ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే సమాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra
నిజానికి ఏదో వ్యూస్ కోసమో, రాజకీయ ఉనికి కోసమో కొందరు నిందలు వేశారు తప్పా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆస్తి దోచుకుంటారంటే వారి మనస్సాక్షే ఒప్పుకోదు.
పోనీ ఒప్పుకున్నా...నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వాస్తవాలను స్పష్టంగా చెప్పేశారు.
ఇక ఈ స్వయం ప్రకటిత మేధావులకు తెలంగాణలో గతంలో, నేడు అధికారంలో ఉన్న పార్టీల మంత్రులు, నేతలు చేసిన కబ్జాలపై ఇదే స్వరంతో గంటకొక వీడియో చేసి మాట్లాడే దమ్ముందా?
#HYDRAA #Hyderabad
Heartiest birthday wishes to Hon’ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji.
Wishing you good health, happiness, and a wonderful year ahead. May you continue to serve the people with strength, wisdom, and unwavering commitment. Wishing you many more years of purposeful leadership and continued success.
- @PawanKalyan@CMOMaharashtra@PIBMumbai
మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు
•పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి
•ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఉపముఖ్యమంత్రివర్యుల సూచనతో రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ అనే కుంకీతో పాటు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన అభిమన్యుని పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండూ… మానవ–ఏనుగు సంఘర్షణ నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అనుభవం కలిగిన కుంకీ ఏనుగులు. ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్ లు ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై విజయవంతంగా పూర్తి చేశాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్ లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. రెండింటి మధ్య సమన్వయం, ఆపరేషన్లలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలివస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడవుల విభజన, అటవీ ఆవరణ తగ్గడం, ఆహారం, నీటి కొరత తదితర సమస్యల కారణంగా తరచూ అడవి ఏనుగులు ఒడిశా సరిహద్దుల నుంచి మన్యం జిల్లాకి చెందిన గ్రామాల్లో చొరబడుతున్నాయి. మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, తిరిగి మళ్లింపు చర్యలు చేపట్టడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అంతకంటే ముందు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రెండు కుంకీలను పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపుకి తరలించాలని ఆదేశించారు. గుచ్చిమి క్యాంపు నుంచి ఈ రెండు ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సంఘర్షణల నియంత్రణ చర్యలు చేపడతారు. వీటితోపాటు సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు వీలుగా కందకాలు తవ్వడం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచి, సమస్య తీవ్రత ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అమలు చేయనున్నారు.
బాధితుల పట్ల ఒక్క మాట సానుభూతి లేదు... తప్పు చేసిన వారిని ఖండించే ధైర్యం లేదు.
తమ పార్టీ మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం తల దించుకుంది..!
ఇదేనా మీ రాజకీయ నైతికత?
#YSRCriminalParty
మునికూడలికి మోడల్ పుష్కర్ పంచాయతీ హంగులు
• శరవేగంగా సప్త ఋషి ఘాట్ అభివృద్ధి
• గ్రామం మధ్య నుంచి గోదావరి తీరం వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి
• పురోగతిలో మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, పబ్లిక్ టాయిలెట్స్ పనులు
• యాత్రికుల సౌకర్యార్థం సమాచార కేంద్రానికి ఆధునిక హంగులు
• పనుల పురోగతిపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో శ్రీ @PawanKalyan గారు సమీక్ష
‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్ తో గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం పరిధిలోని మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మునికూడలి గ్రామం మరియు సప్త ఋషి ఘాట్‌ను పర్యావరణహితంగా, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది.
మునికూడలి మోడల్ పుష్కర్ పంచాయతీ పనుల పురోగతిపై సోమవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, కమిషనర్ శ్రీ కృష్ణ తేజలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మునికూడలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో సాగుతున్న అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా సప్త ఋషి ఘాట్‌కు చేరుకునేందుకు గ్రామం మధ్య నుంచి ఘాట్ వరకు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేసి సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే ఘాట్ ప్రాంతంలో నీటి ప్రవాహాలు, తడి కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా 3.5 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ ఫ్లాట్‌ఫారమ్ నిర్మాణం చేపట్టగా, ఈ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సప్త ఋషి ఘాట్ పరిసరాలను రాత్రి వేళల్లో సైతం సురక్షితంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు హైమాస్ట్ విద్యుత్ దీప స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సిమెంట్ పునాది నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. విద్యుత్ శాఖకు సంబంధించి రూ. 1.50 కోట్లు పనులు పూర్తయ్యాయి. అందులో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఆరు ట్రాన్స్ ఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్లు, స్తంభాలు తదితర పనులు దాదాపు పూర్తయ్యాయి.
మునికూడలి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, మురుగునీటి పారుదలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం కొనసాగుతోంది. అలాగే వ్యర్థజలాల శాస్త్రీయ నిర్వహణ కోసం సామూహిక ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. పనులు పురోగతిలో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం ఘాట్ సమీపంలో ఆధునిక సమాచార కేంద్రం, అలాగే అత్యాధునిక సదుపాయాలతో కూడిన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే మూడు వంతులు పూర్తయి, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయి, పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
BRS వైఫల్యం... కాంగ్రెస్ నిర్లక్ష్యం...
తెలంగాణలో పార్టీలు మారాయి పాలన మారింది కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఎక్కడ?
Let's all expose the failures of BRS & Congress in securing the future of Telangana youth.
Hashtags at 6:30PM..!!
@JSPTelangana
#PawanKalyanAneNenu
Leadership beyond Conventional Politics - An exclusive video !
• Getting Kumki Elephants from Karnataka
• Requesting Tigers from Maharashtra
• Seed balls for "HarithaAndhra"
• Great Green Wall of Andhra
• Farm Ponds, Cattle Troughs
• Swach Ratham
• Clearing Pending promotions in Panchayat Raj Department
• Palle Panduga & many more..
వైద్యుల సూచనతో మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దూరం
•మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణ
ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులకు సూచించారు. వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని కార్యాలయ అధికారులకు సూచనలు చేశారు.
అదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
#JSPMembershiptoLeadership
JanaSena Membership has protected families with financial assistance when they needed it the most & has opened the doors of leadership to dedicated grassroots workers.
A testament to JanaSena's unwavering assurance to every common citizen..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో పాల్గొన్నాను. 'నేషన్ ఫస్ట్' భావనతో పాటు ఏపీ రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా సభలో గళం వినిపించాలని అధినేత దిశానిర్దేశం చేశారు.