గొల్లప్రోలు విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
నాలుగు సంవత్సరాల నుండి రక్షిత త్రాగునీటి సదుపాయం లేక అవస్థలు పడుతున్న 449 మంది విద్యార్థులు కలిగిన, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల సమస్యను తెలుసుకుని, సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయం గుర్తించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రైస్ మిల్ యాజమాన్యంతో జిల్లా అధికారులు మాట్లాడి ఒప్పించారు.
4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో RO ప్లాంట్ కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా, విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
@AndhraPradeshCM@IPR_AP@pibvijayawada
గుడివాడ నియోజకవర్గంలో నీటి నమూనాల సేకరణ
•ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో తాగు నీటి నాణ్యత పరీక్షలు
•44 మంది ఇంజినీరింగ్ సహాయకులతో ఆరు బృందాలు ఏర్పాటు
•మూడు మండలాల్లో పర్యటించి నమూనాలు సేకరించి, ల్యాబ్స్ లో పరీక్షలు
'పల్లె పండుగ' కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గుడివాడ నియోజక వర్గంలోని 44 నివాస ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, అక్కడ ఉన్న నీరు రంగు మారిపోయి ఉన్న సమస్య వచ్చాయి. తక్షణమే ఆ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని, అక్కడ ఉన్న నీటిని పరీక్షించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ వేదిక నుంచే ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆర్.డబ్ల్యూ.ఎస్. యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి నమూనాల సేకరణ మొదలుపెట్టింది.
గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నీరు రంగు మారిపోయి తాగేందుకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారు రంగు మారిన నీటిని సీసాల్లో చూపించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఈ బృందాల్లో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని ఏడు నివాస ప్రాంతాలలో వీరు మంగళవారం పర్యటించి నీటి నమూనాలు సేకరించారు. అక్కడి ప్రజల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. ఈ నీటి నమూనాలను ల్యాబ్స్ కి పంపించారు. నీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్వచ్ఛమైన తాగు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయానికి వివరాలు అందించారు. @APDeputyCMO@AndhraPradeshCM@MoJSDDWS
This vengeful action by the @ysjagan government contributed to the Budameru flooding in Vijayawada. As part of his 'reverse' administration, Jagan in 2020 cancelled approval for 198 works, including 4 packages for the modernization of the Budameru channel.
I thought of visiting flood affected areas,but officers advised me not to visit, as it will cause inconvenience for the rescue & relief operations, - Deputy CM @PawanKalyan.
#VijayawadaFloods
రాష్ట్ర యంత్రాంగం మొత్తం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐఏఎస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నేను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే, వరద సహాయక చర్యలపై ప్రభావితం చూపుతుందన్న అధికారుల సూచన మేరకు ఆగిపోవాల్సి వచ్చింది.
- ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
@JanaSenaParty@PawanKalyan
#APGovtWithFloodVictims #VijayawadaFloods