అల్లూరి సీతారామరాజు జిల్లా
అనంతగిరి మండలం
రొంపెల్లి పంచాయితీ
గూడెం గ్రామంలో
నాడు 23.07.2025
నేను స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి గిరిజనుల బాధలు చూసి చలించిపోయి శ్రీ @PawanKalyan గారికి
స్వయంగా ఆధారాలతో సహా ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేసాము
నేడు
వెలుగులు నింపారు 🙏
జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి మాతృమూర్తి శ్రీమతి భారతమ్మ గారు ఇటీవల పరమపదించారు
నేడు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న శంకర్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
@JSPTelangana@JSPshankargoud
కూటమిలో 21 సీట్లతో సర్దుకున్న సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లుకి జనసేన పరిమితం అయిన త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్.
- సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్.
2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
ఆ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంలో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
ఈ చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్.మాధవ్ గారు, రాష్ట్ర విద్య, ఐటి, కమ్యునికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించే ప్రక్రియకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు. అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణాన్ని స్థానిక సంస్థల నుంచే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుపెట్టారు. లీడర్ షిప్ అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర ఏపీజే అబ్దుల్ కలాం గారు నాయకుడు, మనమంతా గౌరవించే శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారు పాలనాపరంగా గొప్ప నాయకుడు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ అందరికంటే బలమైన నాయకుడు. భారత దేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వ విద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్ధిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి.
• గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం
అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వం ఆధారంగా గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. స్థానిక అవసరాలకు తగిన విధంగా విధి విధానాలకు రూపకల్పన చేశాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం.
స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచనా సిద్ధాంతంగా మిగిలిపోకూడదు, ఫలితంగా కనబడాలన్నదే స్వర్ణ పంచాయతీ. ఇందుకు ఒక ఉదాహరణ. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులలో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కి పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆధాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో ఆస్తుల వివరాలు మాత్రమే అప్డేట్ చేశాం. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఉదాహరణ ఇది. భారత దేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అడుగు ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు. 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే కాదు. గ్రామ పంచాయతీల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు మొదట తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయతీ ముందుగా తన పరిధిలోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది.
రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు. నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడం మన బాధ్యత ఈ దిశగా పని చేస్తన్నాం. నిధుల కోసం, విధానాల కోసం నేను పోరాడగలను. అధికారాల కోసం పోరాడగలను. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ పార్టీ నాయకులు అయినా వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామస్వరాజ్యం సాధ్యం అవుతుంది. సామాజిక విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశాన్ని నిర్మించడం కోసం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, వికసిత్ భారత్ కు మార్గం. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత.
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
• అధికార గర్వానికి ప్రజలు నేర్పిన గుణపాఠమే 2024 తీర్పు
• ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు.. రాష్ట్రాన్ని కాపాడే గొప్ప బాధ్యత
• మహాత్మా గాంధీ, అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సమాహారమే గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi జీ పాలన
• నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రే కీలకం
• స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం
• కుల, ప్రాంతీయ పరిమితులు దాటి భారతీయత వైపు అడుగులు వేద్దాం
• వ్యవస్థలపై నమ్మకం తగ్గితే సమాజం ముక్కలవుతుంది
• రెండేళ్లలో మేము నిర్మించింది రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం
• అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలతాయి
• సమస్య నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే
• గ్రామసభ బలపడితేనే పంచాయతీ బలం.. పంచాయతీ బలపడితేనే ప్రజాస్వామ్యం పదిలం
• ఆఫీసుల్లో కాదు, ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు జరగాలి
• పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల
• డిజిటలైజేషన్తో పల్లెల ముఖచిత్రాలు మారుతున్నాయి
• వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం
• రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత
• తిరుపతి బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
#2YrsOfTrustDevelopmentWelfare
#PawanKalyanAneNenu
#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం
2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం
2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో
ప్రజా సేవకు అంకితమై,
పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
మేము ఇచ్చిన హామీలు ఆచరణలో కనిపిస్తూనే ఉన్నాయి.
పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకు ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు అండ, అన్న క్యాంటీన్లు, విద్యకు ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు. ఇలా ప్రతీది ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.
- సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్.
2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
Promo | First-Ever Podcast of Andhra Pradesh Deputy CM Pawan Kalyan Premieres Today at 5 PM
"If Congress tells me I can't come to Hyderabad, then I have to tell Rahul Gandhi that he doesn't belong to South India."
"In my late teens, I wanted to pick up the gun and become a Naxalite."
"PM Modi speaks to me in English. He is someone who unites the country. Our conversations are always about the nation."
"I liked Dhurandhar and Baramulla."
"I was in Srinagar from 1987 to 1989. The situation was hostile. People would heckle us and ask, 'Why the hell did you come here?'"
Tap 'Notify Me' to get episode alerts: https://t.co/bz70C0kylw
#ANIPodcast #SmitaPrakash #PawanKalyan #Telangana #NarendraModi #Politics #Movies #Telug
Andhra Pradesh securing the 3rd highest allocation in India, with a proposed interim allocation of ₹7,707.21 crore under VB-GRAM-G, is a strong endorsement of our commitment to transparent governance and effective implementation.
