదేశానికి దిశా నిర్దేశం చేయబోయే ప్రజా నాయకుడు ప్రసంగంలో గుర్తింపు పొందిన రోజు
*నా జీవితంలో మర్చిపోలేని రోజు*
జగమంత జనసేన కుటుంబాన్ని ఇచ్చిన మా దైవ సమానులు శ్రీ గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు*ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి* ధన్యవాదాలు, 🙏
పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించ��� తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వివరించ��రు. మంటలను అదుపులోకి వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించాలని సూచించారు. విశాఖ పరిసరాల్లో ఉన్న పారిశ్రామికవాడల్లోని అన్ని సంస్థల్లో తక్షణం సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
నకిలీ కాపుల మీటింగ్ పెట్టిన వైసీపీ నేతల్లారా..
కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డిని
మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా?
జగన్ కాపులకు ఇస్తా అన్న 2000 కోట్ల కోసం మీటింగ్ పెట్టారా?
జగన్ ఇస్తానన్న కాపు విదేశీ విద్య కోసం మీటింగ్ పెట్టారా?
ఏ రోజైన కాపు యువత మీద అక్రమ కేసుల కోసం మీటింగ్ పెట్టారా?
ఏ రోజైన గిద్దలూరు ఎమ్మెల్యే బాబురావు వేధింపుతో బలి ఐన కాపు యువకుడు కోసం మీటింగ్ పెట్టారా?
ఏ రోజైన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి నడిరోడ్డు మీద శ్రీ Pawan Kalyan గారి తల్లి మన కాపు ఆడపడుచును తిడితే మీరు మీటింగ్ పెట్టారా?
ఏ రోజైన కాకినాడ లో జనసేన వీర మహిళలు, కాపు ఆడపడుచులు మీద దాడి చేస్తే మీటింగ్ పెట్టారా?
ఏ రోజైన వైజాగ్ novtel లో కాపు బిడ్డల అక్రమ అరెస్ట్ మీద మీటింగ్ పెట్టారా?
పవన్ కళ్యాణ్ గారి మీద వైసిపి నేతలు చే��ిన వాక్యాలు మేం ఖండిస్తున్నాం బే షరతుగా మా అధినేతకు క్షమాపణ చెప్పాలి
వన్నెంరెడ్డి సతీష్ కుమార్
జనసేన పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ మాజీ కోఆర్డినేటర్
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
@PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @APDeputyCMO
@mnadendla @NagaBabuOffl @TSivasankararao @itsRamTalluri
నకిలీ కాపుల మీటింగ్ పెట్టిన వైసీపీ నేతల్లారా..
కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డిని
మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా?
జగన్ కాపులకు ఇస్తా అన్న 2000 కోట్ల కోసం, కాపు విదేశీ విద్య కోసం మీటింగ్ పెట్టారా?
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan laid the foundation stone for Aranyaramam, Forest Department Research & Training Complex being developed at a cost of ₹24 crore.
The facility will serve as a Common Facility Centre and a hub for forest research, training, and capacity-building initiatives.
జనసేన పార్��ీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి, రాష్ట్ర నాయకుల���ో ముచ్చటించారు.
#JanaSenaTelangana
Exclusive visuals from a memorable day that blended emotion & Inspiration.
A historic and emotional moment for Telangana JanaSena!
Chief Sri @PawanKalyan garu graced the inauguration of the Telangana State Party Head Office, marking a significant milestone in the party's journey in Telangana.
Jai Telangana! Jai Bharat!
#JanaSenaTelangana
'It's truly inspiring to see Telangana JanaSena leaders establish this office with their own commitment and collective effort. It feels like coming back home.'
Sri @PawanKalyan's speech at JanaSena Party Telangana Head Office inauguration in Hyderabad.
#JanaSenaTelangana
19.06.2026
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. అభిషిక్త్ కిషోర్, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిసిజిల్లా కేంద్ర గ్రంథాలయం తాత్కాలిక భవనం కోసం వినతి పత్రం అందజేసిన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ��్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్
@PawanKalyan
నందనవనానికి శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•పర్యావరణ పునరుద్దరణ దిశగా అడుగులు వేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•మైనింగ్ తో క్షీణించిన అడవుల పునఃస్థాపన దిశగా అడుగులు
అటవీ, పర్యావరణ శాఖల పరిపాలన, పర్యవేక్షణ కార్యాలయం అరణ్యారామానికి భూమి పూజ చేసిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నందనవనం పేరిట మైనింగ్ తో పర్యావరణ విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రకృతికి పునరుజ్జీవం పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వాళీ మర్రి మొక్కను నాటి నందనవనానికి తిరిగి ప్రాణం పోశారు. 2013 నుంచి ఆ ప్రాంతంలో చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలు సహజ సిద్ధమైన కొండ భాగం, అటవీ భాగం తీవ్రంగా క్షీణించింది. విచ్చలవిడిగా పర్యావరణ విధ్వ��సం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రకృతిని పునరుజ్జీవింప చేసే బృహత్తర కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మైనింగ్ కారణంగా క్షీణించిన అటవీ భాగంలో పచ్చదనాన్ని పునఃస్థాపన దిశగా చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమంగా నందనవనం నిలువనుంది. అక్రమ మైనింగ్ తో ధ్వంసం అయిన ఈ ప్రాంతం మొత్తం మొక్కలతో నిండి “నందనవనం”గా రూపాంతరం చెందాలన్న సంకల్పంతో మర్రి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప��తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ ద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, వనరులతో కూడిన వాతారణాన్ని అందించ��లన్న లక్ష్యంతో నందనవనం కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీ పి వి చలపతి రావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్, అటవీశాఖ ఐటీ సలహాదారు శ్రీ పి.నాగబాబు, APCOST మెంబర్ సెక్రటరీ శ్రీ శరత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీమతి రేవతి, శ్రీ రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ, ఎస్పీ శ్రీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పా��్గొన్నారు.
