TamilNadu Government School Student Secures First Place in English Literature Speech Competition – A Joyful Interview
#Chennai | #SchoolStudents |
#DravidianModel
ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్న DCM గారికి కొన్ని ప్రశ్నలు @PawanKalyan
ఎ అనుభవం తో 30 వేల మంది అమ్మాయిల్ని వాలంటీర్లు ఎత్తుకెళ్లారన్నావ్
ఎ అనుభవం తో తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మెట్లన్ని కడిగేసి నేను సనాతన ధర్మం ఉద్దరిస్తనన్నావ్
ఎ అనుభవం తో సుగాలి ప్రీతి కి న్యాయం చేసేస్తా నన్ను నమ్మండన్నావ్
ఎ అనుభవం తో జగన్ తన చెల్లిని కొట్టాడన్నావ్
ఎ అనుభవం తో YSR నే ఎదుర్కున్నా నన్నావ్
నాకు తెలిసి నీకున్న అనుభవం ఎవరు ఎ కులం అని బయటకి చెప్పడం
DCM చెప్పే దాకా దిల్ రాజు రెడ్డి అని నాకు తెలీదు
మొన్న DCM చెప్పే దాకా వంగవీటి వైఫ్ కమ్మ అని తెలీదు అలాంటివి అవసరం లేకున్నా చెప్తాడు
మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు @ncbn గారి రాజకీయ కక్ష్యకు నిదర్శనం. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద YSR విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ @INC_Andhra పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని , సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో YSR విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలి. వెంటనే YSR విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా.
@APPOLICE100@dgpapofficial@Anitha_TDP
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.
కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్ రిపోర్టులు చూపుతూ, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా?
ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.
English Version - https://t.co/jPDnnbQKk2
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం.
జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు?
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?
మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ చేశారు చంద్రబాబూ.
@ncbn గారూ… , మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది.
#YSRCPForFarmers
English Version- https://t.co/KZJXWNs4ni
చంద్రబాబు మూడు, నాలుగు మందిని కనమని చెప్తున్నాడు
చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రం ఒకరినే కన్నారు
ఎక్కువ మంది పిల్లలు ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ప్రజలు పేదరికం లోనే మగ్గిపోవాలి అని ఆయన ఆలోచన
- వైఎస్ జగన్