This support will accelerate rural transformation, strengthen village infrastructure, improve livelihoods, and create greater opportunities for our farmers, women, youth and Shramikas, whose hard work powers the growth of our State and our nation.
I convey my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his visionary leadership and unwavering focus on rural development. My sincere thanks to Hon’ble Union Rural Development Minister Shri @ChouhanShivraj Ji and the Ministry of Rural Development for their continued support and confidence in Andhra Pradesh.
I once again thank the Government of India for its transparent and objective approach in ensuring that development resources reach states and communities across the nation. We deeply value this trust and will ensure that every rupee entrusted to us creates measurable impact and meaningful change at the grassroots.
Committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh as part of a Viksit Bharat.
- @PawanKalyan@PMOIndia@MoRD_GoI@PIB_India@IPR_AP@pibvijayawada
#VBGRAMG #ViksitBharat #AndhraPradesh #RuralDevelopment
"मातृभूमेः मानार्थम्। कर्मभूमेः कल्याणार्थम्। राष्ट्राय समर्पितम् जीवनम्॥"
This spirit has defined the leadership journey of Hon'ble Prime Minister Sri @narendramodi Ji and the NDA Government over the last 4,399 days of selfless service to the Nation.
Twelve years ago, Bharat chose decisive leadership. Today, Bharat stands stronger, safer, more prosperous, and more confident than ever before.
Under Modi Ji's exemplary leadership, the NDA Government has strengthened national security, modernized our armed forces, emerged as a leading global economy, successfully hosted the G20, amplified the voice of the Global South, and earned respect across the world through decisive and visionary leadership.
From the Digital India revolution, Jan Dhan-Aadhaar-Mobile integration, UPI and Direct Benefit Transfers to Ayushman Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, world-class highways, railways, airports, ports, and Vande Bharat trains, the scale of transformation has been unprecedented.
My sincere gratitude to Hon'ble Prime Minister Modi Ji for his continued support towards the inclusive development of Andhra Pradesh. As we work towards building a $2.4 trillion economy under #SwarnaAndhra2047, Andhra Pradesh is proud to be a strong partner in realizing the vision of #ViksitBharat2047.
India's diversity is our strength. Our many languages are our pride. We will continue to stand firmly for national unity, National Integrity, and inclusive development while resolutely opposing divisive forces.
Jai Hind! Jai Bharat! 🇮🇳
@PMOIndia@BJP4India
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
As Bharat completes 12 remarkable years under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt congratulations and gratitude. These years have been defined by decisive governance, transformative reforms, and an unwavering commitment to the welfare of every citizen, laying the foundation for a stronger, more prosperous, and globally respected Bharat.
From empowering the poor and accelerating infrastructure development to strengthening national security, driving digital transformation, and fostering innovation, Prime Minister Modi Ji has transformed the aspirations of 140 crore Indians into a powerful movement for national progress. Through landmark initiatives such as Atmanirbhar Bharat, Digital India, Startup India, and the vision of Viksit Bharat 2047, he has inspired a new era of confidence, self-belief, and national pride.
On behalf of the people of Andhra Pradesh, I express our sincere gratitude for his continued support, guidance, and commitment to the nation’s development. We remain dedicated to contributing to the collective journey towards a Viksit Bharat and realizing the dreams of future generations.
Jai Hind!
@PMOIndia
విశాఖపట్నం, కలెక్టర్ కార్యాలయం
జూన్ 11, 2026:
విశాఖపట్నంలో గౌరవ శాసనమండలి సభ్యులు,శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ మరియు రెవెన్యూ శాఖాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం. అభిషిక్త్ కిషోర్, IAS గారు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ (ZGS) అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు వినతులు జిల్లా కలెక్టర్ అత్యంత సానుకూలంగా స్పందించారు.
ముఖ్యంగా, నగరంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న జిల్లా కేంద్ర గ్రంథాలయం (DCL), జిల్లా గ్రంథాలయ సంస్థ (ZGS) కార్యాలయాల తాత్కాలిక వసతి కొరకు సుమారు 4000 నుండి 5000 SFT భవనాలు కేటాయించ మని చేసిన అభ్యర్థనపై కలెక్టర్ గారు తక్షణమే స్పందించారు. దండు బజార్లోని సొంత స్థలంలో శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు, సంస్థ అభ్యర్థన మేరకు నగరంలో అందుబాటులో ఉన్నకొన్ని భవనాలను , ఏపీఐఐసీ (APIIC) భవనాన్ని కేటాయించడానికి సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించారు . అలాగే ఆయా నియోజకవర్గాలలో ఉన్న శాసనసభ్యులు సూచన మేరకు పుస్తక నిక్షిప్త కేంద్ర ఏర్పాటు చేస్తామని వారు వారు ఇచ్చే ప్రభుత్వ స్థలాలు క్షుణ్ణంగా పరిశీలించి BDC సెంటర్లు ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ (ZGS) అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గారు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు.
@ncbn@AndhraPradeshCM@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty@naralokesh@JSPShatagniTeam@mnadendla@vizagcollector@NagaBabuOffl@TSivasankararao@itsRamTalluri@GVMC_VISAKHA@sribharatm@BJP4Andhra@TrendPSPK