ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు ఈరోజు ధర్మవరం నియోజికవర్గం, బత్తలపల్లి కేంద్రం ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన సైకిల్ అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అనంతరం మొక్కలు నాటడం జరిగింది.
#WorldEnvironmentDay
#ChandrababuNaidu
#AndhraPradesh
#ParitalaSreeram
#Teamparitala
ఈరోజు బత్తలపల్లి మండల కేంద్రంలోని బీకే ఫంక్షన్ హాల్లో బత్తలపల్లి,తాడిమర్రి మండల కన్వీనర్,క్లస్టర్ ఇంచార్జ, యూనిట్ ఇంచార్జిలు, BLA, మండల టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్పై చర్చించడం జరిగింది. ఎస్ఐఆర్ని ఈ నెల15వ తేదీ నుంచి నిర్వహించనున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాను. జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని, దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మనకు సంబంధించిన ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపాను.
#ParitalaSreeram
#Teamparitala
ధర్మవరం పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిపై సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన వినతి పత్రంపై అధికారులు స్పందించారు. గత రెండు నెలలుగా ధర్మవరం పట్టణంలో కొన్ని ప్రాంతాలలో దాదాపు 10 నుంచి 15 రోజులు వరకు త్రాగునీరు రాకపోవడంతో ప్రజా దర్బార్ లో ప్రజలు నా దృష్టికి తీసుకురాగా.. తక్షణమే సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అమృత్ 2.O పథకం ద్వారా ధర్మవరం పట్టణ నీటి ఎద్దడి నివారణకు 31.73 కోట్లతో మోటర్లు, పైపులైన్లు,మరియు ధర్మవరం పట్టణంలో మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు మంజూరు చేశాయి.
వాటిపై ఈరోజు జిల్లా పబ్లిక్ హెల్త్ అధికారి మరియు టెండర్లు దక్కించుకున్న జెఎస్డబ్ల్యు మేనేజర్ తదితరులు పార్నపల్లి పంప్ హౌస్ ను పరిశీలించడం జరిగింది. ధర్మవరం పట్టణానికి ప్రస్తుతం 25 MLD నీటి సరఫరా జరుగుతోందని, ఆదనపు నిధులు వినియోగం ద్వారా పట్టణానికి 35 MLD నీటి సామర్థ్యం పెరగడం జరుగుతుందని వీటి పనులు ఒక నెలలో ప్రారంభమవుతాయి.
తాగునీటి ఎద్దడి పై తనే స్వయంగా పరిశీలించడానికి, ఎర్రగుంట సర్కిల్ లో గల పంప్ హౌస్ ను ఈరోజు పరిశీలించాను. సంబంధిత మున్సిపల్ డి.ఈ గారితో నీటి సమస్య అడిగి తెలుసుకున్నాను. పూర్వపు మోటర్లు పూర్తిస్థాయిలో మోరాయిస్తున్నాయని కొన్ని కాలిపోయాయని 30 లక్షల రూపాయలతో కొత్తగా 6 మోటర్లకు టెండర్లు పిలిచామని 10 నుండి 15 రోజుల్లో పూర్తిస్థాయిలో ధర్మవరం పట్టణంలో నీటి సమస్య రాకుండా చొరవ తీసుకుంటామని అధికారులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్,శానిటేషన్, ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. పట్టణంలో కొన్నిచోట్ల త్రాగునీటి సమస్య,డ్రైన్స్ సమస్య చెత్తసేకరణ జరగడంలేదని, అధికారులు వీటిపై నిర్లక్ష్యం వహించవద్దని తక్షణమే అధికారులంతా కలిసి సమస్యలను పరిష్కరించాలని కమిషనర్, సంబంధిత అధికారులను కోరడం జరిగింది.
అదేవిధంగా జోన్ 3లో గల ప్రియాంకనగర్, ఎల్సికేపురం,ఎంజి కాలనీ,వైయస్సార్ కాలనీ ఇందిరమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీ L1,L2, L3,L4 ఏరియాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తక్షణమే పై కాలనీలో నీటి సమస్య రాకుండా ఏడు రోజుల్లో త్రాగు నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరాను.
అలాగే జోన్లవారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అధికారులతో పాటు టిడిపి,బిజెపి,జనసేన నాయకులను కూడా వాట్సాప్ గ్రూప్ లో చేర్చి త్రాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించే విధంగా చొరవ తీసుకోవాలని కమిషనర్ ను కోరాను. హిందూ స్మశాన వాటికపై కూడా కమిషనర్ తో చర్చించడం జరిగింది. హిందూ స్మశాన వాటికలో బర్నింగ్ మిషన్ ఏర్పాటు పై వెంటనే చొరవ తీసుకోవాలని కమిషనర్ ను కోరాను. ఈ సమస్యలన్ని వారంలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
#ParitalaSreeram
#TeamParitala
What a spectacular win for Team India in the T20 World Cup semifinal!
A special salute to Sanju Samson for his extraordinary innings , fearless, classy and perfectly timed when the team needed it the most.
On to the final with confidence!
#T20WorldCup2026#IndiaVsEngland
#TeamIndia
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు
విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
#FeeReimbursement
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ధర్మవరం నియోజకవర్గం ప్రజా సమస్య పరిష్కారంలో.. ఈరోజు మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా బత్తలపల్లి మండలం, బత్తలపల్లి గ్రామంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
#Teamparitala#IdhiManchiPrabhutvam#NaraChandraBabuNaidu
ఆయన_ఎమ్మెల్యే_కాదు,ఏ_అధికారిక_పదవిలోను_లేడు అయిన సరే క్యాడర్ ఎక్కడా కూడా డీలాపడకుండాప్రతీనాయకుడిలోను,కార్యకర్తలోనునమ్మకాన్నిధైర్యాన్నినింపిముందుకునడిపించడంలోఆయనకిసరిలేరుఎవరుధర్మవరంనియోజకవర్గం గౌరవ ఇంచార్జ్ పరిటాలశ్రీరామ్ గారి ఆదేశాలతో హిందూపురం పార్లమెంటరీలోనే నెంబర్ వన్ స్థానంల