#NANDANAVANAM
‘అరణ్యారామం’ భవన ప్రాంగణానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా భూమి పూజ
•రూ. 24 కోట్లతో అటవీశాఖ పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం నిర్మాణం
•కామన్ ఫెసిలిటీ సెంటర్ గా సేవలు అందించనున్న అరణ్యారామం
•అరణ్యారామం నుంచి అటవీ శాఖ పరిశోధన, శిక్షణ కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామాన��కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో, బ్రహ్మానందపురం వద్ద సూమారు రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నూతన భవన ప్రాంగణానికి భూమి పూజ చేశారు. ��� అరణ్యారామం అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యక్రలాపాలతోపాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక నుంచి సమన్వయం చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ గా సేవలు అందించనుంది. రాష్ట్ర అటవీ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు అరణ్యారామం వేదిక కానుంది. H.A.N.U.M.A.N. కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా, ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమానికి పర్యవేక్షణ కేంద్రంగా, పులుల సంరక్షణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ స్థిరత్వం, ఎకో-టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన తదితర విభాగాలకు సమన్వయ కేంద్రంగా సేవలు అందించనుంది. అధునాతన సాంకేతికత సాయంతో ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా అరణ్యారామంలో శాస్త్రీయ పరిశోధనలు జరపనున్నారు. క్షేత్ర స్థాయిలో అమలు చేసే కార్యకలాపాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే పరిపాలనా కేంద్రంగా నిలవనుంది.
* హనుమాన్ గ్యాలరీల పరిశీలన
శంకుస్థాపన అనంతరం అరణ్యారామం భవన నమూనా, నిర్మిస్తున్న ప్రదేశానికి సంబంధించిన వివరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. మానవ, వన్యప్రాణి ఘర్షణలను నిలువరించేందుకు తీసుకువచ్చిన H.A.N.U.M.A.N ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్ వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఒక్క 2024 ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 185 వన్యప్రాణి రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. మరో 36 మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. నిబద్దతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీ పి వి చలపతి రావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డె���లప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్, అటవీశాఖ ఐటీ సలహాదారు శ్రీ పి.నాగబాబు, APCOST మెంబర్ సెక్రటరీ శ్రీ శరత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీమతి రేవతి, శ్రీ రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాయిక���ంత్ వర్మ, ఎస్పీ శ్రీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#ARANYARAMAM
(1/5)
హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.
పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.
JanaSena Telangana State Office is ready at Manikonda, Hyderabad.
Grand opening with special pooja performed by party leaders in presence of JanaSainiks & Veeramahilas
#JanaSenaTelangana #JSPTelangana
తెలంగాణలో జనసేన పార్టీ ప్రస్థానానికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జనసేన పార���టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నేడు తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది.
ఈ శుభ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం.
చిరునామా: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ.
Location Link: https://t.co/8NAI7cyKb0
జై తెలంగాణ! జై హింద్!
#JanaSenaTelangana
గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి
• జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
• ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
• సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి
• అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమం��్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, ఎలాంటి కాలయాపన చేయకుండా సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి” అన్నారు.
*ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లండి*
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
*అరుదైన మొక్కల సంరక్షణపై అభినందనలు*
రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చే��ారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులైన పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ లను, వాళ్ల బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వెదురు జాతిని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో చేసిన లోతైన పరిశోధనలు, ఆధునిక మాలిక్యులర్ సైన్స్ ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. దీనికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని నామకరణం చేశారు. ఈ చివరి పది మొక్కలను కాపాడటమే కాకుండా, వాటి సంఖ్యను మరింత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల అభినందించారు. అదేవిధంగా, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల పెంపకానికి, వాటి సంరక్షణకు కూడా అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని అభిన��దించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ శ్రీ. బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.