తిరువణ్ణామలై కార్తీక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైర���్గా మారాయి!
“హిందూ ధర్మంపై దాడి చేయడమేనా మీ సెక్యులరిజం?” అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
#PawanKalyan #KarthigaiDeepam #Tiruvannamalai #Sanatan
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM @PawanKalyan visited the site, reviewed the violations, briefed Hon’ble CM Sri @ncbn garu, and Cabinet Ministers, and immediately ordered a comprehensive probe.
Pawan Kalyan directed officials to:
🔸Publish the names of all forest land encroachers on the department website.
🔸Reveal the extent of encroachment and the status of cases on each individual.
🔸Take strict legal action against anyone who grabbed forest land, without exceptions.
🔸Investigate discrepancies in land records, including inflated Webland entries and false claims of “ancestral land” inside protected forest areas.
🔸Act based on vigilance reports and legal expert guidance.
🔸Digitize all land records to prevent manipulation and ensure transparency.
Forest lands are national assets. Those who encroach upon them, misuse them, or violate forest laws, no matter who they are, will be held accountable. The government will not tolerate the grab of protected forest areas or wildlife zones.
@PMOIndia@moefcc@byadavbjp@AndhraPradeshCM@PIB_India@pibvijayawada@IPR_AP
#OperationAranya
ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలి
•డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాలి
•స్మగ్లింగ్ అరికట్టడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలి
•స్మగ్లర్లతోపాటు కింగ్ పిన్లపైనా ఉక్కుపాదం మోపండి
•మన ఎర్ర చందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలవద్దు
•ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
‘రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే ���క్ష్యంతో అటవీ శాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టాలి. ఇందుకోసం స్మగ్లింగ్ ముఠాలపై నిఘా పెంచాలి. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాల’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. స్మగ్లింగ్ ముఠాల నెట్ వర్క్ న��� మూలాలతో సహా నిర్మూలించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, రెండేళ్లలో ఏ మేరకు స్మగ్లింగ్ నిరోధించారు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఈ సందర్భంగా గడచిన రెండ���ళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతి, నమోదైన కేసుల వివరాలను అధికారులు వివరించారు.
•506 కేసులు... 1239మంది అరెస్టు
గత రెండేళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 506 కేసులు నమోదు చేసి, 1,239 మందిని అరెస్ట్ చేయగా, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెల���పారు. అలాగే, 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి, ఆయా రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాగే, ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో కన్విక్షన్ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉండేదని, 95 శాతం కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించే స్థాయికి కన్విక్షన్ రేటు పెరిగిందని వివరించారు.
గతంలో స్మగ్లర్లపై పీడీ చట్టం అమలు చేయని పరిస్థితి ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 12 మంది స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
•సమన్వయం తక్షణ అవసరం
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకించిన అటవీ సంపద... ఎర్ర చందనం. కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎర్ర చందనం స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలి. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ ��ిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖ అధికారులతో సమన్వయం తక్షణ అవసరం. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కింగ్ పిన్స్, ఫైనాన్షియర్స్ పైనా దృశ్య్ సారించాలి. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి చెందిన విలువైన ఎర్రచందనం సంపదను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ నిఘాను మరింత విస్తృతంగా వినియోగించాలి. అంతర్రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాల”న్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు
•వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు
నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది.
శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)
పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ)
అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ)
కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం)
•అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు
తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు)
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట)
బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు)
ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి)
శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల)
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు
రెండో దశలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ మేరకు ఎన్నికల సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఎన్నికల్లో స్థానికంగా జన���ేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో కమిటీలు కృషి చేస్తాయి.
*కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు
1. శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
2. శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు
3. శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
4. శ్రీ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే
5. శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే
6. శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి. గన్నవరం ఎమ్మెల్యే
7. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, APMSIDC చైర్మన్
8. శ్రీ సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ ��ిల్లా జనసేన అధ్యక్షుడు
9. శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్
10. శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
*శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు
1. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు
2. శ్రీ సుందరపు విజయ్ కుమార్ , యలమంచిలి ఎమ్మెల్యే
3. శ్రీమతి లోకం మాధవి, నెల్లిమర్ల ఎమ్మెల్యే
4. శ్రీ నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఎమ్మెల్యే
5. శ్రీ టి. శివశంకర్, ఏపీ ఎంఎస్ఎంఈ, చైర్మన్
6. శ్రీ కొరికాన రవికుమార్, సుడా ఛైర్మన్
7. శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మేయర్
8. శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
9. శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు
10. శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development.
@PawanKalyan