Promo | First-Ever Podcast of Andhra Pradesh Deputy CM Pawan Kalyan Premieres Today at 5 PM
"If Congress tells me I can't come to Hyderabad, then I have to tell Rahul Gandhi that he doesn't belong to South India."
"In my late teens, I wanted to pick up the gun and become a Naxalite."
"PM Modi speaks to me in English. He is someone who unites the country. Our conversations are always about the nation."
"I liked Dhurandhar and Baramulla."
"I was in Srinagar from 1987 to 1989. The situation was hostile. People would heckle us and ask, 'Why the hell did you come here?'"
Tap 'Notify Me' to get episode alerts: https://t.co/bz70C0kylw
#ANIPodcast #SmitaPrakash #PawanKalyan #Telangana #NarendraModi #Politics #Movies #Telug
<14-03-2014>
Party pettina roje cheppadu...
Aayana telangana ki vyathirekam kaadhu... Vibhajinchina theeru ki vyathirekam ani...
Asalu 2009 lo prakatinchinappude correct ga vibhajisthe vela mandhi vidyarthulu amarulu ayyevaallu kaadhu ani cheppina oke oka leader @PawanKalyan
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
👉🏻#NoGheeInTTDLaddu
అసలు నెయ్యి వాడకుండా నెయ్యి పేరుతో ₹250 కోట్ల కుంభకోణం చేసిన గత @YSRCParty ప్రభుత్వం.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులుగా ప్రమాదకర రసాయనాలతో 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడికి కేంద్రంగా చేసుకున్న గత TTD పాలకులు.
👉🏻 నెయ్యి కల్తీ చెయ్యడానికి భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ
👉🏻 సీబీఐ నేతృత్వంలోని SIT దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు
👉🏻నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారణ
Video credits - @TV9Telugu
#TirumalaLaddu #SanatanaDharmaRakshaBoard
A rare honour recognising the lifelong commitment of Sri. @PawanKalyan, Deputy Chief Minister of Andhra Pradesh, excellence in martial arts. May the path ahead be blessed with strength, purpose, and continued success.
@PKCWoffl#PKMartialArtsJourney
Heartfelt congratulations and best wishes to Dy. CM Shri @PawanKalyan Ji for launching the path-breaking H.A.N.U.M.A.N Project.
Shri @PawanKalyan Ji leads with purpose — protecting wildlife, empowering farmers, and integrating modern technology for forest.
#HANUMAN
🚨 ‘Great Green Wall of Andhra Pradesh’
Dy CM Pawan Kalyan launched it on Friday at a state-level workshop of forest officers in Kondapavuluru.
Mangrove plantations and coastal afforestation along 974 km from Srikakulam to Nellore will protect coastal ecosystems & communities.
రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan
• అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం
• అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం
అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయలకు తావుండదు. రాజీకి తావుండదు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం. గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు అడవుల రక్షణ విషయంలో మార్గదర్శకం చేస్తున్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే, నాడు అధికారులు ఎందుకు స్పందించలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు.
కృష్ణా జిల్లా కొండపావులూరులోని NDMA ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొని అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ శాఖలో విభిన్నమైన బాధ్యతలు పంచుకోవడానికి సరిపడినంత సిబ్బంది లేరని ప్రతి సమీక్షలోనూ అధికారులు నా దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సమస్య అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందు ఉంచాం. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలి. ఎలాంటి సిఫార్సులకు తావివ్వవద్దు. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైనది. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా నన్ను కలిసి సమస్యను చెప్పండి. శ్రీశైలం ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నాను. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశాం. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దు.
రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయి. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలి. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దు. 2047 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలి. దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరం. భావితరాలకు పచ్చదనాన్ని పెంపొందించేలా చైతన్యవంతులను చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం.
మానవులు - జంతువుల సంఘర్షణను అరికట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలి. రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మదపుటేనుగుల సంచారం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో సమస్య పరిష్కారానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చాం. శ్రీకాకుళంలో తొమ్మిది ఆడ ఏనుగులు సంచరిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇవి ఒడిశా నుంచి వచ్చాయి. ఒడిశాలో మైనింగ్ పెరిగిపోవడంతో అవి ఇటు వైపు వలస వచ్చినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో అవి తిరుగుతున్న ప్రాంతం మొత్తం పంట పొలాలున్న ప్రాంతం. ఈ సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తిరిగి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటాం.
అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, గిరిజనుల కోసం ఏదైనా చేయాలన్న తపన, నిబద్దతతో పని చేయాలని ముందుకు వచ్చే అధికారులకు కూటమి ప్రభుత్వం తరఫున మావంతు సహకారం అందిస్తాం. అడవులను కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చని హరితాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం” అన్నారు.
అంతకు ముందు ఎన్ఐఆర్డీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి ప్రతి మొక్క వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. జమ్మి చెట్టును నాటారు. ఈ వర్క్ షాప్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జున రావు, శాఖ ఉన్నతాధికారులు శ్రీ రాహుల్ పాండే, శ్రీమతి శాంతిప్రియా పాండే, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ శ్రీ పి.ఎస్. రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ, ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. (1/2)
జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ
•గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం
• ఆత్మ నిర్భర భారత్ తో దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు శ్రీ మోదీ గారు
• పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి
• కూటమి ఆధ్వర్యంలో 15 ఏళ్లపాటు స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి
• సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
‘దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలు ఉండవు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టిన శ్రీ మోదీ గారి కృషితో దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లు వెల్లువెత్తుతున్నాయన్నారు.
గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని తెలిపారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అని అభివర్ణించారు. కర్నూలు నగర శివారు నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం మన అదృష్టం. శ్రీ మోదీ గారు దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను ముందుకు నడుపుతున్నారు. భావి తరానికి మార్గదర్శనం చేస్తున్నారు. దేశం తలెత్తుకొనేలా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకువచ్చారు. మేము సేవకులం మాత్రమే కాదు అవసరం అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని చాటి చెప్పారు. భారత్ అగ్రగామి.. ఎవరికీ భయపడే దేశం కాదని చేతల ద్వారా తెలియ చెప్పారు.
* ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తాము
ఒక దేశపు జెండా ఎలా పౌరుషంగా ఉంటుందో.. అలాగే మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన శ్రీ మోదీ గారు ఈ రోజున మన రాష్ట్రానికి విచ్చేసి రూ. 13 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్క ఓర్వకల్లు పారిశ్రామికవాడలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు రావాలి అంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసి ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాను" అన్నారు.(1/2)
#SuperGSTSuperSavings
The path to ‘Viksit Bharat’ from the City of Destiny is now being paved!
Visakhapatnam securing the $15 Billion Google AI Data Centre and India's first AI City is a monumental leap. This initiative guarantees that the power of AI for All is truly democratized, impacting the lives of our youth, farmers, doctors, fishermen, entrepreneurs, women and students.
This milestone is a direct result of Hon'ble PM @narendramodi Ji's relentless push for a Viksit Bharat and the global confidence his vision has created. The ability to secure this monumental project is a clear testament to the brand and four decades of visionary experience of Hon’ble CM Shri @ncbn Garu.
This is our collective moment to build the AI hub in Bharat and harness this technology to improve the quality of life of every citizen. Along with the government, this new era of progress needs all of us - the Youth to innovate, Academia to research, Citizens to engage and Industry to scale.
Let's build this future, together. Jai Hind!
#VizagAITechnologyHub #ViksitBharat #CollectiveResponsibility #AIforAll
పకడ్బందీ ప్రణాళికతో తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు
• ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి
• పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియలో పర్యవేక్షణలో పారదర్శకత వ్యవహరించాలి
• 100 రోజుల ప్రణాళికతో మత్స్యకారుల సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణ
• కాకినాడ జిల్లాలో తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి
• వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి
• కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం
• పారిశ్రామిక వర్గాలు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలి
• కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న క్రమంలో అక్కడి పరిస్థితులపై తక్షణం అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. అందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసే 100 రోజుల ప్రణాళికను తక్షణం అమలు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకోబోయే చర్యలు ఒక మోడల్ గా దేశం మొత్తం పాటించే విధంగా ఉండాలన్నారు. శనివారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్దాల నిర్వహణపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత, కాకినాడలో మత్స్యకారులతో జరిగిన ‘మాట.. మంతి’ కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన సమస్యలు తదితర అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా తీర ప్రాంతాల వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే రసాయిన వ్యర్ధాలు తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు మత్స్యకారుల్లో ఉన్నాయి. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల ఆందోళనకు చేయడానికి అదే ప్రధాన కారణం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన మాటా.. మంతి కార్యక్రమంలో రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలిపేయడం కారణంగా వారు ఇబ్బందులుపడుతున్నామని చెప్పారు. మత్స్యకారుల్లో సందేహాలు నెలకొన్న క్రమంలో వారి సూచనల మేరకు తక్షణం ఆయా పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలి. ఆ పరిశ్రమలు ఏ మేరకు కాలుష్యాన్ని సముద్రంలో కలుపుతున్నాయి, జల వాయు కాలుష్యం ఎంత అనే అంశాలపై అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక రూపొందించాలి. పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేసే వ్యర్థ జలాలపై పర్యవేక్షణ విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలి. పర్యవేక్షణ బృందాల్లో విద్యావంతులైన స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలి.
మత్స్యకారుల సమస్యల పరిష్కారం, కాలుష్య నియంత్ర తదితర అంశాలపై 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలి. అందులో భాగంగా కాలుష్య కారక పరిశ్రమల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కాలుష్య నియంత్రణ పద్దతులలో, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆధునీకరించి, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి ఏదైనా సమస్య గుర్తిస్తే దాన్ని సరి చేసుకునే విధంగా ఆయా కంపెనీలను ఆదేశించాలి. ఇందుకు సంబంధించి పీసీబీ, ఇతర స్టేక్ హోల్డర్స్ తో కలసి 100 రోజుల్లో పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాల"ని సూచించారు.
ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది కొరత సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పీసీబీలో సిబ్బంది లేరని, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ‘అవసరాలకు అనుగణంగా సిబ్బంది నియామకం చేపట్టే అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో చర్చిస్తాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకుని పరిశ్రమల్లో కాలుష్య తీవ్రత నిర్ధారించడం, నివారించడంపై దృష్టి సారించాలి.
అలాగే పారిశ్రామిక వర్గాలు కూడా కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలి. అభివృద్ధి చెందిన దేశాలు– రసాయన వ్యర్థాల నిర్వహణలో, గాలిలో కలిసే కాలుష్య కారకాల విషయంలో సరికొత్త విధానాలను అమలు చేస్తూ కాలుష్యాన్ని తగ్గించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వర్గాలు కూడా ఈ అంశం మీద దృష్టి సారించాలి. శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకోవాలి. అందుకోసం అవసరం అయితే పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాల’న్నారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా.కృష్ణయ్య, మెంబర్ సెక్రటరీ శ్రీ ఎస్.శరవణన్, సీనియర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
@PMOIndia@HMOIndia@AndhraPradeshCM@moefcc@PIB_India@IPR_AP@pibvijayawada@CollectorKakin1@KAKINADAPOLICE